సారాంశం
మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంధి, అలాగే ఒక అంతర్గత అవయవము. ఇది జీర్ణక్రియ, పోషక జీవక్రియ మరియు నిలవ, మందుల వలన కలిగు పరిణామములు, మద్యము, మరియు జీవక్రియ సమయంలో ఉత్పత్తి జరిగే హానికరమైన రసాయన పదార్థాలు, మరియు ప్రత్యేక ప్రోటీన్లు మరియు గడ్డకట్టే పరిస్తితులు వంటి అనేకములైన ముఖ్య విధులు నిర్వహిస్తుంది. కాలేయము పనిచేయు విధానములో మరియు నిర్మాణములో ఏదేని అసాధారణత ఉన్నచో దానిని కాలేయ వ్యాధిగా చెప్పవచ్చును. కాలేయ వ్యాధులు మద్యపానం, ఊబకాయం, పరాన్నజీవులు, వైరస్, బాక్టీరియా, మరియు కొన్ని మందుల వలన లేదా విషాల వలన కలగవచ్చును. కాలేయము అనేక విధులను నిర్వహిమ్చుట వలన, కాలేయ వ్యాధి లక్షణాలు గొప్ప మార్పును కలిగిస్తాయి, కానీ కాలేయ వ్యాధిని గుర్తించు ముఖ్య లక్షణము కామెర్లు. కామెర్లవారికి, చర్మము మరియు కళ్ళు పసుపు రంగుకి మారుట మరియు మూత్రము ముదురు పసుపుగా మారుట జరుగును. రోగ నిర్ధారణ కొరకు సాధారణ రక్త పరీక్షలు, అల్ట్రాసోనోగ్రఫీ లేదా సిటి స్కాన్ మరియు కాలేయ జీవాణుపరీక్షలు జరుపుతారు. కాలేయ వ్యాధి యొక్క చికిత్స అనేది మూల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కాలేయ కాఠిన్యత వ్యాధిలో, కాలేయములో మచ్చలు ఏర్పడతాయి. సిర్రోసిస్ కాలేయమును పని చేయకుండా చేస్తుంది, ఇది కాలేయ వ్యాధి యొక్క అంతిమ స్తాయిగా ఎంతో పేలవమైన రోగనిర్ధారణతో తెలుస్తుంది.