కాలేయ వ్యాధి - Liver Disease in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

November 01, 2018

March 06, 2020

కాలేయ వ్యాధి
కాలేయ వ్యాధి

సారాంశం

మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంధి, అలాగే ఒక అంతర్గత అవయవము. ఇది జీర్ణక్రియ, పోషక జీవక్రియ మరియు నిలవ, మందుల వలన కలిగు పరిణామములు, మద్యము, మరియు జీవక్రియ సమయంలో ఉత్పత్తి జరిగే హానికరమైన రసాయన పదార్థాలు, మరియు ప్రత్యేక ప్రోటీన్లు మరియు గడ్డకట్టే పరిస్తితులు వంటి అనేకములైన  ముఖ్య విధులు నిర్వహిస్తుంది. కాలేయము పనిచేయు విధానములో మరియు నిర్మాణములో ఏదేని అసాధారణత ఉన్నచో దానిని కాలేయ వ్యాధిగా చెప్పవచ్చును. కాలేయ వ్యాధులు మద్యపానం, ఊబకాయం, పరాన్నజీవులు, వైరస్, బాక్టీరియా, మరియు కొన్ని మందుల వలన లేదా విషాల వలన కలగవచ్చును. కాలేయము అనేక విధులను నిర్వహిమ్చుట వలన, కాలేయ వ్యాధి లక్షణాలు గొప్ప మార్పును కలిగిస్తాయి, కానీ కాలేయ వ్యాధిని గుర్తించు ముఖ్య లక్షణము కామెర్లు. కామెర్లవారికి, చర్మము మరియు కళ్ళు పసుపు రంగుకి మారుట మరియు మూత్రము  ముదురు పసుపుగా మారుట జరుగును. రోగ నిర్ధారణ కొరకు సాధారణ రక్త పరీక్షలు, అల్ట్రాసోనోగ్రఫీ లేదా సిటి స్కాన్ మరియు కాలేయ జీవాణుపరీక్షలు జరుపుతారు. కాలేయ వ్యాధి యొక్క చికిత్స అనేది మూల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కాలేయ కాఠిన్యత వ్యాధిలో, కాలేయములో మచ్చలు ఏర్పడతాయి. సిర్రోసిస్ కాలేయమును పని చేయకుండా చేస్తుంది, ఇది కాలేయ వ్యాధి యొక్క అంతిమ స్తాయిగా ఎంతో పేలవమైన రోగనిర్ధారణతో తెలుస్తుంది.

కాలేయ వ్యాధి యొక్క లక్షణాలు - Symptoms of Liver disease in Telugu

కాలేయ వ్యాధి ప్రారంభ దశలో అరుదుగా కనిపించే లక్షణాలు, కొనసాగినప్పటికీ, అవి అస్పష్టముగా మరియు నిర్దిష్టముగా ఉంటాయి. అయితే, కాలేయ కణాల గాయాలలో లేదా సరిచేయు సమయములో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి.

ఖచ్చితమైన కాలేయ వ్యాధి లేదా ఖచ్చితమైన హెపటైటిస్ వ్యాధి వంటి లక్షణాలు ఇలా ఉన్నాయి:

  • తీవ్రస్తాయి జ్వరము.
  • వికారము.
  • వాంతులు.
  • కామెర్లు.
  • చర్మము మీద దురదలు.
  • మూత్రము ముదురు పసుపుపచ్చగా ఉండుట.
  • కళ్ళు పసుపు పచ్చగా మారుట.

నిరంతరంగా ఉన్న కాలేయ వ్యాధి లక్షణాలు వీటితో కలిసి ఉంటాయి:

  • కామెర్లు
  • పొత్తి కడుపులో నెప్పి మరియు వాపు.
  • వికారం.
  • వాంతులు.
  • కీళ్ళ మరియు కాళ్ళ వాపు.
  • దురద.
  • స్పైడర్ నేవి (చర్మంపై రక్తనాళాల చిన్న ఎరుపు, సాలీడు వంటి ఆకారంలో).
  • ఆకలి లేకపోవుట.
  • బరువు తగ్గిపోవుట.
  • కనీసం చిన్నపని కూడా చేయలేని బలహీనత.
  • తేలికగా వచ్చే గాయాలు.

కాలేయ వ్యాధి సిర్రోటిక్ దశలో బాగా వృద్ది అయితే, కొత్త లక్షణాలు కనిపిస్తాయి, అనగా:

  • వంతులలో రక్తము (హేమాటేమెసిస్).
  • గుదము నుండి రక్తస్రావము.
  • పొత్తికడుపులో నిలిచిపోయిన ద్రవము (అస్సిటేస్).
  • గజిబిజి.

పైన చెప్పిన సంకేతాలు మరియు లక్షణాలు కొన్ని కాలేయ వ్యాధులలో ఆ పరిస్తితికి సంబంధించి విచిత్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ సిర్రోసిస్ కి చికిత్స చేయకపోతే, ఇది కాలేయము పాడవుటకు దారితీస్తుంది, అప్పుడు వైద్యము అత్యవసరం అవుతుంది మరియు తెలివిగా లేకపోవుట, గజిబిజి శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో పాటు కోమా వంటివి కలగచ్చు.

కాలేయ వ్యాధి యొక్క చికిత్స - Treatment of Liver disease in Telugu

వ్యాధి నిర్ధారణ ప్రకారము కాలేయ వ్యాధులకు చికిత్స అందిస్తారు. కొన్ని ముదిరిన సందర్భాలలో, నివారణకు చికిత్స కుదరదు, పాలియేటివ్ చికిత్స లక్షణాల తీవ్రతను తగ్గించుటకు లేదా సమస్యల వలన వ్యాధి ప్రబలకుండా అడ్డుకోనును. తరచుగా వాడే చికిత్స పద్ధతులు కొన్ని:

  • యాంటీవైరల్ థెరపీ
    దీర్ఘకాలిక హెపటైటిస్ బి మరియు సి వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీవైరల్ మందులతో  చికిత్స జరుగుతుంది, ఇవి సాధారణంగా ఎక్కువ కాలం వాడమని చెప్తారు.
  • యాంటిబయోటిక్ థెరపీ 
    కాలేయ గాయమునకు నోటిద్వారా యాంటీబయాటిక్ థెరపీ అవసరము, కానీ ఎక్కువగా ఉన్న సందర్భాలలో, చీము కారుట సత్వర నివారణకు ఇంట్రావీనస్ యాంటిబయోటిక్స్ అవసరము.
  • కాంబినేషన్ థెరపీ 
    స్వీయ రోగనిరోధక హెపటైటిస్ సంధర్భాలయందు ఇది ఉపయోగించబడుతుంది. ఈ థెరపీ,  కార్టికోస్టెరాయిడ్స్ ఇమ్యునోస్ప్రెసివ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల కలయికతో చేస్తారు. ఈ మందులు రోగనిరోధక వ్యవస్థ యొక్క తీవ్రతను మరియు కాలేయములో వాపును తగ్గిస్తాయి.
  • చిలేషన్ థెరపీ 
    విల్సన్ వ్యాధి విషయంలో, రాగి పెన్సిలామైన్ తరగతి మందులని వాడతారు. రాగి యొక్క అయాన్లు మందు వలన మూత్రంలో విసర్జించబడతాయి. వెంట వెంటనే, ట్రైఎంటైన్ వాడతారు ఇది తక్కువ దుష్ప్రభావాలతో ఉంటుంది.
  • రిపీటేడ్ ఫిలెబోటోమి
    తల్లితండ్రలనుంచి పిల్లలకు వచ్చే హెమోక్రోమాటోసిస్ విషయంలో ఇది జరుగుతుంది. ఫిలెబోటోమి అనునది  అధిక రక్త ఖనిజ స్థాయిలను తగ్గించుటకు శరీర సిరల నుండి రక్తమును తొలగించే ఒక ప్రక్రియ.
  • సపోర్టివ్ థెరపీ
    కొన్ని కాలేయ ఎంజైములు లేదా ప్రోటీన్లు కాలేయ కణములపై భారమును తగ్గించుటకు  కొన్ని మందులుగా సహాయకములుగా ఇవ్వబడతాయి.
  • సర్జరీ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్
    ఒకవేళ వ్యాధి తీవ్రంగా మరియు నయంకానిదిగా ఉంటే, కాలేయ మార్పిడిని నిర్వహిస్తారు; అది ఒక చనిపోయిన మనిషి కావచ్చు - మొత్తం కాలేయ మార్పిడి లేదా పాక్షిక కాలేయం కణజాల మార్పిడి జీవించి ఉన్న దాత నుండి.

చాలా కేసులలో, జీవనశైలి మార్పుల కలయికతో కాంబినేషన్ థెరపీ కాలేయ వ్యాధుల చికిత్సకు సహాయపదుతుంది.  కాలేయము పనితీరు మరియు అల్ట్రాసౌండ్ అంచనాలను తరుచుగా పర్యవేక్షణ చేయుట కూడా ముఖ్యమైనవి.

లైఫ్ స్టైల్ మానేజిమెంట్ 

కాలేయ వ్యాధి ఒక వ్యక్తి యొక్క సాధారణ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా, దీర్ఘకాలిక ఫిర్యాదులకు వ్యాధి సమస్యలు మరింత ఎక్కువ కాకుండా చూచుటకు జీవనశైలిలో మార్పులు చాలా అవసరం. కొన్ని వ్యాధులకి జీవనశైలి మార్పులతో చికిత్స లభిస్తుంది, అనగా మద్యపానము ఆపుట, బరువును తగ్గించుకొనుట, మరియు ఆరోగ్యకరమైన బరువుని సాధించుట. కాలేయ వ్యాధికి జీవనసరళి మార్పులలో:

  • పరిమితముగా మద్యము తీసుకొనుట
    ఆల్కహాల్ కాలేయ వ్యాధిని వృద్ధి లేదా మరింతగా తీవ్రతరమవుటకు సాధారణ కారణాలలో ఒకటి కాబట్టి, మద్యం తీసుకొనుట పరిమితము చేయుటకు లేదా పూర్తిగా ఆపివేయుటకు ఎప్పుడూ సలహా ఇవ్వబడుతుంది.
  • భోజన పద్దతులు  
    భోజనము తక్కువగా రోజులో పలుమార్లు తీసుకునే  ప్రయత్నం చెయ్యండి, ఎందుకంటే  ఎక్కువా తీసుకున్న భోజనములోని కొవ్వు పదార్ధాలు  లేదా భోజనము వలన కాలేయము మీద మరింత భారము పడి భంగం కలిగించవచ్చును.
  • డైట్ మాడిఫికేషన్
    కాలేయము ప్రోటీన్ జీవక్రియతో సంబంధం కలిగి ఉంటుంది మరియు కాలేయములోని లోపాల వలన అది దెబ్బతినవచ్చును. అయితే, ఆహారములో కార్బోహైడ్రేట్లను ఎక్కువగావుండే విధముగా చూచుట ముఖ్యము, ఇది దీర్ఘ కాలములో శక్తిని అందించుటలో సహాయపడుతుంది. ప్రోటీన్లను తినకూడదు, కాలేయము వాటిని తగినంతగా జీవక్రియ చేయలేకపోవచ్చు. దానివలన, కొన్ని విషభరితమైన పదార్థములు శరీరములో కూడి మెదడును ప్రభావితం చేయవచ్చును. హిమోక్రోమాటోసిస్ ఉన్న వ్యక్తులలో, విటమిన్ సిన్టేక్ తక్కువగా ఉండాలి, ఎందుకనగా  ఇది ఆహారము నుండి ఖనిజములను తీసుకుంటుంది. 
  • నొప్పి ఉపశమనం లేదా నొప్పి నివారణల వాడకము
    దాదాపుగా అన్ని నొప్పి నివారణ కలుషితాలు కాలేయములో జీర్ణమవుతున్నాయి మరియు వాటిలో చాలావరకు హెపటోటాక్సిక్ (కాలేయము మీద కొన్ని హానికరమైన ప్రభావాలను చూపుతుంది). అందువలన, ఏ విధమైన నొప్పి నివారణ మందులకు అయినా దూరముగా ఉండుట మంచిది, డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాటిని తీసుకోవాలి.
  • ధూమపానం మానుకోవాలి  
    కాలేయము చెడిపోవుటకు తెలిసిన కారణములలో ఒకటి ధూమపానము. అందువలన, కాలేయ నష్టమును నివారించుటకు, ధూమపానమును మానివేయాలి.
  • బరువు నిర్వహించుట  
    బరువు తగ్గుట లేదా లక్ష్యముగానున్న బియంఐ సూచనను సాధించుట వలన కొవ్వు పెరుగుదల తగ్గి కాలేయమునకు ఎక్కువ నష్టము జరగకుండా రక్షించును. అలాగే, దీనివలన ఇతర సంబంధిత సమస్యలను నివారించుటలో కూడా సహాయపడును. (మరింతగా చదవండి – బరువు తరుగుదల ఆహార నియమాల పట్టిక)
  • టీకాలు
    హెపటైటిస్ వైరస్ లు దెబ్బతిన్న కాలేయమునాకు ఎక్కువగా సంభవించవచ్చును  మరియు వైరల్ సంక్రమణ కాలేయములో క్యాన్సర్ మార్పులను చేయగలదు; అయితే హెపటైటిస్ వైరస్ కు వ్యతిరేకంగా మీరు టీకా తీసుకోవటమనేది ఇబ్బందులను నివారించటములో ముఖ్యమైనది.
Wheatgrass Juice
₹446  ₹499  10% OFF
BUY NOW


వనరులు

  1. National Health Service [Internet]. UK; Liver disease
  2. American Liver Foundation [Internet]. New York: American Association for the Study of Liver Diseases; Cirrhosis of the Liver.
  3. National Health Service [Internet]. UK; Alcohol-related liver disease.
  4. National Health Service [Internet]. UK; Non-alcoholic fatty liver disease (NAFLD)
  5. National Health Service [Internet]. UK; Hepatitis.
  6. National Health Service [Internet]. UK; Haemochromatosis.
  7. National Health Service [Internet]. UK; Primary biliary cholangitis (primary biliary cirrhosis).
  8. American Liver Foundation [Internet]. New York: American Association for the Study of Liver Diseases; The Progression of Liver Disease.
  9. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Cirrhosis of the Liver
  10. American Liver Foundation [Internet]. New York: American Association for the Study of Liver Diseases; Liver Cancer.
  11. American Liver Foundation [Internet]. New York: American Association for the Study of Liver Diseases; Preventing Liver Disease.
  12. Arguedas MR, Fallon MB. Prevention in liver disease. Am J Med Sci. 2001 Feb;321(2):145-51. PMID: 11217817
  13. Johannes Wiegand, Thomas Berg. The Etiology, Diagnosis and Prevention of Liver Cirrhosis. Dtsch Arztebl Int. 2013 Feb; 110(6): 85–91. PMID: 23451000
  14. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; Liver Function Tests for Chronic Liver Disease
  15. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Cirrhosis of the liver
  16. M I Prince, M Hudson. Liver transplantation for chronic liver disease: advances and controversies in an era of organ shortages . BMJ Journals [Internet]
  17. Valerio Nobili, Christine Carter-Kent, Ariel E Feldstein. The role of lifestyle changes in the management of chronic liver disease. BMC Med. 2011; 9: 70. PMID: 21645344
  18. Merck Manual Consumer Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Liver Failure.
  19. National Health Service [Internet]. UK; Alcohol-related liver disease.
  20. Indira Guntoory, Narasinga R. Tamaraba, Lakshmana R. Nambaru, Alina S. Kalavakuri. Prevalence and sociodemographic correlates of vaginal discharge among married women of reproductive age group at a teaching hospital . International Journal of Reproduction, Contraception, Obstetrics and Gynecology Guntoory I et al. Int J Reprod Contracept Obstet Gynecol. 2017 Nov;6(11):4840-4846
  21. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Bacterial Vaginosis – CDC Fact Sheet
  22. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Vaginal Candidiasis
  23. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Trichomoniasis - CDC Fact Sheet
  24. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Chlamydia.
  25. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Gonorrhea - CDC Fact Sheet
  26. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Genital Herpes - CDC Fact Sheet
  27. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pelvic Inflammatory Disease (PID)

కాలేయ వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for కాలేయ వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for కాలేయ వ్యాధి

Number of tests are available for కాలేయ వ్యాధి. We have listed commonly prescribed tests below: