లాక్టోస్ (పాలచక్కెర) కు అసహనం అంటే ఏమిటి?
పాలలోని చక్కెరను జీర్ణం చేసుకోవటానికి అవసరమైన ‘లాక్టేజ్’ ఎంజైమ్ ను చిన్న ప్రేగులు తక్కువగా కల్గిఉన్న స్థితిలో “పాలచక్కెరకు అసహనం” (lactose intolerance) అనే రుగ్మత కల్గుతుంది. భారతదేశంతో పోలిస్తే, ఈ రుగ్మత తూర్పు ఆసియా ప్రాంతాలలో ఈ రుగ్మత మరింత ఎక్కువగా కన్పిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పాలచక్కెరకు అసహనీయత రుగ్మతవల్ల కింది వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి:
- పొత్తికడుపు వాయువు (అపానవాయువు)
- నీళ్ల విరేచనాలు
- గ్యాస్ట్రిక్ ప్రాంతంలో వాపు (Oedema)
- వికారం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
లాక్టేస్ (Lactase) అనేది పాలు మరియు పాల ఉత్పత్తులలో సాధారణంగా కనిపించే పాలచక్కెర (sugar lactase) యొక్క పతనానికి సహాయపడే కడుపులో ఉన్న ఒక ఎంజైమ్. పాలచక్కెరకు అసహనీయత రుగ్మత అక్రమ శోషణకు మరియు లాక్టోస్ను జీర్ణము చేసుకోలేని అసమర్థతకు దారితీస్తుంది. పాలచక్కెర అసహనానికి గల కారణాలు:
- జీర్ణాశయ సంబంధమైన భాగాల్లో మరియు ప్రేగుల్లో మంట
- పరాన్నజీవి సంక్రమణం
- జీర్ణాశయ గోడలకు గాయం
పాలచక్కెర అసహనాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు మీఅనారోగ్యం యొక్క ఇటీవల చరిత్ర గురించి మరియు ఆహార అలవాట్ల గురించి అడగవచ్చు, వైద్యుడికి ఇది మీ ఆహారం గురించిన సరైన అవగాహనను కల్గిస్తుంది. శారీరక పరీక్షలు జరుగుతాయి. హైడ్రోజన్ శ్వాస పరీక్ష, మల ఆమ్లత (stool acidity test) పరీక్ష, మరియు ఎలిమినేషన్ టెస్ట్ (ఆహార అలెర్జీల నిర్ధారణకు ఉపయోగిస్తారు ) అనేవి కొన్ని అదనపు పరీక్షా విధానాలు, ఇవి రోగ నిర్ధారణను నిర్ధారించడానికి నిర్వహించవచ్చు.
పాలచక్కెర అసహనత రుగ్మతను మెరుగుపర్చగల ఔషధాల లేవు. పలచక్కెర (లాక్టోస్) కలిగిన ఆహార పదార్ధాలను తగ్గించడం లేదా పూర్తిగా వాటిని తినడం మానుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు:
- పాడి ఉత్పత్తులను తినడాన్ని పూర్తిగా నిలిపివేయడం పోషకాల లోపాలను కలిగిస్తుంది. అందువల్ల ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకుంటూ వాటిని నిలిపివేయడం ముఖ్యం.
- ఆహారంలో జున్నుపదార్థాలను తీసుకోవచ్చు, ఎందుకంటే, పాల అసహనీయతతో బాధపడుతున్న వారు జున్ను అయితే బాగా తట్టుకోగల్గుతారు.
- అలాగే, వెన్న మరియు పాలసంబంధమైన క్రీములను పాలఅసనీయత ఉన్నవాళ్లు టెల్సుకోవచ్చు ఎందుకంటే వాటిలో పాలచక్కెర తక్కువగా ఉంటుందిగనుక. పెరుగు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే పెరుగులో బాక్టీరియా పాలచక్కెరను తగ్గిస్తుంది తద్వారా శక్తినిస్తుంది. కాబట్టి, వెన్న పాల క్రీములు ఉత్పత్తుల్ని మీరు తినేందుకు ప్రయత్నించవచ్చు.
- సోయా పాలవంటి సోయా ఉత్పత్తులను సాధారణంగా పాడి ఉత్పత్తులకు బదులుగా ఉపయోగిస్తారు. అయినప్పటికీ, సోయా ఉత్పత్తులు పాలఉత్పత్తులలో ఉండే పోషక విలువను అందించవు.
- పాలచక్కెరను కలిగి ఉన్న పాడియేతర ఆహారాలైన కుకీలు, కేకులు, కస్టర్డ్, చీజ్ సాస్ మరియు బ్రెడ్ వంటి పదార్థాలు ఉన్నాయి. కిరాణా షాపింగ్ కోసం వెళ్లినప్పుడు, ఆహార లేబుళ్ళని తనిఖీ చేయండి మరియు ఆయా ఉత్పత్తుల్లో పాలచక్కెర లేదని నిర్ధారించుకోండి.