మూత్రపిండాల క్యాన్సర్ ఏమిటి?
మూత్రపిండాల క్యాన్సర్లు వివిధ రకాలుగా ఉంటాయి. దాదాపు 90-95% మూత్రపిండాల క్యాన్సర్లు రీనల్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది; అయితే, వంశపారంపర్య కారకాల వలన వయసులో చిన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. పిల్లలలో కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు. ఈ సమస్య ప్రారంభ దశల్లో ఏవిధమైన ప్రత్యేక సంకేతాలు మరియు లక్షణాలను చూపదు, అందువలన దీని నిర్ధారణ మరియు చికిత్స కష్టతరం అవుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధి చివరి దశకు చేరేవరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. అందువల్ల చాలామంది రోగులలో లక్షణాలు కనిపించవు. ఈ క్రింది మూడు లక్షణాలు ఒకేసారి కనిపించడం అనేది ఒక హెచ్చరికా సంకేతం:
- మూత్రంలో రక్తం పడడం/కనిపించడం
- నడుము కింది భాగంలో ఒకవైపు/రెండు వైపులా నొప్పి లేదా అది ఉదరం వరకు వ్యాపించడం (మరింత సమాచారం: నడుము నొప్పి కారణాలు)
- పొత్తికడుపులో ఒక స్పష్టమైన భారం/బరువు యొక్క ఉనికి
ఇతర లక్షణాలలో బరువు తగ్గుదల, ఇది ఆకస్మిక మరియు అనుకోని విధంగా ఉంటుంది; ఆకలి తగ్గుదల; బద్ధకం; మరియు జ్వరం ఉంటాయి. తరచుగా, ఎటువంటి లక్షణాలు ఉండవు, మరియు కొన్ని ఇతర అవసరాల కోసం చేసిన ఇమేజింగ్ పరీక్ష సమయంలో ఈ వ్యాధి గురించి తెలియవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కిడ్నీ క్యాన్సర్ ఒకే కారణం వలన అని చెప్పలేము. అనేక కారణాలు మూత్రపిండాల క్యాన్సర్ యొక్క అభివృద్ధి అవకాశాలను పెంచుతాయి. వాటిలో ఇవి ఉంటాయి
- ధూమపానం, ఇది ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది
- 30 కి పైగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్న ఊబకాయం
- అధిక రక్తపోటు
- బెంజీన్ వంటి వాసనపూర్వక రసాయనాలకు గురికావడం
- దీర్ఘకాలిక డయాలిసిస్
- మూత్రపిండాల మార్పిడి జరగడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
కిడ్నీ క్యాన్సర్ సాధారణంగా చాలా తక్కువ లక్షణాలను చూపిస్తుంది, కానీ రీనల్ సెల్ కార్సినోమా అనేక పారానోప్లాస్టిక్ సిండ్రోమ్లతో (paraneoplastic syndromes) సంబంధం కలిగి ఉంది, వీటిలో అధిక కాల్షియం స్థాయిలు మరియు ఎర్ర రక్త కణాల పెరుగుదల వంటివి ఉంటాయి. నిర్దారణ ఆరోగ్య చరిత్ర మరియు పరీక్షలతో ప్రారంభమవుతుంది. ఏవైనా మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు అనుమానం కలిగితే, రక్త మరియు మూత్ర పరీక్షలు జరుగుతాయి. క్యాన్సర్ అనుమానం లేదా పొట్టలో ఏదైనా గడ్డ గుర్తించబడితే, ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ అధ్యయనాలు అవసరం కావచ్చు. అలాగే, ఆల్ట్రాసౌండ్, పెట్ (PET) స్కాన్, మరియు ఎముక మెటాస్టేసిస్ (రోగ సంభంది కణవ్యాప్తి) యొక్క పరిధిని అర్థం చేసుకోవడానికి ఛాతీ ఎక్స్-రే ఉపయోగపడుతుంది.
మూత్రపిండాల క్యాన్సర్ యొక్క దశ మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. చికిత్సలో కణితి యొక్క పరిమాణం ఆధారంగా శస్త్రచికిత్స ద్వారా కిడ్నీలోని భాగం లేదా మొత్తం మూత్రపిండము తొలగించబడవచ్చు. ఇది కీమోథెరపీతో కలిపి ఉండవచ్చు.