అయోడిన్ లోపం అంటే ఏమిటి?
అయోడిన్ అనేది ఆహారంలో ఉండే ఒక లేశమాత్ర మూలకం ( ట్రేస్ ఎలిమెంట్) మరియు ఓ ముఖ్యమైన పోషక పదార్థం. అయోడిన్ అనేది థైరాయిడ్ హార్మోన్ల థైరాక్సిన్ (నాలుగు అయోడిన్ అణువులతో T4) మరియు ట్రైఅయోడోథైరోనిన్ (మూడు అయోడిన్ అణువులతో T3) యొక్క ఒక భాగం. అయోడిన్ శరీరం లో ఉత్పత్తి కాదు; అందుకే అయోడిన్కు ఆహారం మాత్రమే మూలం. అయోడిన్ యొక్క లోపం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లోపానికి దారి తీస్తుంది. తత్ఫలితంగా హైపోథైరాయిడిజం, గైత్రే (థైరాయిడ్ యొక్క విస్తరణ) అలాగే క్రిటినిజం మరియు గర్భానికి సంబంధించిన సమస్యలు సంభవిస్తాయి. గర్భిణీ స్త్రీలు మరియు పసిపిల్లలకు చనుబాలిచ్చే మహిళలకు మామూలు వయోజనుల కంటే 50% ఎక్కువ అయోడిన్ అవసరమవుతుంది మరియు ఈ గర్భిణీ స్త్రీలు మరియు చిన్నబిడ్డల తల్లులే అయోడిన్ లోపం రుగ్మత యొక్క అధిక అపాయంవర్గంలో ఉంటూ, ఈరుగ్మతకు గురవుతుంటారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అయోడిన్-లోపం కలిగిన రోగి క్రింది లక్షణాలను కలిగి ఉండవచ్చు. ఈ లక్షణాలు ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితికి సంబంధించినవై ఉండవచ్చు.
- పెళుసైన వ్రేళ్ళగోళ్ళు, బిరుసుబారిపోయే మరియు పలుచబడిపోయే వెంట్రుకలు
- ఉబ్బిన కళ్ళు, పాలిపోయిన పొడి చర్మం
- పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి, కండరాల నొప్పులు లేదా కీళ్ల నొప్పులు, పెడసరం, మందగించిన మాటలు మరియు వినికిడి నష్టం (loss of hearing)
- థైరాయిడ్, రొమ్ము, ప్రోస్టేట్ మరియు ఇతర పునరుత్పత్తి వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు
- జ్ఞాపకశక్తిని కోల్పోవడం
- గోయిటెర్ - థైరాయిడ్ గ్రంధి యొక్క విస్తరణ మెడలో వాపు, శ్వాస తీసుకోవడం మరియు మ్రింగడంలో కష్టపడడం మరియు కొన్నిసార్లు ఊపిరాడనివ్వకపోవడం వంటి సమస్యలు
- హైపోథైరాయిడిజం - బరువు పెరుగుట, అలసట, పొడి చర్మం, మరియు కుంగుబాటు
- గర్భవతికి సంబంధించిన సమస్యలు - గర్భస్రావం, మృతపిండస్రావం (stillbirth), నెలలు నిండకుండానే పుట్టిన పుట్టుక, మరియు పిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అయోడిన్ యొక్క ముఖ్యమైన ఆహారమూలం తినే ఉప్పు (table salt). ఆహారంలో తక్కువ ఉప్పు తినడం, అలాగే తక్కువ అయోడిన్ కల్గిన ఉప్పును తినడంవల్ల, అయోడిన్ లోపం రావడానికి కారణమవుతుంది. ఉప్పులో ఉండే అయోడిన్ ను వంట వండే సమయంలో కోల్పోవడం జరుగుతుంది. మాంసంతో పోలిస్తే పండ్లు మరియు కూరగాయల్లో అయోడిన్ తక్కువగా ఉంటుంది లేదా అయోడిన్ ను అసలు కలిగి ఉండవు; అందువల్ల, శాకాహార ఆహారం తీసుకునే వ్యక్తి అయోడిన్ లోప రుగ్మతకు గురయ్యే అవకాశం చాలా కలిగి ఉంటాడు. వ్యాయామం సమయంలో అయోడిన్ ను గణనీయమైన పరిమాణంలో కోల్పోవడం జరుగుతుంది, తద్వారా అయోడిన్ లోపం ఏర్పడుతుంది.
అయోడిన్ లోపం రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
తనిఖీ చేయడం ద్వారా అయోడిన్ లోపం రుగ్మత నిర్ధారణ చేయబడుతుంది:
- మూత్ర విసర్జన అయోడిన్ పరీక్ష- అయోడిన్ గాఢతను మూత్రం నుండి లెక్కించబడుతుంది. తేలికపాటి అయోడిన్ లోపం రుగ్మతలో అయోడిన్ గాఢత 50-99 mcg / L, ఓ మోస్తరుపాటి అయోడిన్ లోపం రుగ్మత 20 నుండి 49 mcg / L మరియు తీవ్ర అయోడిన్ లోపం <20 mcg / L గా ఉంటుంది.
- థైరాయిడ్ పరిమాణం - థైరాయిడ్ పరిమాణాన్ని నిర్ణయించే అత్యంత ఖచ్చితమైన పద్ధతి అల్ట్రాసోనోగ్రఫి.
- నవజాత శిశువుల్లోని థైరాయిడ్రసం-ఉత్తేజిత హార్మోన్ (TSH)
- సీరం థైరోగ్లోబులిన్
- రేడియో అయోడిన్ - అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ చే రేడియోఆడైన్ యొక్క అరుగుదల (uptake) పెరిగింది.
అయోడిన్ లోపానికి చేసే చికిత్సలో భాగంగా కింది చర్యలుంటాయి:
- ఉప్పును ఐయోడైజేషన్ చేయడం - అయోడిన్ లోపం రుగ్మతకు చికిత్సగా ఆహారంలో ఐయోడైజ్డ్ ఉప్పును కలపడం.
- ఇతర ఎంపికలు - తినే చమురు యొక్క ఐయోడైజేషన్ (lipiodol), మరియు ఐయో డైజ్డ్ నీరు మరియు అయోడిన్ మాత్రలు లేదా అయోడిన్ చుక్కలు తీసుకోవడం.
- అయోడిన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తినడం, సముద్రపుపాఁచి (సీవీడ్), సాదా పెరుగు, వేయించిన గండుమీను చేపమాంసం, పాలు, చేప స్టిక్స్, తెల్ల రొట్టె, రొయ్యలు మరియు తొక్కతో పాటుగా తెల్ల బంగాళాదుంపలను తినడం .
- సోయా, క్యాబేజీ, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ వంటి అయోడిన్ తక్కువ శోషణను కలిగించే ఆహారాలను నివారించండి.
అయోడిన్ స్థాయిని పెంచుకోవడానికి చిట్కాలు:
- శరీరజన్య విషపదార్థాల (toxins)ను శరీరం నుండి వదిలించుకోండి
- తీసుకునే అయోడిన్ ప్రమాణాన్ని పెంచండి
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం