పాదాల బొటనవేళ్లు లోపలకు పెరగడం - Ingrown Toenail in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 13, 2018

March 06, 2020

పాదాల బొటనవేళ్లు లోపలకు పెరగడం
పాదాల బొటనవేళ్లు లోపలకు పెరగడం

పాదాల బొటనవేళ్లు లోపలకు పెరగడం అంటే ఏమిటి ?

“పాదాల బొటనవేళ్లు లోపలకు పెరగడమం”టే వేలిగోరులోని ఒకమూలభాగం పక్కనున్న చర్మంలోనికి పెరగడమే. మీ పెద్ద బొటనవేలు లోపలకు పెరిగే రుగ్మతకు గురయ్యే అవకాశం ఉండొచ్చు. చర్మం లోనికి పెరిగిన గోరు చర్మంలో విచ్చిన్నమైతే, దాంతోపాటుగా బాక్టీరియా ప్రవేశించవచ్చు. అటుపై సంక్రమణకు దారి తీసి దుర్వాసన మరియు చీమువంటి ద్రవం కారడానికి  కారణం కావచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కింద కనబరిచినవి దీని ప్రారంభ దశ లక్షణాలు:

  • గోరు పక్కన ఉన్న చర్మం మృదువుగా, సున్నితంగా తయారై వాపును కల్గిఉంటుంది
  • బొటనవేలు మీద ఒత్తితే నొప్పి కల్గుతుంది
  • బొటనవేలు చుట్టూ ద్రవం గుమిగూడుతుంది.

బొటనవేలుకు అంటువ్యాధి సోకినట్లయితే, లక్షణాలు క్రింది విధంగా ఉండవచ్చు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పాదాలు చెమట్లు పెట్టెవారికి వారిపాదాల బొటనవేళ్లు లోనికి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుగ్గాను కారణాల జాబితా:

  • పెద్ద బొటనవేలుపై ఒత్తిడి తెచ్చే పాదరక్షలు
  • బొటనవేలుకు గాయం, బొటనవేలు కత్తిపోటుకు గురి కావడం లేదా బొటనవేలు పై భారీ వస్తువు పడటం వంటివి
  • బొటనవేలి గోరు యొక్క వంకరదనం మరియు అపక్రమం
  • సరిగా కత్తిరించని బొటనవేలి గోరు.
  • పాదాల పట్ల సరిగా రక్షణ, పరిశుభ్రత పాటించకపోవడం
  • అప్పుడప్పుడు, పాదాలబొటనవేలి గోళ్లు లోపలికి పెరిగే ధోరణి వారసత్వ లక్షణంగా రావడం

దీనిని నిర్ధారణ చేస్తారు మరియు ఎలా చికిత్స చేస్తారు?

సాధారణంగా, మీ డాక్టర్ శారీరక పరీక్షతోనే పాదాల బొటనవేళ్ళ లోనికి పెరుగుదలను  నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు, x- రే సాయంతో గోరు చర్మంలోనికి పెరిగిన పరిధిని తనిఖీ చేస్తారు.

ఇందుగ్గాను గృహ సంరక్షణా చికిత్సలో ఇవి ఉంటాయి:

  • రోజులో 3-4 సార్లు వెచ్చని నీటిలో పాదాల్ని నానబెట్టి ఉంచడం
  • నానబెట్టినపుడు తప్పించి, రోజులో పాదాల్ని పొడిగా ఉంచడం.
  • సౌకర్యవంతమైన బూట్లు ధరించడం
  • నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి నొప్పి నివారణలు తీసుకోవడం

2-3 రోజుల్లో ఎలాంటి మెరుగుదల లేకపోతే, డాక్టర్ను సంప్రదించండి. పాదాలబొటనవేళ్ళ లోనికి పెరుగుదల సంక్రమణ విషయంలో, డాక్టర్ శస్త్రచికిత్ససాయంతో లోనికి పెరిగిన గోరుభాగాన్ని, గోరుమొదుల్ని, దాని చుట్టూ మృదువైన కణజాలాన్ని తొలగిస్తారు.

చాలా మంది శస్త్రచికిత్స తర్వాత కనీస నొప్పిని ఎదుర్కొంటారు మరియు తరువాతి రోజునే వారు తమతమ దినచర్య పనుల్ని తిరిగి చేసుకోవచ్చు.



వనరులు

  1. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Ingrown Toenail.
  2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Ingrown toenail.
  3. American College of Foot and Ankle Surgeons. [Internet]. Chicago, IL; Ingrown Toenail.
  4. American Orthopaedic Foot & Ankle Society. [Internet]. Rosemont, IL; Looking for help with a foot or ankle problem?.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Ingrown toenail.