హైపర్ థైరాయిడిజం అంటే ఏమిటి?
థైరాయిడ్ మన మెడ యొక్క ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారపు గ్రంధి. దీని పని ఏమంటే జీవక్రియ, శక్తి ఉత్పత్తి మరియు మానసిక నియంత్రణకు కారణమయ్యే హార్మోన్లను ఉత్పత్తి చేయడమే. థైరాయిడ్ గ్రంథికి దాపురించే రుగ్మతలు శరీరంలోని బహుళ వ్యవస్థల యొక్క జీవక్రియకు భంగం కలిగిస్తాయి. థైరాయిడ్ గ్రంధి పనికి సంబంధించిన ప్రధాన సమస్యలేవంటే థైరాయిడ్ హార్మోన్లను అతి ఎక్కువగానే లేదా అతి తక్కువగా ఉత్పత్తి చేయడం. ఈ థైరాయిడ్ క్రియాలోప రుగ్మత పురుషులు కంటే మహిళల్లోనే చాలా సాధారణం.
హైపర్ థైరాయిడ్ వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అతి చురుకైన థైరాయిడ్ గ్రంథి అధిక థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది, ఇలాంటి పరిస్థితిని “హైపర్ థైరాయిడిజం”గా సూచించబడుతుంది. అతి చురుకైన థైరాయిడ్ సమస్య యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- బరువు తగ్గుదల.
- ఆందోళన , చిరాకు, మరియు మానసిక కల్లోలం.
- విస్తరించిన థైరాయిడ్ (గోత్రే) కారణంగా మెడ మీద వాపు.
- బలహీనత.
- పెరిగిన హృదయ స్పందన రేటు.
- వేడికి సున్నితత్వం (Sensitivity to heat).
ప్రధాన కారణాలు ఏమిటి?
హైపర్ థైరాయిడిజం యొక్క ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- గ్రేవ్స్ వ్యాధి.
- థైరాయిడ్ గ్రంధిపై నూడిల్స్ (వేరు బుడిపెలు).
- పెరిగిన అయోడిన్ గ్రాహ్యం.
- పిట్యూటరీ గ్రంథి యొక్క క్యాన్సర్ కాని కణితులు.
- వైరల్ సంక్రమణ వలన థైరాయిడ్ గ్రంధి యొక్క వాపు .
- థైరాయిడ్ క్యాన్సర్.
థైరాయిడ్ ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఎలాంటి రకమైన థైరాయిడ్ సమస్యనయినా నిర్ధారణ చేసేందుకు క్రింది పరీక్షా విధానాలను ఉపయోగిస్తారు:
- మెడ భౌతిక పరీక్ష.
- రక్త పరిశోధనలు: థైరాయిడ్ ప్రేరేపణా (స్టిమ్యులేటింగ్) హార్మోన్ (TSH) యొక్క, T3 మరియు T4 స్థాయిలు తనిఖీ చేయడానికి.
- అయోడిన్ గ్రాహ్య పరీక్షలు.
- గ్రంధిపై బుడిపెల యొక్క అల్ట్రాసౌండ్ ఇమేజింగ్.
- గ్రంధిపై అసాధారణంగా సంభవించిన పెరుగుదల (abnormal growth on gland) యొక్క జీవాణుపరీక్ష (biopsy).
రక్త పరీక్షలో కనుక్కోబడిన గ్రంధి మరియు హార్మోన్ల స్థాయిల ప్రకారం థైరాయిడ్ రుగ్మతలకు చేసే చికిత్సలో తేడా ఉంటుంది. హైపర్ థైరాయిడిజం రుగ్మతకు క్రింది చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:
- మందులు: రేడియోధార్మిక (radioactive) అయోడిన్, యాంటీ థైరాయిడ్ మందులు, మరియు శోథ నిరోధక మందులు.
- శస్త్రచికిత్స ద్వారా రుగ్మతకు గురైన భాగాన్ని లేదా మొత్తం థైరాయిడ్ గ్రంధి తొలగింపు.
వైద్యుడిచేత క్రమమైన పరిశీలన మరియు చికిత్సానంతర పరీక్షలు (ఫాలో అప్స్) హైపర్ థైరాయిడిజం రుగ్మతను నయం చేసుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్లు, మాంసకృత్తులు, కాల్షియం, అయోడిన్ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడంవల్ల మీరు థైరాయిడ్ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. .
(మరింత సమాచారం: హైపోథైరాయిడిజం చికిత్స)