హెపటైటిస్ అంటే ఏమిటి?
హెపటైటిస్ అంటే శరీరంలోని అతి పెద్ద అవయవం అయిన కాలేయం యొక్క వాపు. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయం చెయ్యడం, శక్తిని నిల్వ చెయ్యడం మరియు శరీరం నుండి విషాలన్ని (toxins) తొలగించడం వంటి ముఖ్యమైన పనులను చేస్తుంది. తీవ్ర హెపటైటిస్ (Acute hepatitis) 6 వారాల పాటు కొనసాగుతుంది, అయితే దీర్ఘకాలిక హెపటైటిస్ (chronic hepatitis) జీవితకాలం కొనసాగించవచ్చు. హెపటైటిస్ లో అనేక రకాలు ఉన్నాయి, అవి:
- హెపటైటిస్ ఏ (A)
- హెపటైటిస్ బి (B)
- హెపటైటిస్ సి (C)
- ఆల్కహాలిక్ హెపటైటిస్
- ఆటోఇమ్యూన్ హెపటైటిస్
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హెపటైటిస్ యొక్క ముఖ్య లక్షణాలు:
- కండరాల నొప్పి
- కీళ్ల నొప్పి (మరింత సమాచారం: కీళ్ల నొప్పి చికిత్స)
- జ్వరం
- తలనొప్పి
- దీర్ఘకాలిక అలసట
- కామెర్లు
- కుంగుబాటు
- అనారోగ్యంగా మరియు నీరసంగా అనిపించడం
- ఆకలి తగ్గుదల
- తరుచూ వచ్చే కడుపు నొప్పులు
- వికారం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హెపాటిటిస్ వైరల్ సంక్రమణల నుండి జన్యుపరమైన కారణాల వరకు విస్తృతమైన కారణాల వల్ల సంభవించవచ్చు.
- హెపటైటిస్ ఏ (A), బి (B), సి (C), డి (D) లేదా ఇ (E)వైరస్ల వలన వైరల్ సంక్రమణం (ఇన్ఫెక్షన్)
- మద్యపానం
- జన్యుపరమైన లేదా పర్యావరణ కారకాల (environmental factors) వలన ఆటోఇమ్యూన్ వ్యాధులు
- కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకోవడం (చేరడం) వలన కలిగే నాన్ ఆల్కహాలీక్ స్టీటోహెపటైటిస్ (non-alcoholic steatohepatitis) వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు
- నొప్పి-ఉపశమన మరియు జ్వరం-తగ్గించే మందుల యొక్క అధిక వినియోగం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
హెపటైటిస్ రక్త పరీక్షలు మరియు కాలేయ జీవాణుపరీక్షను (బయాప్సీ,కాలేయం నుండి చిన్న కణజాల నమూనాను తీసి విశ్లేషణ చేయబడుతుంది) ఉపయోగించి నిర్ధారణ చేయబడుతుంది . రక్తంలో యాంటీబాడీలను గుర్తించడానికి ఇతర పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రతి రకమైన హెపటైటిస్కు రక్త పరీక్షలు వేరు వేరుగా ఉంటాయి.
తీవ్రమైన హెపటైటిస్ను విశ్రాంతి మరియు మందుల సహాయంతో తగ్గించవచ్చు. మద్యం మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాల నుండి దూరంగా ఉండాలి అవి లక్షణాలను వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి. కాలేయ సిర్రోసిస్ లేదా కాలేయ వైఫల్యానికి దారితీసే తీవ్రమైన హెపటైటిస్ సంభవించినప్పుడు, కాలేయ మార్పిడి అవసరమవుతుంది.
వైరల్ హెపటైటిస్ బి, సి వ్యాధులు సోకిన వ్యక్తి యొక్క శరీర ద్రవాల నుండి వ్యాప్తి చెందే వ్యాధులు. అందువల్ల, వ్యాధి సోకిన వ్యక్తికి చెందిన వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం (టూత్ బ్రష్లు, రేజర్లు, మొదలైనవి) వంటివి చేయకూడదు. లైంగిక సంభోగం (యోని ద్రవం లేదా వీర్యంతో) తో కూడా వైరస్ వ్యాపించవచ్చు, అందువలన వ్యాప్తి నిరోధించడానికి కండోమ్లను ఉపయోగించడం చాలా ముఖ్యం.
హెపటైటిస్ బి (B) కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి మరియు మన దేశంలో ప్రతి శిశువుకు ఈ టీకా వేయించడం తప్పనిసరి. హెపాటిటిస్ ఏ (A) కి కూడా టీకా కూడా తప్పనిసరి.