గుండె మార్పిడి అంటే ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని గుండె వైఫల్యం ప్రభావితం చేస్తుంది. గుండె మార్పిడి అనేది ఒక శస్త్రచికిత్సా విధానం, దీనిని డాక్టర్ నార్మన్ షుమ్వే (Dr. Norman Shumway) ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు.తీవ్ర  గుండె జబ్బులు ఉన్న రోగులకు మరియు గుండె వ్యాధులను తగ్గించే చర్యలు ఏమి పని చేయనప్పుడు ఇది ఆఖరి ఉత్తమ ఎంపికగా ఉందని చెప్పవచ్చు. విజయవంతమైన శస్త్రచికిత్స ప్రక్రియ యొక్క లక్ష్యం డోనర్-రెసిపియంట్ (donor-recipient) మధ్య సమయాన్ని, ఆపరేషన్ తర్వాత ఉండే సంక్లిష్టతను తగ్గించడం మరియు కొన్ని  సంవత్సరాల తర్వాత కూడా గుండె మార్పిడి చేసిన వ్యక్తి ఎటువంటి సమస్యలు లేకుండా చూడడం.

గుండె మార్పిడి కొరకు సూచనలు (ప్రమాణాలు/సంకేతాలు) వివిధ సంస్థల మధ్య మారుతూ ఉంటాయి. గ్రహీత (Recipient) అంటే కొత్త గుండె అవసరం ఉన్న వ్యక్తి. గ్రహీతలలో చాలా మంది దీర్ఘకాలికంగా గుండె వైఫల్యాలను కలిగి ఉంటారు, అయితే కొంత మందికి కొత్తగా గుండె వైఫల్యం ఏర్పడినప్పటికీ వారి మనుగడను కొనసాగించడానికి గుండె మార్పిడి మాత్రమే ఎంపిక అయినప్పుడు గుండె మార్పిడి అవసరం అవుతుంది. దాత (donor) అంటే గుండె దానం చేసే వ్యక్తి.

ఎవరికి అవసరం?

సాధారణంగా, వైద్య చికిత్స విఫలమయ్యి, గుండె వైఫల్యం ఆఖరి దశలలో రోగులకు గుండె మార్పిడి అవసరం ఉంటుందని పరిగణించాలి. కార్డియాక్ రివైవల్ థెరపీ లక్షణాలను మెరుగుపరచడంలో విఫలమైనప్పుడు లేదా వ్యాధి మెరుగుదల ఆగిపోయినప్పుడు కూడా గుండె మార్పిడి పరిగణించబడుతుంది. అంతేకాక, గుండె మార్పిడిని పరిగణలోకి తీసుకునే ముందు ఏదైనా తగ్గించదగిన లేదా శస్త్రచికిత్సతో మెరుగుపరచదగిన అవకాశాలను మరొకసారి పరిశీలించాలి. ఆలా చేయడం వలన రోగికి గుండె మార్పిడి ప్రక్రియ యొక్క అవసరాన్ని పుర్తిగా నిర్దారించవచ్చు మరియు/లేదా మరింత అవసరమున్న వ్యక్తుల కోసం ఉపయోగించవచ్చు. గుండె వైఫల్యం ఆఖరి దశలలో ఉన్న రోగులలో, వారి యొక్క ఇతర అవయవాల వైఫల్యాల సరైన నిర్వహణ కోసం ఆధునిక వైద్య పరిశోధనల ద్వారా అంచనా వేయాలి. తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు జీవించి ఉండడానికి 1 నుంచి 2 సంవత్సరాల సమయం మాత్రమే ఉంటుంది, అధునాతన వైద్య చికిత్స అందించినప్పటికీ 50% మాత్రమే అది పనిచేసే అవకాశం ఉంటుంది. పెద్దలలో గుండె మార్పిడి యొక్క ప్రాథమిక సమస్యల సంకేతాలు నాన్-ఇస్కీమిక్ కార్డియోమియోపతి (53%, non-ischemic cardiomyopathy) మరియు ఇస్కీమిక్ కార్డియోమియోపతి (38%, ischemic cardiomyopathy). ఇతర సంకేతాలు వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్ (3%, valvular heart disease), మళ్ళి గుండె మార్పిడి (3%) మరియు ఇతరులు (<1%).

ఇది ఎలా జరుగుతుంది?

గుండె మార్పిడికి స్టెర్నమ్ లేదా రొమ్ముఎముక ద్వారా కోత అవసరం ఉంటుంది మరియు ఆపరేషన్ సమయంలో రోగి యొక్క గుండె మరియు ఊపిరితిత్తులుగా పనిచేసే కార్డియోపల్మోనరీ బైపాస్ మెషిన్ (గుండె-ఊపిరితిత్తుల యంత్రం) ను ఉపయోగించాలి.దాత గుండె పనితీరుని పూర్తిగా అంచనా వేసిన తర్వాత శస్త్రచికిత్స బృందం దాత యొక్క గుండెను తొలగిస్తుంది లేదా తిరిగి పనిచేసేలా చేస్తుంది. తర్వాత సర్జన్ గ్రహీత అతని / ఆమె యొక్క గుండె తొలగించి, గ్రహీత యొక్క ప్రధాన నాళాలులోకి దాత యొక్క గుండె కలుపుతారు. కనెక్షన్లు పునరుద్ధరించబడి, గుండె సరిగ్గా పని చేయడం మొదలుపెటెంత వరకు, రోగికి  గుండె-ఊపిరితిత్తుల యంత్రాన్ని అమర్చిఉంచుతారు.

Dr. Farhan Shikoh

Cardiology
11 Years of Experience

Dr. Amit Singh

Cardiology
10 Years of Experience

Dr. Shekar M G

Cardiology
18 Years of Experience

Dr. Janardhana Reddy D

Cardiology
20 Years of Experience

Medicines listed below are available for గుండె మార్పిడి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Tacroz Forte Ointment 20gm20 gm Ointment in 1 Tube760.0
Pangraf 1 Capsule10 Capsule in 1 Strip432.16
Tacroz Ointment 10gm10 gm Ointment in 1 Tube190.0
Hhmus 0.1% Ointment10 gm Ointment in 1 Tube484.5
Tacvido Forte Oral Gel25 ml Gel in 1 Bottle621.0
Tacmod Forte Ointment30 gm Ointment in 1 Tube513.0
Tacroz Forte Ointment 10gm10 gm Ointment in 1 Tube498.75
Tacroz Ointment 20gm20 gm Ointment in 1 Tube308.75
Hhmus 0.03% Ointment10 gm Ointment in 1 Tube190.0
Pangraf 0.5 Capsule10 Capsule in 1 Strip219.74
Read more...
Read on app