చిగుళ్ల వ్యాధి (పెరయోడొంటైటిస్) అంటే ఏమిటి?
నోటి పరిశుభ్రతను దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చెయ్యడం వలన పంటి చుట్టు ఉండే చిగుళ్ళకు సంక్రమణ/ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది దానిని చిగుళ్ల వ్యాధి లేదా పెరయోడొంటైటిస్ అని అంటారు. ఈ పరిస్థితి ఫలకం (plaque) ఏర్పడేలా చేస్తుంది మరియు దానికి చికిత్స చేయకపోతే, ఇది చిగుళ్ల రక్తస్రావానికి కారణమవుతుంది మరియు పూర్తి దంతాల/పళ్ళ నష్టానికి కూడా దారితీయవచ్చు.
అంతేకాకుండా, చిగుళ్ల వ్యాధిలో, పంటికీ చిగుళ్ళకి మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి, అది ఫలకం మరియు బ్యాక్టీరియా అధికంగా పేరుకునేలా (పోగయ్యేలా) చేస్తుంది, ఇది సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చిగుళ్ల వ్యాధి లక్షణాలు:
- దంతాల మీద పసుపుదనం
- పంటి అంచులలో ఉండే ఫలకం గట్టిపడడం.
- నిరంతర చెడు శ్వాస.
- చిగుళ్ళు రక్తస్రావం లేదా నొప్పి.
- చిగుళ్ల కణజాల పరిమాణం తగ్గడం.
- పళ్ళు వదులైపోవడం.
ఈ సమస్య తరుచుగా జిన్టివైటిస్ (gingivitis) తో ముడి పడి ఉంటుంది, దీనిలో చిగుళ్ళు సంక్రమణకు గురవుతాయి. దీనిని తరచుగా పెరయోడొంటైటిస్ ముందు లక్షణంగా పరిగణిస్తారు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
నోటి పరిశుభ్రత లేకపోవడం వలన చిగుళ్ల వ్యాధి ప్రేరేపించబడుతుంది. తద్వారా దంతాల అంచులలో బాక్టీరియా ఫలకాన్ని ఏర్పరుస్తుంది చికిత్స చేయకపోతే, ఫలకం గట్టిగా తయారవుతుంది. ఈ వ్యర్ధాన్ని టార్టార్ (tartar) పిలుస్తారు.
అయినప్పటికీ, ఈ కారణం కేవలం అపరిశుభ్రత వలన మాత్రమే కాదు, హార్మోన్ల అసమతుల్యతలు మరియు ఒత్తిడి వల్ల కూడా కావచ్చు. అలాగే, అనారోగ్యం మరియు ఇమ్యూన్ వ్యాధులు కూడా పంటి చిగుళ్ళ మీద ప్రభావం చూపుతాయి.
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
జిన్టివైటిస్ లో, చిగుళ్ళ యొక్క పరిశీలన (చూడడం) ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు. ఈ దశలో, బ్యాక్టీరియా పెరుగుదల కారణంగా చిగుళ్ళు ఎర్రగా మారుతాయి మరియు వాపు ఉంటుంది.
పరిస్థితి యొక్క తర్వాతి దశలలో పళ్ళు మీద ఫలకం ఏర్పడుతుంది మరియు దానిని వదిలించుకోవటం కష్టం. ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం, దంతవైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. వైద్యులు ఈ క్రింది పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు :
- ఖాళీల యొక్క లోతును కొలవడానికి ఒక ప్రోబ్ ప్రవేశపెట్టబడుతుంది. ఇది నొప్పి ఉండని ప్రక్రియ.
- రోగ నిరూపణను ధృవీకరించడానికి ఆరోగ్య లేదా కుటుంబ చరిత్ర ఉపయోగపడుతుంది.
- ఎముక నష్టం మరియు ఫలకం పెరుగుదలను నిర్ధారించడానికి ఎక్స్-రే.
దంతవైద్యులు వ్యాధి ప్రారంభ దశలలో ఫలకం లేదా టార్టార్ ను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా సందర్భాలలో వాపును పరిష్కరిస్తుంది. చికిత్స తరువాత, దంతాలను నిత్యం శుభ్రపరచుకోవాలి అనగా, బ్రషింగ్ మరియు ఫ్లాసింగులను ఉపయోగించి ఫలకాన్నీ శుభ్రపరచుకోవడం అవసరం. చికిత్స తర్వాత ప్రతి 3 నెలలకు దంత వైద్యుని సంప్రదించడం అవసరం.