గ్రోత్ (పెరుగుదల) హార్మోన్ లోపం అంటే ఏమిటి?
పెరుగుదల హార్మోన్ లోపం అనే రుగ్మత మనిషి మెదడులోని పూర్వ పిట్యూటరీ గ్రంధి సాధారణ పెరుగుదలకు తగినంతగా పెరుగుదల హార్మోన్ (GH) ను స్రవించకపోవడంవల్ల సంభవిస్తుంది. (మెదడు పునాదిలో ఉన్న ఒక చిన్న గ్రంథినే పూర్వ పిట్యూటరీ గ్రంధి అంటారు, ఇది అనేక హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.)
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిల్లల్లో పెరుగుదల హార్మోన్ లోపానికి సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- పెరుగుదల రేటులో గుర్తించదగిన తగ్గుదల
- పొడవైన ఎముకల పొడవు పెరగడంలో జాప్యం
- పుర్రెలో ఎముకల కీళ్ల మరియు శిశువు నెత్తి మీఁది మెత్తనిభాగం (fontanelles) మూసివేతలో ఆలస్యం
- పురుషుల్లో చిన్న పురుషాంగం (మైక్రోపెనిస్)
- ముఖ ఎముకల అభివృద్ధి రేటులో ఆలస్యం
- దంతాలు రావడం ఆలస్యమవడం
- గోర్లు సరిగా పెరగక పోవడం
- మంచి జుట్టు
- నవజాత శిశువు రక్తంలో గ్లూకోజ్ మాంద్యం (హైపోగ్లైకేమియా)
- కొవ్వుపదార్ధాల (lipids) స్థాయిలో పెరుగుదల (ఎల్.డి.ఎల్ - కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిసెరైడ్ల స్థాయిలు)
పెరుగుదల హార్మోన్ లోపానికి సంబంధించి జీవితంలో తరువాత కనబడే సంకేతాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- కొవ్వు ద్రవ్యరాశిలో పెరుగుదల (పొత్తికడుపు మరియు లోపలి అంగాలు)
- కండర ద్రవ్యరాశి మరియు శక్తి స్థాయిలలో తగ్గుదల
- ఆందోళన మరియు / లేదా నిరాశ
- లిపిడ్ స్థాయిల్లో పెరుగుదల (LDL- కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు)
ప్రధాన కారణాలు ఏమిటి?
పెరుగుదల హార్మోన్ లోపానికి ప్రధాన కారణాలు:
- జన్యుపరమైన లోపాలు లేదా మెదడులోని నిర్మాణాత్మక లోపాలు కారణంగా జన్మతః పెరుగుదల హార్మోన్ లోపం సంభవిస్తుంది.
- పెరుగుదల హార్మోన్ లోపం అనేది శిశువు పుట్టిన తర్వాత వివిధ కారణాల వలన ఏర్పడవచ్చు:
- హైపోథాలమస్ లేదా పిట్యూటరీ యొక్క కణితులు (జిర్మినోమా, పిట్యూటరీ అడెనోమా, గ్లియోమా, క్రానియోఫారింగియోమా, రత్కేస్ చీలిక తిత్తి)
- మెదడుకు ఆఘాతం (ప్రసవసమయంలో లేదా ప్రసవానంతరం)
- కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క సంక్రమణ
- చొరబాటు వ్యాధులు (ఇన్ఫిల్ట్రేటివ్ వ్యాధులు) (క్షయవ్యాధి, తెల్లరక్తకణాల పెరుగుదలతో వచ్చే హిస్టియోసైటోసిస్ ఆఫ్ లాంగెర్హాన్స్ వ్యాధి, సార్కోయిడోసిస్)
- రేడియేషన్ థెరపీ
- ఇడియోపతిక్ (తెలియని కారణంవల్ల) వ్యాధులు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మొదట్లో, భౌతిక పరీక్ష జరుగుతుంది మరియు రోగనిర్ధారణ వ్యక్తి యొక్క వయసు ప్రకారం జరపడం జరుగుతుంది. పెరుగుదల హార్మోన్ లోపం కారణంగానే శిశువు లేక పిల్లాడి పెరుగుదలలో క్షీణత సంభవించిందా అనేది నిర్ధారించటానికి వైద్యుడు క్రింది పరీక్షలను చేయించామని సలహా ఇస్తారు:
- ఎల్-డోపా, అర్జినైన్, ఇన్సులిన్ మరియు క్లోనిడిన్ వంటి ఎజెంట్లను ఉపయోగించి వైద్యులు పెరుగుదల హార్మోన్ ను ప్రేరేపించే పిట్యూటరీ గ్రంధి స్రావాన్ని పరీక్షలు చేస్తారు. తరువాత క్రమమైన వ్యవధుల్లో పెరుగుదల హార్మోన్ స్థాయిని పరీక్షిస్తారు .
- ఫ్రీ T4, TSH, కార్టిసోల్ మరియు సిఓలియాక్ ప్రతిరోధకాలు సహా ఇతర రక్త పరీక్షలు.
- ఇన్సులిన్-వంటి పెరుగుదల కారకం 1 (IGF-1) ని పెరుగుదల హార్మోన్ లోపాన్నిగుర్తించేందుకు మరియు పెరుగుదల హార్మోన్ చికిత్సను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తారు.
రోగనిర్ధారణ నిర్ధారణ అయింతర్వాత వెంటనే చికిత్స ప్రారంభమవుతుంది. ఆ చికిత్సలో కింద పేర్కొన్నవి ఉంటాయి:
- పెరుగుదల హార్మోన్ లోపం ఉన్న పిల్లలలో మానవ పునరుత్పత్తి పెరుగుదల హార్మోన్ ను నిర్వహించడం.
- యుక్తవయస్సు సమయానికి మోతాదును నెమ్మదిగా గరిష్టస్థాయికి పెంచడం జరుగుతుంది. మరియు అస్థిపంజర పరిపక్వత పూర్తి అయినప్పుడు మందు ఇవ్వడం ఆగిపోతుంది.
- పెరుగుదల హార్మోన్ లోపానికి చేసే చికిత్సలో సోమాట్రోపిన్ ను ఉపయోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించింది.