సాధారణ మత్తు (జనరల్ అనస్థీషియా) - General Anesthesia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

సాధారణ మత్తు
సాధారణ మత్తు

సాధారణ మత్తు (అనస్థీషియా) అంటే ఏమిటి?

సాధారణ మత్తు (అనస్థీషియా) ను నియంత్రితంగా  స్పృహను కోల్పోయేలా చెయ్యడానికి ఉపయోగిస్తారు, దీనిని శస్త్రచికిత్సలు నిర్వహించవలసిన అవసరం ఉన్నపుడు ఉపయోగిస్తారు (తద్వారా శస్త్రచికిత్స సమయంలో వ్యక్తి కదలకుండా లేదా నొప్పిని అనుభవించకుండా ఉంటాడు). సాధారణ మత్తుమందులు అని పిలిచే మందులు వ్యక్తిని నిద్రపోయేలా చెయ్యడానికి ఉపయోగిస్తారు, లేదా శస్త్రచికిత్స సమయంలో సౌకర్యమైన మరియు సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఎందుకు దీనిని నిర్వహిస్తారు?

ఇది ఎప్పడు చేస్తారంటే:

  • శస్త్రచికిత్స చాలా నొప్పిని కలిగించేది అయినప్ప్పుడు లేదా చాలా సమయం తీసుకుంటే నొప్పిని తగ్గించడానికి.
  • వ్యక్తి యొక్క ఆందోళనను తగ్గించి సౌకర్యవంతంగా ఉండేందుకు లేదా విశ్రాంతి తీసుకునేందుకు.
  • శ్వాసని ప్రభావితం చేసే శస్త్రచికిత్సలకి సహాయం చేసేందుకు.

ఎవరికి అవసరం?

ఈ కింది సందర్భాలలో జనరల్ అనస్థీషియా అవసరం ఉంటుంది:

  • చాలా సమయం పాటు ఘాడమైన విశ్రాంతి అవసరం అయినశస్త్రచికిత్సా విధానాలలో
  • స్థానిక(local) లేదా ప్రాంతీయ (regional) అనస్థీషియా తగినంతగా సరిపోని శస్త్రచికిత్సలలో.
  • ఊహించినటువంటి (expected) రక్త నష్టం ఉండే శస్త్రచికిత్సలలో
  • ఊహించినటువంటి శ్వాస సమస్యలు ఉండే శస్త్రచికిత్సలలో.
  • సరిగ్గా సహకరించని రోగాలకు కూడా చిన్న ప్రక్రియలకు కూడా సాధారణ అనస్థీషియా అవసరమవుతుంది

దీనిని ఎలా నిర్వహిస్తారు?

ఈ క్రింది విధంగా దీనిని నిర్వహిస్తారు:

  • శస్త్రచికిత్స ప్రారంభించే ముందు, అనస్థీటిస్ట్ అని పిలిచే ప్రత్యేక నిపుణుడు అలెర్జీ చరిత్రను, ధూమపానం, మద్యపానం మరియు వ్యక్తి  సాధారణంగా తీసుకునే మందులు వంటి క్షుణ్ణమైన వైద్య చరిత్రను తెలుసుకుంటాడు. వ్యక్తికి ఆహారం లేదా ద్రవ పదార్దాలు తీసుకోవడంలో తగు సూచనలు ఇవ్వబడతాయి.
  • వ్యక్తికీ  ఇచ్చే మత్తు మందు ఈ క్రింది వాటిలో ఒకటి కావచ్చు:
    • లిక్విడ్ (ద్రవరూపం): ఇది ఒక కేన్యులా (సిరలో [vein] కి ఒక సన్నని, ప్లాస్టిక్ ట్యూబ్ పంపించడం) ఉపయోగించి సిరలలోనికి ప్రవేశపెట్టబడుతుంది.
    • గ్యాస్: ఒక మాస్క్ ద్వారా పీల్చడం.
  • నరాల (nerves) ద్వారా సంకేతాలు బదిలీకావడాన్ని అనస్తీటిక్స్ నిరోధిస్తాయి, తద్వారా మెదడు నొప్పిని గుర్తించే అనుభూతిని నిరోధిస్తాయి.
  • మత్తుమందు ప్రభావం మొదలయిన తరువాత, వ్యక్తి స్పృహ కోల్పోయే ముందు ఒక నిమిషం లేదా అంతకన్నా ఎక్కువ మైకాన్ని అనుభవిస్తాడు. ఇంట్రావెనస్ పెయిన్కిల్లర్ (Intravenous painkiller) మందులు కూడా ఆపరేషన్ తరువాత ఉండే నొప్పిని తగ్గించడం కోసం ఇవ్వబడతాయి.
  • ప్రక్రియ అంతటా, ముఖ్యమైన వాటిని (నాడి, శ్వాస మరియు రక్తపోటు) పర్యవేక్షిస్తారు.



వనరులు

  1. National Health Service [Internet]. UK; General anaesthesia
  2. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; General anaesthetics
  3. Smith G, Goldman J. General Anesthesia for Surgeons. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; General anesthesia
  5. André Gottschalk et al. Is Anesthesia Dangerous?. Dtsch Arztebl Int. 2011 Jul; 108(27): 469–474. PMID: 21814522