గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ అంటే ఏమిటి?

గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ (GIST లు) అనేవి జీర్ణాశయ కణాలలోని ఏర్పడే అరుదైన కణితులు. ఇవి కనక్టీవ్ టిష్యూ (connective tissue) యొక్క కణితులు. అవి ప్రాణాంతకమైన ([malignant], క్యాన్సరు) లేదా నిరపాయమైన ([benign] క్యాన్సర్ కాని) కణుతులు కావచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • కణితి ప్రధానంగా జీర్ణశయా ప్రేగుల నుండి రక్తంస్రావాన్ని చూపుతుంది. రక్తస్రావం కారణంగా రోగి రక్తహీనతని కూడా అభివృద్ధి చేయవచ్చు.
  • సాధారణంగా కణితి కడుపు లేదా చిన్న ప్రేగులలో మొదలవుతుంది.
  • ఇది కడుపు నొప్పి మరియు తిమ్మిరితో పాటు అధికమైన బరువు తగ్గుదలకు కారణమవుతుంది.
  • వికారం మరియు తరచూ వాంతులతో పాటు మింగడంలో కష్టం కూడా ఉంటుంది .
  • కణితి పరిమాణం పెరిగి, రోగికి  పొత్తికడుపు భారీగా పెరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది వ్యాపిస్తే, కాలేయం వంటి ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

  • గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ (GIST లు) సార్కోమాల (sarcomas) వర్గంలోకి వస్తాయి, అనగా అవి కనక్టీవ్ టిష్యూ యొక్క కణుతులు.
  • GIS కణితులు (గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్) వారసత్వంగా సంక్రమించవచ్చు అటువంటి సందర్భాలలో, ఇతర తీవ్రమైన సమస్యలతో ముడిపడి ఉంటాయి.
  • జన్యు మార్పులు (మ్యుటేషన్స్) కూడా GIST లకు కారణం కావచ్చు. GIS ట్యూమర్స్ యొక్క జన్యుపరమైన కారణాల గురించి చాలా పరిశోధన కొనసాగుతున్నది.
  • చాలా సందర్భాలలో, ఈ కణితి యొక్క కారణం తెలియదు.
  • పెద్ద వయసు వారిలో GIST లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ కణుతుల ప్రమాదం వయసుతో పాటు పెరుగుతుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ముందుగా, వైద్యులు రోగి ఆరోగ్య చరిత్ర మరియు ప్రస్తుత సంకేతాలు, లక్షణాలను గురించి రాసుకుంటారు (తెలుసుకుంటారు). రోగ నిర్ధారణలోని దశలు ఈ విధంగా ఉంటాయి:

  • నోరు, జీర్ణవ్యవస్థ మరియు ఉదరం యొక్క పరీక్షలు చాలా ముఖ్యమైనవి. GISTని   అనుమానించినట్లైతే, మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.
  • కణితి  యొక్క ఖచ్చితమైన స్థానం, పరిమాణం  మరియు పరిస్థితిని తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ తో పాటు జీర్ణశయా ప్రేగుల యొక్క ఎండోస్కోపీ సహాయపడతాయి.
  • ట్యూమర్  యొక్క తుది నిర్ధారణ కోసం, ట్యూమర్ కణజాలంలోని  చిన్న భాగాన్ని తీసి జీవాణుపరీక్ష (biopsy) నిర్వహిస్తారు.
  • ట్యూమర్ చికిత్సలో, శస్త్రచికిత్స ద్వారా కడుపులోని కణితిని తొలగించడం జరుగుతుంది లేదా లాప్రోస్కోపీని (laparoscopy) ఉపయోగించవచ్చు.
  • అయితే, పెద్ద పరిమాణంలో కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించటం కష్టం కావచ్చు.
  • కీమోథెరపీలో భాగంగా కణితి పరిమాణాన్ని తగ్గించడానికి మరియు వ్యాప్తిని నిరోధించడానికి మందులు ఇవ్వబడతాయి.
  • పెద్ద పరిమాణంలో ఉన్న కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించలేకపోతే రేడియేషన్ ను ఉపయోగించవచ్చు.

Medicines listed below are available for గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Sutent 12.5 Capsule7 Capsule in 1 Strip15250.52
Mortinib 100 Tablet10 Tablet in 1 Strip60.0
Imatinib Mesylate Tablet10 Tablet in 1 Strip2000.0
Sutent 50 Capsule7 Capsule in 1 Strip61003.44
Sutent 25 Capsule7 Capsule in 1 Strip29204.51
Sutent 50mg Capsule7 Capsule in 1 Strip61003.44
Sutent 25mg Capsule7 Capsule in 1 Strip29204.51
Mortinib 400 Tablet10 Tablet in 1 Strip250.0
Sutent 12.5mg Capsule7 Capsule in 1 Strip14786.42
Read more...
Read on app