జీర్ణాశయాంతర (గ్యాస్ట్రోఇంటస్టైనల్) రక్తస్రావం ఏమిటి?

జీర్ణాశయాంతర (గ్యాస్ట్రోఇంటస్టైనల్) రక్తస్రావం  అనేది నోటి నుండి మలద్వారం వరకు మొత్తం జీర్ణాశయంలో ఏ భాగం నుండైన  రక్తస్రావం జరిగే ఒక సమస్య. రక్త స్రావం తక్కువ కాలం పాటు తీవ్రంగా ఉండవచ్చు  లేదా దీర్ఘకాలం, సంవత్సరాలు పాటు తక్కువ తీవ్రతతో ఉండవచ్చు .

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

జీర్ణాశయాంతర (గ్యాస్ట్రోఇంటస్టైనల్) రక్తస్రావం విస్తారంగా ఎగువ జీర్ణాశయాంతర రక్తస్రావంగా  మరియు దిగువ జీర్ణాశయాంతర రక్తస్రావంగా రెండు రకాలుగా వర్గీకరించబడింది. ఎగువ జీర్ణాశయాంతర రక్తస్రావంలో ముదురు ఎరుపు రంగులో ఉండే వాంతులు, కాఫీలా ఉండే వాంతులు, ముదురు రంగులో ఉండే మలం లేదా రక్తంతో కలిసిన మలం వంటి లక్షణాలు కనిపిస్తాయి; దిగువ జీర్ణాశయాంతర రక్తస్రావంలో ముదురు ఎరుపు రంగులో ఉండే మలం లేదా మొలలు వంటి సమస్యలతో మలవిసర్జన సమయంలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలిక రక్త నష్టం వలన అలసట, పేలవమైన చర్మం, రక్తహీనత, గుండె సమస్యలు, పోషకాహార లోపాలు మరియు కళ్ళు తిరగడం వంటి సంకేతాలు మరియు లక్షణాలు కనిపిస్తాయి.

గ్యాస్ట్రోఇంటస్టైనల్ రక్తస్రావానికి దాని ప్రారంభ దశలోనే చికిత్స చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఏవిధమైన రక్త నష్టం అయినా ప్రాణాంతకమవుతుంది.

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎగువ జీర్ణాశయాంతర రక్తస్రావం యొక్క కారణాలు

  • అన్నవాహికలో (Oesophageal) సమస్యలు.
  • కడుపులో పుండ్లు.
  • మలోరీ-వీస్ సిండ్రోమ్ (Mallory-Weiss syndrome) అని పిలవబడే అన్నవాహిక గోడలలో (oesophageal lining) లో చీలికలు ఏర్పడే రుగ్మత.
  • అన్నవాహిక క్యాన్సర్.

దిగువ జీర్ణశయాంతర రక్తస్రావం ప్రధానంగా వీటి వలన సంభవిస్తుంది

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వ్యక్తి యొక్క ప్రస్తుత మరియు మునుపటి ఆరోగ్య చరిత్రను గురించి స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది, తద్వారా లక్షణాలు యొక్క ఖచ్చితమైన స్వభావం మరియు విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. దీని తరువాత రక్తస్రావ సంకేతాలను పరిశీలించడానికి పూర్తి భౌతిక పరీక్ష ఉంటుంది.

అది పూర్తయిన తర్వాత, రక్త స్రావం యొక్క స్థానం మీద ఆధారపడి కొన్ని రకాలైన పరీక్షలు ఆదేశించబడతాయి. ఎగువ జీర్ణశయాంతర రక్తస్రావలలో, ఎండోస్కోపీ నిర్వహిస్తారు. దీని ద్వారా వైద్యులు ఎగువ జీర్ణశయాన్ని పరిశీలించవచ్చు, పుండ్లు లేదా ఇతర సమస్యలను తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా, దిగువ జీర్ణశయాంతర రక్తస్రావం యొక్క కారణాలను తెలుసుకోవడం కోసం, కొలనోస్కోపీ (colonoscopy) ని ఆదేశిస్తారు. రోగి యొక్క వయస్సు మీద ఆధారపడి, పూర్తి రక్త గణన, మల పరీక్షలు మరియు ఇసిజి (ECG) వంటి ఇతర పరీక్షలు ఉంటాయి.

చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. రక్తనాళాలు సరిచేయడానికి మందులు సూచించబడతాయి. పెప్టిక్ అల్సర్స్ (పూతల) కోసం, కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించే ప్రోటాన్ పంప్ నిరోధకాలు (proton pump inhibitors)  ఇవ్వబడతాయి. ఎండోస్కోపీ కూడా రక్తనాళాలను బలోపేతం చేయడానికి కొన్ని క్లిప్లను లేదా బ్యాండ్లను ఉపయోగించడం ద్వారా రక్తస్రావ సమస్యతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సహాయక చికిత్సలో రక్తం మార్పిడి ఉంటుంది, ప్రత్యేకించి అధికంగా రక్త నష్టం ఉన్నపుడు. మొలలు మరియు మల సమస్యలను శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయవచ్చు.

Medicines listed below are available for జీర్ణాశయాంతర (గ్యాస్ట్రోఇంటస్టైనల్) రక్తస్రావం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Cipzer Majun Sangdana Murgh 125 gm125 gm Majun in 1 Bottle449.0
Read more...
Read on app