గ్యాస్ట్రైటిస్ - Gastritis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 05, 2019

March 06, 2020

గ్యాస్ట్రైటిస్
గ్యాస్ట్రైటిస్

సారాంశం

పుండ్లు అనునవి అత్యంత సాధారణ జీర్ణ రుగ్మతలు (లోపాలు) లో ఒకటి.  కడుపు యొక్క లోపలి భాగములో ఏర్పడే మంట మరియు బాధ వలన ఇవి ఏర్పడుతాయి. ఈ కడుపు మంట అనునది నొప్పిని, కడుపు యొక్క పైభాగములో మండే స్వభావము, గుండెల్లో మంట, త్రేనుపు, ఆహారము యొక్క వాంతి, వికారం, మరియు అప్పుడప్పుడు వాంతులు కావడం వంటి వాటికి కారణమవుతుంది.  పెయిన్ కిల్లర్లను (NSAIDs) చాలా కాలంపాటు ఉమయోగించడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పొగ త్రాగడం, ఆల్కహాల్, మరియు కొన్ని ఆటో ఇమ్యూన్ పరిస్థితుల ఫలితముగా పుండ్లు ఏర్పడతాయి.  ఇవి కొన్నిసార్లు ఎక్కువ సంవత్సరాల పాటు ఆలస్యము చేస్తాయి.  ఎండోస్కోపీ ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు.  చికిత్స ఎంపికలు అనగా ఆమ్లాహారాలను ఉపయోగించడం, యాంటిబ్యాక్టీరియల్ థెరపీ, మరియు ఆహార మార్పులు వంటి ఎంపికలను కలిగి ఉంటాయి. 

గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు - Symptoms of Gastritis in Telugu

పుండ్ల రకాలను ఆధారము చేసుకొని లక్షణాలు విస్తృత వైవిధ్యాలను చూపుతాయి.  కడుపులో మండే స్వభావము మరియు కడుపు యొక్క మధ్య భాగములో మంట (గుండె మంట) అనునది పుండ్ల యొక్క ఒక సాధారణ లక్షణము.  కొంతమంది ప్రజలు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండరు మరియు అజీర్ణ సమస్య రూపములో మాత్రమే కొంత సమస్యను అనుభవిస్తారు.

పుండ్ల యొక్క లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • కడుపులో మండే స్వభావము లేక పొత్తి కడుపు యొక్క పై భాగములో మండే స్వభావము కలిగి ఉండడం.
  • గుండె మంట (చాతీ ప్రాంతములో మంట).
  • అధికమైన త్రేన్పులు.
  • ఆహారనాళము(అన్నవాహిక)లో లేక నోటిలో ఆహారము యొక్క వాంతి.
  • పొత్తికడుపులో మందకొడిగా ఉండే భావన.
  • భోజనం తరువాత కడుపు నిండడం లేక భారముగా ఉండడం.
  • వికారం.
  • వాంతులు.
  • అజీర్ణం
  • ఆకలి మందగించడం.
  • ఎక్కిళ్ళు.

పుండ్ల యొక్క రకము మరియు రోగ కారణము పైన ఆధారపడి లక్షణాల యొక్క తీవ్రత మారుతూ ఉంటుంది.  అయినప్పటీకీ, ఇక్కడ కొన్ని భయంకరమైన, ఎరుపు-గీత           (ప్రమాదకరమైన) లక్షణాలు కలవు; క్రింద ఇవ్వబడిన గుర్తులు మరియు లక్షణాలలో మీరు ఏవైనా కలిగిఉంటే, మీరు మీ డాక్టరును సంప్రదించడం మంచిది.

  • పొత్తికడుపు పై భాగము లేక కడుపు ప్రాంతములో తీవ్రమైన నొప్పి (కత్తితో పొడిచినటువంటి లేక శూలముతో గ్రుచ్చినటువంటి) నొప్పి.
  • రక్తము యొక్క వాంతి (రక్తము).
  • ముదురు నలుపు లేక నలుపు రంగు మలము బయటకు రావడం.
  • తలతిరగడం (మైకము) లేక నిస్సత్తువ (నీరసము).
  • శ్వాస ఆడకపోవడం.
  • బలహీనత.
  • పాలిపోవడం.

ఈ లక్షణాలు పుండ్ల లేక పుండ్ల కోత యొక్క తీవ్ర రూపమును సూచిస్తాయి, దీనికి సత్వర చికిత్స అవసరమవుతుంది.

గ్యాస్ట్రైటిస్ యొక్క చికిత్స - Treatment of Gastritis in Telugu

అదృష్టవశాత్తు, పుండ్ల యొక్క అనేక రూపాలు సమర్థవంతమైన నివారణ మరియు చికిత్సను కలిగిఉంటాయి.  పుండ్ల యొక్క కారణాలు నిర్ధారణ చేయబడినప్పుడు, ఒక నిర్ధిష్టమైన చికిత్స సాధారణముగా వ్యాధిని నయంచేస్తుంది.  పుండ్ల యొక్క చికిత్స అనునది సూచకప్రాయమైనది (ఆమ్లాహారాల ఉపయోగము, ప్రోటాన్-పంప్ నిరోధకాలు, లేక H2 బ్లాకర్స్), మరియు నిశ్చయాత్మక చికిత్స యాంటిబయాటిక్స్ లేక యాంటి-పరాన్నజీవి మందుల ఉపయోగమును కలిగియుంటుంది.

  • యాంటాసిడ్స్(ఆమ్లాహారాలు)
    ఈ తరగతి యొక్క మందులు మెగ్నీషియం మరియు అల్యూమినియం లవణాలను కలిగి ఉంటాయి, ఇది కడుపులోని ఆమ్లమును తటస్థీకరిస్తుంది మరియు నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది.  అయితే, అవి అతిసారం లేక మలబధ్ధకముఏర్పడటానికి కారణమవుతాయి.
  • ప్రోటాన్ పంప్ నిరోధకాలు
    ఈ తరగతికి చెందిన మందులు, కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి, తద్వారా లక్షణాలను తొలగిస్తాయి మరియు చికాకు లేక మంటను నయంచేస్తాయి.  కొన్ని నిరోధకాలు పాంటోప్రజోల్, ఓమేప్రజోల్,రబేప్రజోల్, మరియు ఎసొమేప్రజోల్ అనునవి.
  • H2 బ్లాకర్స్
    ఈ తరగతికి చెందిన మందులు, కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి, అయితే ప్రోటాన్ పంప్ నిరోధకాలు కంటే ఇది సాపేక్షముగా తక్కువ సామర్థ్యమును కలిగి ఉంటుంది.  రానిటిడైన్, నిజాటిడైన్, మరియు ఫామోటిడైన్ అనునవి కొన్ని ఉదాహరణలు.
  • యాంటిబయాటిక్స్
    కడుపులోని లైనింగ్స్ ను నష్టపరిచే మరియు ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను ఆపడానికి లేక చంపడానికి వీటిని ఉపయోగిస్తారు, ప్రత్యేకముగాహెచ్.పైలోరి. ఇవి అమోక్సిసిల్లిన్, మెట్రోనిడజోల్, లేక క్లారిథ్రోమైసిన్ లను కలిగి ఉంటాయి.

అత్యధికమైన సందర్భాలలో, జీవనశైలి మార్పుతో పాటు మిశ్రమ చికిత్స అనునది పుండ్లను నిర్వహించడానికి సహాయంచేస్తుంది.

జీవనశైలి నిర్వహణ

పుండ్లు సాధారణ జీవనశైలి పైన ప్రభావము చూపిస్తాయి. ప్రత్యేకముగా, మందులు తగినంతగా లేనప్పుడు,  సమస్యలను తొలగించడానికి దీర్ఘకాలిక రూపము నకు విస్తృతమైన మార్పులు అవసరము.  పుండ్లకు సంబంధించి జీవనశైలిలో మార్పులు వీటిని కలిగిఉంటాయి:

  • భోజన పధకాలు
    ఎక్కువగా ఆహారం తీసుకోవడం ఫలితముగా ఎక్కువ ఆమ్లము ఏర్పడుతుంది  కాబట్టి, తక్కువగా మరియు తరచుగా ఆహారమును తీసుకోవడము బాగా పనిచేస్తుంది, మరియు కడుపు యొక్క సామర్థ్యము కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది (కడుపులో వాంతిని ఏర్పరుస్తుంది).  దీనితో పాటు, ఆహారము తీసుకోవడము మధ్య ఎక్కువ సమయము కూడా ఆమ్లమును ఉత్పత్తి చేస్తుంది, ఇది తరువాత కడుపు యొక్క లైనింగ్స్ ను నష్టపరుస్తుంది.
  • ప్రొబయాటిక్స్ యొక్క ఉపయోగముప్రొబయాటిక్స్ అనునది సాధారణ వృక్షజాలము యొక్క ఆంత్రముగా కొనసాగుతుందని తెలుపబడుతుంది మరియు కడుపులో పుండ్లను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే, కడుపు యొక్క ఆమ్ల స్రావాల పైన ప్రభావమును చూపించదు.  పెరుగు మరియు మజ్జిగ అనునవి సహజమైన ప్రొబయాటిక్స్ మరియు ఇవి ఆహారములో చేర్చబడి ఉంటాయి.
  • ఆల్కహాలును దూరముగా ఉంచడం
    ఆల్కహాలు కూడా కడుపు యొక్క లైనింగ్స్ కు చికాకు తెప్పిస్తుందని తెలుపబడింది.
  • పొగ త్రాగడమును దూరముగా ఉంచడం
    ధూమపానం అనునది కడుపులో ఆమ్ల స్రావాలను పెంచే కారకాలలో ఒకటిగా తెలుపబడింది.
  • మసాలా గల ఆహారమును దూరముగా ఉంచడం
    మసాలా లేక ఇతర చికాకు కలిగించే ఆహార పదార్థాలు కూడా  కడుపు యొక్క ఆమ్ల స్రావాలను పెంచుతుంది మరియు దాని యొక్క లోపలి లైనింగ్స్ కు నష్టము కలుగచేస్తుంది.
  • నొప్పి నిర్వహణ
    ప్రత్యామ్నాయ లేక ఇతర సురక్షిత నొప్పి-ఉపశమన ప్రమాణాలు లేక మందులు, కడుపులో ఆమ్ల స్రావాలను తగ్గించడములో సహాయపడతాయి.
  • బరువు నిర్వహణ
    బరువును కోల్పోవడం లేక బిఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) యొక్క లక్ష్యాన్ని సాధించడం అనునవి చాలా కాలంపాటు ఉన్న పుండ్ల తీవ్రతను తగ్గించడములో సహాయపడతాయి.  ఇవికాకుండా, పండ్లు, కూరగాయలు లోని అధిక పోషకాలు, మరియు మొత్తం ధాన్యం అంతయూ ఉపయోగకరమైనది.
  • ఒత్తిడి నిర్వహణ
    ఒత్తిడి అనునది కడుపులో ఆమ్ల స్రావాలు పెరగడానికి మరొక కారకము.  యోగా, శ్వాస సంబంధ పధ్ధతులు, మరియు ధ్యానము వంటివి ఒత్తిడిని నిర్వహించడములో సహాయం చేస్తాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW

గ్యాస్ట్రైటిస్ అంటే ఏమిటి? - What is Gastritis in Telugu

పుండ్లు అనునవి కడుపు యొక్క అంతర్గత లైనింగ్స్ లో ఏర్పడే  చికాకు లేక మంట.  ఆరోగ్యవంతులైన వ్యక్తులలో కడుపు ఆమ్లాలను, వివిధ ఎంజైములను, మరియు శ్లేష్మమును ఉత్పత్తి చేస్తుంది.  పుండ్లు ఏర్పడిన సమయములో, శ్లేష్మము తగ్గిపోతుంది, మరియు కడుపు తన యొక్క స్వంత ఆమ్లమును ప్రదర్శిస్తుంది, ఇది నొప్పి మరియు కడుపు ప్రాంతములో మంటతో పాటు ఆహారము యొక్క అజీర్ణము మరియు అప్పుడప్పుడూ వాంతులు ఏర్పడుటకు కారణమవుతుంది.  ఆహారములో మార్పులతో పుండ్లను నిర్వహించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు మరియు చికిత్స ఏజెంట్లు అధిక విజయవంతమైన రేటును కలిగి ఉంటాయి.

ప్రతీ ఒక్కరు వారి జీవితకాలములో కనీసం ఒక్కసారైనా ఈ పరిస్థితిని అనుభవిస్తారు, వాటికి సంబంధించిన కారణాలు విస్తృతముగా ఉంటాయి.  ఇన్ఫెక్షన్స్, మందులు, ధూమపానం, మద్యపాన వ్యసనం,  ఒత్తిడి మరియు రోగ నిరోధక వ్యవస్థ-సంబంధ పరిస్థితులు అనునవి పుండ్లు ఏర్పడడానికి ప్రదాన బాధ్యులు.  ఇది చాలా తీవ్రమైనది లేక దీర్ఘకాలమైనది.  ఒకవేళ లక్షణాలు చాలా ప్రాముఖ్యముగా, తీవ్రముగా ఉండి మరియు వాటిని కొన్ని రోజులలో పరిష్కరించగలిగితే, వాటిని హఠాత్తు లేక అకస్మాత్తు పుండ్లుగా పిలువవచ్చు. దీనికి వ్యతిరేకముగా, దీర్ఘకాల పుండ్లు అనునవి తేలికపాటి నుండి మోడరేట్ లక్షణాలుగా ఉంటాయి, ఇవి చాలాకాలం పాటు నిలిచి ఉంటాయి.



వనరులు

  1. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Gastritis.
  2. National Health Service [Internet]. UK; Gastritis.
  3. Kulnigg-Dabsch S. Autoimmune gastritis. Wiener Medizinische Wochenschrift (1946). 2016;166(13):424-430. PMID:27671008.
  4. Nimish Vakil; Erosive Gastritis. The Merck Manual Professional Version [internet]. US.
  5. Rugge M, Meggio A, Pennelli G, Piscioli F, Giacomelli L, De Pretis G, Graham DY. Gastritis staging in clinical practice: the OLGA staging system. . Gut. 2007 May;56(5):631-6. Epub 2006 Dec 1. PMID: 17142647.
  6. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Gastritis.
  7. Digestive Disease Center [Internet]; Medical University of South Carolina: Gastritis.
  8. Merck Manual Consumer Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Inc.; c2018. Gastritis.
  9. Genta RM. The gastritis connection: prevention and early detection of gastric neoplasms. J Clin Gastroenterol. 2003 May-Jun;36(5 Suppl):S44-9; discussion S61-2. PMID: 12702965.
  10. Nimish Vakil; Overview of Gastritis. The Merck Manual Professional Version [internet]. US.

గ్యాస్ట్రైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for గ్యాస్ట్రైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.