పూర్తి చికిత్స కొరకు అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు యాంటిఫంగల్ మందులు అవసరమవుతాయి. కొన్నిఇన్ఫెక్షన్లు చాలా స్వల్పమైనవి మరియు మందులు లేకుండా తీవ్రతను పెంచడం లేక తగ్గించడం చేస్తాయి, లోతైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు అనునవి హానికరమైనవి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల కొరకు చికిత్స అనునది ఎక్కువగా మారుతూ ఉంటుంది మరియు వాటిలో ఎక్కువ భాగం లోకల్ అప్లికేషన్ల యొక్క అప్లికేషన్ ద్వారా నయం చేయబడతాయి, మిగిలిన రకాలకు కొన్నిటికి శస్త్ర చికిత్స అవసరమవుతుంది. ఖచ్చితమైన చికిత్స కొరకు తగిన రోగ నిర్ధారణ అవసరమవుతుంది , మాఇయు డాక్టర్ యొక్క సలహా లేకుండా ఏ విధమైన మందులు తీసుకోకూడదు.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల కొరకు కొన్ని సాధారణ చికిత్స ఎంపికలు క్రింది ఇవ్వబడ్డాయి:
యాంటిఫంగల్ మెడిసిన్స్
ఇన్ఫెక్షన్ యొక్క రకము మరియు తీవ్రత పైన ఆధారపడి యాంటిఫంగల్ మెడిసిన్స్ అనునవి టాపికల్ (స్థానికము), ఓరల్, లేక ఇంజెక్టబుల్ మెడిసిన్స్ గా ఇవ్వబడ్డాయి. కణాలు చనిపోవునట్లు చేసి, ఫంగి యొక్క కణ గోడలను నాశనము చేయడము ద్వారా, యాంటిఫంగల్ మెడిసిన్స్ పనిచేస్తాయి. ఫంగి యొక్క అభివృద్ది మరియు పునరుత్పత్తిని నివారించడము ద్వారా కూడా ఇవి పనిచేస్తాయి. విభిన్న తరగతులకు సంబంధించి మార్కెట్లో చాలా రకాల యాంటిఫంగల్ ఏజెంట్స్ లభ్యమవుతాయి, అవి పాలీయెన్, ట్యూబులిన్ డిస్ట్రప్టర్, అజోల్స్, అలైలామైన్, ఒక పైరిమైడిన్ అనలాగ్ మరియు ఎఖినోకాండిన్.
కార్టికో స్టెరాయిడ్స్
కార్టికో స్టెరాయిడ్స్ లేక స్టెరాయిడ్స్ ను 1950 వ సంవత్సరం చివరనుండి వ్యాధులకు చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.
చర్మము కొరకు కొన్ని టాపికల్ కార్టికో స్టెరాయిడ్స్ అనునవి హైడ్రోకార్టిసోన్, బేటామేధాసో, క్లోబెటాసోల్, క్లోబెటాసోన్/క్లోబెటాసోల్, డైఫ్లుకార్టోలోన్ మరియు ఫ్లుయోసినోలోన్.
ఓరల్ కార్టికో స్టెరాయిడ్స్, ప్రెడ్నిసోలోన్, ప్రెడ్నిసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్, డెక్సామెథాసోన్, మరియు హైడ్రోకార్టిసోన్ లను కలిగిఉంటాయి.
ఇంజెక్టబుల్ ఇంట్రావెనస్ లేక ఇంట్రామస్కులర్ స్టెరాయిడ్స్, హైడ్రోకార్టిసోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్, మరియు డెక్సామెథాసోన్ లను కలిగి ఉంటాయి. ఇన్హేల్డ్ కార్టికో స్టెరాయిడ్స్, ఫార్ములేషన్స్ (సూత్రీకరణలు), అనగా బెక్లోమెథాసోన్, ఫ్లుటికాసోన్, బుడేసోనైడ్, మొమెటసోన్, మరియు సిసిల్సోనైడ్ లను కలిగి ఉంటాయి.
శ్వాసనాళ ధమని (బ్రోనికైల్ ఆర్టెరీ) యొక్క ఎంబోలిజేషన్
రక్త కఫ రోగము, రోగి తన యొక్క దగ్గులో రక్తమును వాంతికి చేసుకొను పరిస్థితి, చాలా తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న సంధర్భాలలో, బ్రోనికైల్ ఆర్టెరీ యొక్క ఎంబోలిజేషన్ గుండా చికిత్స జరిగిస్తారు. ఈ పరిస్థితి సాధారణ స్థితి నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న పరిధి వరకు ఉంటుంది. సాధారణ కేసులను ఓరల్ మెడిసిన్స్ తో చికిత్స చేస్తారు, అలాగే తీవ్రమైన కేసులకు ఆసుపత్రిలో ఉండటముతో పాటు రక్త మార్పిడి కూడా అవసరమవుతుంది. తీవ్రమైన కేసులకు చికిత్స చేయడము చాలా కష్టము మరియు కొన్నిసార్లు పరిస్థితి ఊహించలేని విధముగా ఉంటుంది. వేగముగా మరియు త్వరితముగా ప్రతిస్పందించడము మరియు వివిధ దుష్ప్రభావాలను నియంత్రించడానికి రోగ నిర్ధారణ అనునది తరచుగా అవసరమవుతుంది మరియు పరిస్థితి యొక్క రోగ నిరూపణ చూపవలసి ఉంటుంది.
రోగ నిరోధక చికిత్స
హానికరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ల యొక్క సంధర్భాలలో, రోగి యొక్క రోగ నిరోధక వ్యవస్థ తీవ్రముగా రాజీపడుతుంది. విస్తృత స్థాయి యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మరణాల రేటు చాలా అధికముగా దగ్గరగా 40% వరకు ఉంటుంది. రోగ నిరోధక చికిత్స యొక్క లక్ష్యము, రోగి యొక్క రోగ నిరోధక వ్యవస్థను మెరుపరచి హానికరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేలా చేయటం.
- తెల్ల రక్త కణాల (WBC) మార్పిడి
ఇవి రోగి యొక్క నిరోధక శక్తిని మెరుపరచడములో సహాయము చేస్తాయి మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడుటలో సహాయం చేస్తాయి. అయినప్పటికీ, తెల్ల రక్త కణాల (WBC) మార్పిడి యొక్క నాణ్యత కీలక\మైనది. ఈ మార్పిడులు తీవ్రమైన ఇన్ఫెక్షన్ల పురోగతిని నియంత్రించడానికి సహాయంచేస్తాయి, ఇవి యాంటీబయాటిక్స్ చేత సులభముగా నియంత్రించబడవు.
- గ్రాన్యులోసైట్ కాలనీ-స్టిములేటింగ్ కారకం
ఎముక మజ్జ ద్వారా తెల్ల రక్త కణాల WBCs యొక్క ఉత్పత్తిని ఉత్తేజపరచుట ఈ చికిత్స యొక్క లక్ష్యము మరియు రోగ నిరోధక వ్యవస్థ యొక్క మిగిలిన భాగాలను ప్రభావితం చేస్తుంది.
- గామా ఇంటర్ఫెరాన్
గామా ఇంటర్ఫెరాన్ రోగ నిరోధక కణాల యొక్క మెకానిజమును మెరుగుపరుస్తుంది మరియు వీటిని ఫంగిని నాశనము చేసే ఉత్తమ నాశనకారులుగా తయారుచేస్తుంది.
శస్త్ర చికిత్స
ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రమైన కేసులలో, చికిత్సకు సంబంధించిన ఇతర ఎంపికలు విఫలమయినప్పుడు అక్కడ శస్త్ర చికిత్స అనునది అవసరమవుతుంది.
మెదడు
- గుల్మం లేక క్రిప్టోకొకొమా
ప్రత్యేకముగా ఇన్ఫెక్షియస్ మాస్ అనునది హానికరముగా ఉన్నప్పుడు, రోగులు ఇన్ఫెక్షియస్ మాస్ ను శస్త్ర చికిత్స తొలగింపు ద్వారా తీసివేయవలసి ఉంటుంది. దీర్ఘకాలం నుండి యాంటిఫ్యూగల్ చికిత్సను తీసుకుంటున్న రోగులలో, జీవి అనునది నిశ్చల (స్టాటిక్) స్థితిలో ఉంటుంది మరియు ఇది తరువాత చికిత్సకు సహాయపడలేదు; ఈ సంధర్భాలలో శస్త్ర చికిత్స తొలగింపు అనునది రికమెండ్ చేయబడుతుంది.
- సెరెబ్రల్ ఆబ్సెస్ (మస్తిష్క గడ్డ)
గడ్డ యొక్క స్థాయిపైన ఆధారపడి స్టీరియోటాక్టిక్ డ్రైనేజ్ లేక గడ్డ యొక్క పూర్తి తొలగింపు అనునది అవసరమవుతుంది.
కన్ను
- ఎండోఫ్థామిటిస్ (కనుగుంట శోధము)
ఫంగల్ ఎండోఫ్థామిటిస్ యొక్క అధిక కేసులలో, సూక్ష్మజీవులను మరియు చెత్తను తొలగించుటకు ఒక వట్రక్టమీ అనునది సూచించబడుతుంది.
- కెరటిటిస్ (శోధము)
ఈ పరిస్థితికి చికిత్స చేయుటకు ఒక శస్త్ర చికిత్స అనునది సాధారణముగా సూచించబడుతుంది, ప్రత్యేకముగా లోతైన కార్నియార్ గాయాలు ఉన్నప్పుడు, సాధారణముగా 50% కంటే ఎక్కువ మంది రోగులు యాంటి ఫ్యూగల్ చికిత్సకు అనుకూలముగా ప్రతిస్పందించరు.
ముక్కు
క్రానిక్ సైనుసైటిస్ సంధర్భాలలో, శస్త్ర చికిత్స అన్ని అలెర్జీ శ్లేష్మకములోని ముఖ్య పదార్థమును, ఫంగల్ శిథిలాలు, మరియు నాసికా పాలిప్స్ లను తొలగిస్తుంది మరియు అంతర్లీన శ్లేష్మమును సంరక్షిస్తుంది.
- సైనుసెస్ యొక్క ఫంగల్ బాల్ (ఎముక రంధ్రాల యొక్క ఫంగల్ బంతి)
శస్ర చికిత్స తొలగింపు ద్వారా ఫంగల్ బాల్ ను తొలగించుట అనునది వ్యాధిని అధిక భాగం నయంచేయుటకు సహాయం చేస్తుంది. అప్పుడప్పుడు, స్థానిక ఇన్వాసన్ (దాడి)ని నివారించుటకు ఒక యాంటిఫంగల్ చికిత్స అనునది ఇవ్వబడుతుంది.
చెవి
చెవి యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లో, అప్పటికప్పుడు ఎముక నుండి దెబ్బతిన్న కణజాలమును తొలగించుటకు శస్త్ర చికిత్స తరచుగా అవసరమవుతుంది మరియు దీని ఫలితముగా వ్యాధిసోకిన భాగముపైన పూర్తి వినికిడిని కోల్పోవుట జరుగుతుంది.
ఊపిరితిత్తులు
- గాలు ఊపిరితిత్తుల (పల్మనరీ) ఏస్పర్జిల్లస్ అను ఫంగస్ వలన పుట్టే జబ్బు
జీవితమును కాపాడడానికి ఒక అత్యవసర చికిత్స తరచుగా అవసరమవుతుంది, ధమనలు రక్తస్రావ ప్రమాదములో ఉంటాయి.
- ఏస్పర్గిల్లోమా మరియు దీర్ఘకాలిక (పల్మనరీ) ఏస్పర్జిల్లస్ అను ఫంగస్ వలన పుట్టే జబ్బు
ఒక శస్త్ర చికిత్స అనునది అధిక మనుగడ రేటును ఇస్తుంది మరియు వ్యాధి యొక్క పురోగతిని మరియు తరువాత వచ్చే సమస్యలను నివారిస్తుంది.
గుండె
- పెరికార్డిటిస్
పెరికార్డియల్ నిర్మాణము యొక్క సంధర్భములో, పెరికార్డియోక్టమీ లేక పెరికార్డియం (ఊపిరితిత్తుల) లేక పెరికార్డియం యొక్క ఒక భాగమును తొలగించుట అవసరమవుతుంది. ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి డ్రైనేజ్ అనునది ప్రారంభములోనే అవసరమవుతుంది, తరువాత ఒక శస్త్రచికిత్స నిర్వహించబడుతుంది.
- ఎండోకార్డిటిస్ ఇన్ఫెక్షన్లు
శస్త్ర చికిత్స అనునది ఈ ఇన్ఫెక్షన్ ఒక ఉత్తమ చికిత్స ఎంపిక మరియు ఇది ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా నిర్వహించబడుతుంది. సమస్యలు తలెత్తిన తరువాత రికవరీ అనునది సాధారణముగా కష్టమవుతుంది.
- పేస మేకర్ మరియు కార్డియోవర్టర్-డెఫిబ్రిల్లేటర్ వైర్ ఇన్ఫెక్షన్: ఈ సందర్భములో, గుండె శస్త్రచికిత్సలో ఉరోస్థిని చీల్చుట మరియు హృదయ బైపాస్ సర్జరీ లతో పాటు ప్రధాన-వెలికితీత అనునది కూడా తీసుకోబడుతుంది.
ఎముక
- చాతీ ఎముక యొక్క సంక్రమణ గాయాలు
ఈ సందర్భములో, గాయాన్ని శుభ్రపరచడానికి మరియు వ్యాధి సోకిన ప్రాంతములో తీగలను తొలగించడానికి ఒక శస్త్ర చికిత్స నిర్వహించబడుతుంది. యాంటిఫంగల్ చికిత్స తరువాత శస్త్ర చికిత్స అనునది అనుసరించబడుతుంది.
- వెన్నుపూస శరీర సంక్రమణం
ఎముకల యొక్క ఈ ఇన్ఫెక్షన్ కు సంబంధించి చెత్త లేక డెబ్రిస్ ను తొలగించడానికి ఒక శస్త్ర చికిత్స అవసరమవుతుంది. స్థితి పైన ఆధారపడి ఎముక అంటుకట్టడం కూడా అవసరమవుతుంది.
జీవనశైలి నిర్వహణ
కొన్ని జీవనశైలిలు ఒక వ్యక్తిని పర్యావరణ వ్యాధికారకమునకు, ఫంగి వంటి వాటికి లోనయ్యేలా తయారుచేస్తుంది. ఒకవేళ మీరు తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల చేత బాధపడుతుంటే మరియు ఈ ఇన్ఫెక్షన్ కారణము మీ యొక్క పనికి సంబంధించినదైతే, అనగా గార్డెనింగ్ లేక టాట్టూయింగ్, అప్పుడు మీ యొక్క వృత్తిలో మార్పు అనునది మీకు పరిష్కారమును సమకూరుస్తుంది. మరలా తిరిగి వచ్చే అలెర్జీలు కలిగిన వ్యక్తులకు, డాక్టర్లు తరచుగా ఇచ్చే సలహా ఏమనగా, మరింత అనుకూల వాతావరణం గల ప్రదేశాలకు మీరు మారాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి, జీవనశైలి ప్రధాన పాత్ర పోషించనప్పటికీ, జీవనశైలి నిర్వహణ అనునది పునరావృతమయ్యే అలెర్జిక్ ఇన్ఫెక్షన్లను తొలగించుటలో సహాయము చేస్తుంది.