గర్భధారణ సమయంలో తరచూ మూత్రవిసర్జన అంటే ఏమిటి?
తరచుగా మూత్రవిసర్జన అనేది గర్భధారణ సమయంలో అత్యంత సాధారణ మరియు ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఇది మొదటి త్రైమాసికంలోని మొదటి కొన్ని వారాలలో ప్రారంభమవుతుంది మరియు చాలామంది మహిళలకు గర్భధారణ చివరి వరకు కొనసాగుతుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- గర్భధారణ సమయంలో మూత్రవిసర్జన భావన ఒక స్త్రీ నుండి మరొక స్త్రీకి భిన్నంగా (వేరుగా) ఉంటుంది. కొందరు తల్లులు వారి గర్భధారణ సమయంలో తరచూ మూత్రవిసర్జన భావనని అనుభవించవచ్చు, ఐతే కొంతమందికి అలాంటి భావన ఉండకపోవచ్చు.
- రెండవ త్రైమాసికంలో మూత్రవిసర్జన భావన తగ్గుతుంది, పెరుగుతున్న పిండం యొక్క ఒత్తిడి మూత్రాశయం పై పడడడం వలన మూడవ త్రైమాసికంలో అది (ఆ భావన) పెరుగుతుంది.
- గర్భిణీ స్త్రీలలో తరచుగా మూత్రవిసర్జన అనేది మూత్ర నాళ సంక్రమణ (UTI) తో సంబంధం కలిగి ఉంటుంది, ఇది కాబోయే తల్లులలో ఒక సాధారణ అంటువ్యాధి (ఇన్ఫెక్షన్).
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- పెరుగుతున్న పిండానికి అనుగుణంగా గర్భాశయం విస్తరించడం వలన, అది మూత్రాశయం మీద ఒత్తిడిని కలిగిస్తుంది, గర్భిణీ స్త్రీలలో మూత్రవిసర్జన అధికమవ్వడానికి దారితీస్తుంది.
- గర్భధారణ సమయంలో, శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి, అవి మూత్రపిండమును మరియు మూత్రాశయమును కూడా ప్రభావితం చేస్తాయి మరియు తరచూ మూత్రవిసర్జన దారితీస్తాయి.
- శరీరంలో రక్తం యొక్క పరిమాణం పెరుగుతుంది కాబట్టి, మూత్రపిండాలు మరింత అధికంగా ద్రవాలను ఉత్పత్తి చేస్తాయి. దీని అర్ధం మూత్రాశయంలో మరింత అధికంగా మూత్రం చేరుతుంది (పేరుకుంటుంది) తద్వారా దానిని తొలగించాలనే కోరిక చాలా తరచుగా ఏర్పడుతుంది.
- ఈ లక్షణం గర్భధారణ ప్రేరిత మధుమేహంతో కూడా ముడి పడి ఉంటుంది, దానిని గర్భధారణ మధుమేహం (gestational diabetes) అని పిలుస్తారు.
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
ఇది సాధారణంగా గర్భధారణ సమయంలో ఒక మామూలు లక్షణం. అయితే, ఏదైన నొప్పి, రక్తస్రావం లేదా మూత్రం రంగులో మార్పు ఉంటే, వైద్యులకు తెలియచేయడం ఉత్తమం.
- అవసరమైతే, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష మరియు ఇతర పరీక్షలు సూచించబడవచ్చు.
- వికారం కూడా ఉన్నట్లయితే , గర్భధారణ మధుమేహ (gestational diabetes) తనిఖీ కోసం పరీక్షలు నిర్వహించాలి.
ఇది ఒక సాధారణ విషయం కాబట్టి, తరచూ మూత్రవిసర్జన భావనతో పాటుగా ఇతర లక్షణాలు ఏవి లేనప్పుడు చికిత్స అవసరం లేదు.
- సంక్రమణ (ఇన్ఫెక్షన్) ఉంటే, వైద్యులు గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండే (ఉపయోగించదగిన) యాంటీబయాటిక్స్ను సూచిస్తారు.
- తరచుగా మూత్రవిసర్జనను నియంత్రించడానికి, కెఫిన్ ఉండే పానీయాలను నివారించాలి.
- కొన్నిపెల్విక్ వ్యాయామాలు గర్భధారణ సమయంలో మూత్రాశయ కండరాలను నియంత్రించటానికి సహాయపడతాయి.