పాదానికి ఫ్రాక్చర్ అంటే ఏమిటి?
పాదం యొక్క ఫ్రాక్చర్ అనేది సాధారణంగా సంభవించే ఫ్రాక్చర్లలో ఒకటి. పాదములో 26 ఎముకలు ఉంటాయి, ఒక ప్రత్యక్ష దెబ్బ (direct blow) లేదా ప్రమాదాల వలన పాదం విరగడం (ఫ్రాక్చర్ ) జరుగుతుంది. చిన్న తప్పటడుగు వేయడం వలన లేదా పడిపోవడం వల్ల కానీ పాదం ఎముకలు విరిగిపోవడం జరుగుతుంది, సాధారణంగా దీనిని తీవ్రంగా పరిగణించరు. కాలివేళ్ల ఎముకలలో (ఫలాంగెస్ [phalanges]) మరియు అరికాలి ఎముకల (metatarsal) ఫ్రాక్చర్లు (కాలి వేలి ఎముకల మధ్య ఉండే 5 ఎముకలు మరియు పాదంలో వెనుక, మధ్యన ఉండే ఎముకలు ) చాలా సాధారణ పాదం ఫ్రాక్చర్లు. 5వ మెటాటార్సల్ ఎముక అది పాదం చిటికెన వేలుకి అనుసంధానమై ఉంటుంది దానికి తరచుగా ఫ్రాక్చర్ జరుగుతూ ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
విరిగిన పాదం యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:
- నొప్పి
- ఫ్రాక్చర్ ప్రాంతం వద్ద వాపు
- విరిగిన అడుగు కదలికలో సమస్య
ఇతర లక్షణాలు:
- కమలడం మరియు రంగు మారడం అది ఫ్రాక్చర్ చుట్టూ ఉండే భాగాలకు కూడా విస్తరిస్తుంది
- నడుస్తున్నపుడు లేదా భారీ వస్తువులు ఎత్తుతున్నపుడు నొప్పి
- శారీరక శ్రమ చేస్తున్నపుడు నొప్పి తీవ్రతరం అవుతుంది మరియు విశ్రాంతి తీసుకుంటున్నపుడు నొప్పి తగ్గుతుంది
- సున్నితత్వం (తాకితేనే నొప్పి పుడుతుంది)
- పాదం ఆకృతి మారిపోతుంది
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
పాదం ఫ్రాక్చర్ యొక్క సాధారణ కారణాలు:
ప్రత్యక్ష గాయం లేదా గాయం: వేగంగా నడుస్తున్నపుడు పడిపోవడం లేదా జారీ పడిపోవడం, ఎత్తు నుండి దూకుతున్నపుడు కిందకి దిగే సమయంలో బరువంతా పాదాల మీద పడిపోవడం, పాదాలపై భారీ వస్తువు పడిపోవటం, వాహనాల ప్రమాదాల సమయంలో పాదానికి గాయాలు కావడం వంటివి పాదం ఫ్రాక్చర్కు దారి తీస్తాయి.
ఇతర కారణాలు:
- పదేపదే అయిన గాయాలు లేదా మితిమీరిన పాదం ఉపయోగం కారణంగా ఒత్తిడి పగుళ్లు (Stress fracture)
- తప్పటడుగు కారణంగా
- నడుస్తున్నపుడు సామాన్లు/భారీ వస్తువులను పాదం చిటికెన వేలు గుద్దుకోవడం వలన ఏర్పడిన గాయం అలాగే ధృడంగా ఉండిపోవడం వలన
- చీలమండ (ankle) మెలిపడిపోవడం వలన కూడా పాదం ఫ్రాక్చర్కు కారణం కావచ్చు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పాదము ఫ్రాక్చర్ యొక్క నిర్ధారణలో పాదం ఎముకలు మరియు పాదము కీళ్ళు (జాయింట్స్) యొక్క భౌతిక పరిశీలన ఉంటుంది. ఫ్రాక్చర్ ను అంచనా వేయడంలో పాదాన్ని స్పర్శిస్తూ పరిశీలన చేయడం మరియు నరాల పరీక్ష(పాదాల నరాలు మరియు రక్తనాళాల పరీక్ష) చేస్తారు.
పరీక్షలు ఈ విధంగా ఉంటాయి:
- ఎక్స్ -రే
- అల్ట్రాసోనోగ్రఫీ (Ultrasonography)
రోగనిర్ధారణ మరియు చికిత్స ఫ్రాక్చర్ యొక్క ప్రాంతం మరియు దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అందువలన, ఫ్రాక్చర్ తగ్గడానికి (మానడానికి) నాలుగు వారాల నుండి 10 లేదా12 వారాల సమయం పడుతుంది.
పరిమిత శారీరక శ్రమతో పాటు స్ప్లింట్స్ (బద్ద కట్టులు) మరియు కాస్ట్ లు చాలా సందర్భాలలో విరిగిన ఎముకను నయం చేయడానికి సహాయపడతాయి.
ఒత్తిడి మరియు నొప్పి నుండి ఉపశమనం కలిగించేందుకు విరిగిన కాలి చిటికెన వేలుని దాని పక్క వేలుకి అంటిచపడుతుంది (కట్టబడుతుంది).
విరిగిన భాగం వైకల్యంతో దాని స్థానం నుండి మారిపోతే, వైద్యులు మత్తు ఇచ్చి సరిలేని ఎముకను మళ్ళి సరిచేస్తారు. ఎముక చర్మం పైకి వచ్చేస్తే , ఓపెన్ ఫ్రాక్చర్ ఐతే, శస్త్రచికిత్సతో దాన్ని సరిచేస్తారు.
బేస్ మరియు ఎముక యొక్క షాఫ్ట్(shaft) మధ్యన ఐదవ మెటాటార్సల్(metatarsal ఎముక కి ఫ్రాక్చర్ సంభవిస్తే దానిని జోన్స్ ఫ్రాక్చర్ (Jones fracture) అని పిలుస్తారు. ఇది చాలా నెమ్మదిగా నయమయ్యే మరియు శస్త్రచికిత్స అవసరం కూడా ఉండే ఒక తీవ్రమైన ఫ్రాక్చర్.
స్వీయ సంరక్షణ:
- ప్రభావిత పాదాన్ని పైకి ఎత్తి ఉంచాలి.
- నొప్పిని తగ్గించడానికి చన్నీటి కాపడాన్ని ఉపయోగించాలి.
- బరువులు మోయడాన్ని తగ్గించాలి.