మోచేయి ఫ్రాక్చర్ అంటే ఏమిటి?

మోచేయి ఫ్రాక్చర్ అనేది పై చేయి ముందు చేతిని (ముంజేతిని) కలిపే ఉమ్మడి (జాయింట్) లో పగులుని సూచిస్తుంది. మోచేయి ఉమ్మడి మూడు ఎముకలు, అవి, భుజాలం, వ్యాసార్థం మరియు ఉల్నాలతో చేయబడుతుంది. సాధారణంగా, ఈ పగులు మోచేతికి నేరుగా దెబ్బ లేదా పై చేయికి గాయం ఉన్నప్పుడు ఏర్పడుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అత్యంత సాధారణ లక్షణాలు:

  • జాయింట్ (ఉమ్మడి) వద్ద ఆకస్మిక తీవ్ర నొప్పి
  • మోచేయి ఉమ్మడి కదిలించడం చాలా కష్టం అవుతుంది
  • మోచేతి బిగుసుకుపోతుంది

ఇతర సంకేతాలు మరియు లక్షణాలు:

  • మోచేయి మీద పగులు (ఫ్రాక్చర్ ) ఉన్న ప్రాంతం వద్ద వాపు
  • మోచేయి చుట్టూ కమిలిన గాయం  ఉంటుంది, ఇది మణికట్టు వైపుకు  లేదా భుజాల వైపుకు వ్యాపిస్తుంది
  • సున్నితత్వం (తాకితేనే నొప్పి పుట్టడం)
  • ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్లలో, మణికట్టు లేదా భుజం మీద తిమ్మిరి
  • మోచేయి లేదా చేతి కదలికలలో నొప్పి
  • ఒక మోచేయి దాని స్థానం మారిపోయిన భావన కలుగుతుంది

దీని  ప్రధాన కారణాలు ఏమిటి?

మోచేయి ఫ్రాక్చర్స్ యొక్క సాధారణ కారణాలు:

  • ఆకస్మిక గాయాలు (ట్రామా): చాపి ఉంచిన చేతి మీద నేరుగా పడిపోవడం, ప్రమాదాలు లేదా క్రీడా గాయాలు
  • మోచేయి ఉమ్మడి (జాయింట్) మీద నేరుగా దెబ్బ తగలడం లేదా చేయి మెలితిరగడం వలన కానీ గాయం సంభవించవచ్చు

ఇతర కారణాలు:

ఈ ఫ్రాక్చర్లు బోలు ఎముకల వ్యాధి లేదా క్యాన్సర్ వంటి కొన్ని సమస్యలతో కూడా ముడిపడి ఉంటాయి, ఈ వ్యాధులు ఉన్నపుడు చిన్న గాయం ఒక ఫ్రాక్చర్ (విరగడానికి) దారితీసేంత నష్టం కలిగిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మోచేయి ఫ్రాక్చర్ యొక్క నిర్ధారణ కోసం శారీరక పరీక్ష తప్పనిసరి.

ఫ్రాక్చర్ను అంచనా వేయడానికి  ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకోవడం కూడా సహాయపడుతుంది.

ఇమేజింగ్ పరీక్షలు:

  • ఎక్స్-రే  
  • సిటి (CT) స్కాన్లు

ఎముక ఫ్రాక్చర్ల చికిత్సలలో విరిగిన ఎముకలను సరిచేయడం, వాటిని నయం అయ్యేలా చూడడం వంటివే ఉంటాయి. ఎముకల కదలికను పరిమితం చేయడానికి మరియు కదలికల వలన కలిగే అసౌకర్యం మరియు నొప్పిని నిరోధించడానికి స్లింగ్ (sling), కాస్ట్ (cast) లేదా బద్ద కట్లు (splint) వంటివాటిని ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా ఎముక యొక్క  వైద్యంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నొప్పి తగ్గించడానికి అనాల్జెసిక్స్ (Analgesics) సహాయం చేస్తాయి.

ఫ్రాక్చర్ పునరుద్ధరణలో బిగుతుదనాన్ని తగ్గించేందుకు, మర్దన మరియు చన్నీటి కాపడం వంటి భౌతిక చికిత్స (physical therapy) ఉంటుంది.

ఎముక ముక్కలు తీవ్రంగా  దెబ్బతిన్న సందర్భాలలో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

Medicines listed below are available for మోచేయి ఫ్రాక్చర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Kairali Murivenna Oil200 ml Oil in 1 Bottle239.0
Setfrac Capsule10 Capsule in 1 Strip176.0
Read more...
Read on app