రొమ్ముఎముక విరగడం (బ్రేస్ట్ బోన్ ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
రొమ్ముఎముక విరగడం (బ్రేస్ట్ బోన్ ఫ్రాక్చర్) అనేది రొమ్ము ఎముకలోని పగులుని సూచిస్తుంది, రొమ్ము ఎముక ఛాతీ మధ్యలో చదరంగా (ఫ్లాట్) ఉండే, పొడవైన ఎముక. సాధారణంగా ఛాతీ ముందువైపు నేరుగా, అనుకోని గాయం సంభవించినప్పుడు రొమ్ముఎముక విరగడం జరుగుతుంది. ఈ రొమ్ముఎముకను స్టర్నం (sternum) అని పిలుస్తారు, అందువలన ఈ ఫ్రాక్చర్లను కూడా స్టెర్నల్ ఫ్రాక్చర్స్ అని కూడా పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సంకేతాలు మరియు లక్షణాలు:
- సాధారణ శ్వాసను తీసుకున్నపుడు నొప్పి, అది ఘాడ శ్వాస, దగ్గు లేదా నవ్వుతునప్పుడు అధికమవుతుంది
- చేతులు కదిలించేటప్పుడు మరియు భారీ వస్తువులను పైకి లేపుతున్నపుడు అసౌకర్యం
- ఫ్రాక్చర్ ప్రదేశంలో వాపు
- క్రెపిటస్ (Crepitus, విరిగిన ఎముకల ముక్కలు రెండూ రాసుకున్నపుడు వచ్చే అసాధారణ ధ్వని)
- ఫ్రాక్చర్ ఉన్న స్థానాన్ని తాకినప్పుడు చిన్న వైకల్యం (deformity) ఉన్నట్లు అనిపిస్తుంది
- తీవ్రమైన సందర్భాలలో గుండె మరియు ఊపిరితిత్తులకు కూడా గాయాలు కావచ్చు
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
రొమ్ముఎముక విరగడానికి (బ్రేస్ట్ బోన్ ఫ్రాక్చర్) అత్యంత సాధారణ కారణాలు:
- ఛాతికి ముందు వైపు, ఆకస్మిక గాయం కావడం
- రగ్బీ, ఫుట్బాల్ వంటి అధిక ప్రభావం గల క్రీడల లేదా కారు ప్రమాదం వంటి డిసెలేరేషన్ గాయాలు (Deceleration injuries)
మధ్యస్థ కారణాలు:
- అథ్లెటిక్ గాయాలు
- పడిపోవడం
- దాడి జరుగుట
- గుండె పుననిర్మాణం (Cardiopulmonary resuscitation)
అసాధారణ కారణాలు:
- తీవ్రమైన రొమ్ము సంబంధి గూని (severe thoracic kyphosis), బోలు ఎముకల వ్యాధి (osteoporosis) లేదా ఆస్టెయోపెనియా (osteopenia) వంటి సమస్యల వలన కూడా సంభవించవచ్చు
- ఋతుచక్రాలు ఆగిపోయిన స్త్రీలు మరియు వృద్ధులకు రొమ్ముఎముక ఫ్రాక్చర్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
- గోల్ఫ్ మరియు వెయిట్ లిఫ్టింగ్ (weightlifting) వంటి క్రీడల్లో అనేకసార్లు పై శరీరంతో పనిచేసినప్పుడు ఒత్తిడి పగుళ్లు (Stress fractures) సంభవించవచ్చు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
భౌతిక పరీక్షలో, వైదులు విరిగిన ప్రదేశాన్ని తాకుతూ (స్పర్శిస్తూ) అంచనా వేస్తారు.
రొమ్ముఎముక ఫ్రాక్చర్ల నిర్ధారణలో లాటరల్ ఛాతీ ఎక్స్-రే (lateral chest X-ray) చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అవసరమైన ఇతర పరీక్షలు:
- సిటి (CT) స్కాన్
- ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (Electrocardiogram)
- అల్ట్రాసోనోగ్రఫీ (Ultrasonography)
- రోగి అత్యవసర సంరక్షణలో ఉన్నప్పుడు కార్డియాక్ పర్యవేక్షణ (Cardiac monitoring) మరియు పల్స్ ఆక్సిమెట్రీ (pulse oximetry) తప్పనిసరిగా ఉండాలి
తీవ్రమైన రొమ్ముఎముక ఫ్రాక్చర్లు ముందుగా శ్వాసను అందించడం మరియు ప్రసరణను (circulation) నిర్వహించడం వంటివి చెయ్యడం ద్వారా నిర్వహించబడతాయి.
ముఖ్యమైన సంకేతాలు అంచనా వేసి మరియు వాటిని నిర్వహించాలి.
ఏదైనా ప్రాణాంతకమైన సమస్య ఉన్నపుడు తక్షణ శ్రద్ధ మరియు సంరక్షణ అందించాలి.
పగుళ్లకు సంబంధించిన నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు అనాల్జెసిక్స్ ఇవ్వబడతాయి.
సమస్యలను నివారించడానికి వైద్యులు ఘాడ శ్వాసను తీసుకోమని సలహా ఇస్తారు.
ఫ్రాక్చర్ ను సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరం.