ఫుడ్ పోయిజనింగ్ (ఆహారం విషతుయమవ్వడం) అంటే ఏమిటి?
కలుషితమైన ఆహారం తినడం లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల ఫుడ్ పోయిజనింగ్ (ఆహారం విషతుయమవ్వడం) ఏర్పడుతుంది. సూక్ష్మజీవులు, చిన్న కీటకాలు, లేదా అటువంటి వ్యాధికారకాల క్రిముల ద్వారా ఆహారం కలుషితమవుతుంది.
ఇది శరీరంలోని వివిధ వ్యవస్థలను (భాగాలను) ప్రభావితం చేస్తుంది, కానీ జీర్ణశయా వ్యవస్థ ఎక్కువగా ప్రభావితమవుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఫుడ్ పోయిజనింగ్ యొక్క సాధారణ లక్షణాలు-
- వికారం
- వాంతులు
- జ్వరం
- అతిసారం
- పొత్తి కడుపు నొప్పి
- ఆకలి తగ్గుదల
- అదనంగా, వ్యక్తి చలి, మైకము, మరియు అధిక చెమటలను వంటివి కూడా అనుభవిస్తాడు.
- ఈ సమస్య కలిగించే కారకం పై ఆధారపడి, కలుషిత ఆహరం లేదా నీరు తీసుకున్న తర్వాత లక్షణాలు వెంటనే లేదా కొన్ని రోజులు తర్వాత కనిపిస్తాయి.
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
- ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, లేదా పరాన్నజీవులు (parasite) ఆహారాన్ని లేదా నీటిని కలుషితం చేయగలవు మరియు అలాంటి కలుషితమైన ఆహారం లేదా నీరుని తీసుకోవడం వల్ల ఫుడ్ పోయిజనింగ్ ఏర్పడుతుంది.
- వంట సరిగ్గా చెయ్యనప్పుడు, ప్రాసెసింగ్, లేదా ప్యాకేజింగ్ లో లోపాల కారణంగా ఆహారాన్ని బ్యాక్టీరియా, వైరస్, లేదా పరాన్నజీవులు కలుషితం చేస్తాయి.
- ఫుడ్ పోయిజనింగ్ కు మరియు జీర్ణాశయ అసౌకర్యానికి కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా సాల్మోనెల్లా టైఫి (Salmonella typhi), విబ్రియో కలరా (Vibrio cholera), క్లోస్ట్రిడియం డిఫెసిల్ (Clostridium difficile), స్టాఫైలోకోకస్ ఆరియస్ (Staphylococcus aureus) మరియు క్యాంఫైలోబెక్టర్ (campylobacter).
- రోటవైరస్ (Rotavirus) మరియు హెపటైటిస్ ఎ (hepatitis A) వైరస్లు కూడా ఆహారాన్ని కలుషితం చేయగలవు.
- కలుషితమైన నీరు ఫుడ్ పోయిజనింగ్ కి అతి ముఖ్య కారణాల్లో ఒకటి. శుద్ధమైన నీటితో మురికి నీరు కలవడం వలన కానీ, నీరుని సరిగ్గా శుద్ధీ చెయ్యనప్పుడు కానీ ఇది జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నిర్ధారణ ఈ క్రింది విధంగా ఉంటుంది:
- ఫుడ్ పోయిజనింగ్ యొక్క రోగ నిర్ధారణ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది మరియు రోగి ఇటీవలే తిన్న ఆహార పదార్దాల గురించి వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది.
- ఫుడ్ పోయిజనింగ్ కలిగించిన వ్యాధికారక క్రిమిని తెలుసుకోవటానికి, మల సాగు (stool culture) వంటి పరిశోధనలు జరుగుతాయి.
- రక్త పరీక్షలు కూడా సంక్రమణ యొక్క సంకేతాలను ఇస్తాయి, సంక్రమణ (ఇన్ఫెక్షన్) ఉంటే కనుక తెల్ల రక్త కణాలు (WBC లు) అధిక సంఖ్య కనిపిస్తాయి. హెపటైటిస్ వైరస్ల కోసం ప్రత్యేక రక్త పరీక్షలను కూడా ఆదేశించవచ్చు.
ఫుడ్ పోయిజనింగ్ యొక్క చికిత్స ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
- ఫుడ్ పోయిజనింగ్ యొక్క చికిత్సలో లక్షణాలను తగ్గించడం మరియు కారణాన్ని తొలగించడం అనేవి ఉంటాయి.
- శరీరం నుండి ప్రత్యేక వ్యాధికారక క్రిమిని తొలగించడానికి యాంటీబయాటిక్స్ సూచించబడతాయి. వ్యాధికారక క్రిమిని బట్టి, ఒక నిర్దిష్ట యాంటిబయోటిక్ సూచించబడుతుంది. సూక్ష్మజీవులు శరీరం నుండి పూర్తిగా తొలగిపోవడానికి, మొత్తం యాంటీబయాటిక్ కోర్సును పూర్తి చేయడం ముఖ్యం.
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణాన్ని) కోసం ద్రవ ప్రత్యామ్న్యాయ చికిత్స (fluid replacement therapy) మరియు ఎలెక్ట్రోలైట్ల ద్వారా చికిత్స చేస్తారు. నీరు, నిమ్మరసం, తాజా రసాలు, కొబ్బరి నీరు లేదా మజ్జిగ పుష్కలంగా తాగడం ద్వారా ఓరల్ (నోటి ద్వారా) రీహైడ్రేషన్ చెయ్యడం చాలా ముఖ్యం.