ఫోలిక్యులర్ లింఫోమా అంటే ఏమిటి?
ఫోలిక్యులర్ లింఫోమా అనేది హాగ్కిన్ కాని (non-Hodgkin) లింఫోమా రకం, ఇది లింఫాటిక్ సిస్టమ్ (శోషరస వ్యవస్థ) ను ప్రభావితం చేస్తుంది. ఇది నెమ్మదిగా పురోగమించే సమస్య, ఇది ముందుగా గుర్తించబడనిది ఉండవచ్చు మరియు ప్రభావిత వ్యక్తులు సంవత్సరాల పాటు ఏవిధమైన లక్షణాలు లేకుండా ఉండవచ్చు. ఈ వ్యాధిగా ఎక్కువగా తెరగబెడుతూ ఉంటుంది. 60 సంవత్సరాల వయసు పైబడిన దీనిని సాధారణంగా గమనించవచ్చు. పురుషులలో దీని సంభవనం 2.9 / 100,000 గా ఉండగా, మహిళలలో దీని సంభవం 1.5 / 100,000 గా ఉంది. పశ్చిమాన ఉన్న ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పరిస్థితి తక్కువగా ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇది నెమ్మదిగా వృద్ధి చెందే వ్యాధి, కాబట్టి లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. అత్యంత సాధారణ లక్షణం మెడ చుట్టూ,చంకలలో, మరియు గజ్జల ప్రాంతంలో గడ్డలు కనిపిస్తుంది. ఇతర లక్షణాలు:
- బరువు తగ్గుదల
- ఆహారం తీసుకోవడం తగ్గిపోవడం
- శరీర ఉష్ణోగ్రత పెరగడం
- సంక్రమణలకు సున్నితత్వం (త్వరగా ఇన్ఫెక్షన్లకు గురికావడం)
- రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం
- అధిక శ్రమ లేపోయిన చాలా అలసటగా అనిపించడం (మరింత సమాచారం: అలసట కారణాలు)
సమస్యలు వీటిని కలిగి ఉండవచ్చు:
- హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోవడం
- ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం (Decreased platelet count)
- న్యూట్రోఫిల్ సంఖ్య తగ్గిపోవడం (Reduced neutrophil count)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఫోలిక్యులర్ లింఫోమా కు ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియలేదు. ఇది అంటురోగము కాదు మరియు లింఫోమాను ప్రేరేపించే ఏవిధమైన హానికరమైన ఏజెంట్లకు ఐన గురైనప్పుడు ఇది ప్రధానంగా సంభవిస్తుంది. ఇది జన్యుపరంగా సంక్రమించడు, రేడియో ధార్మికత (radiation), విషపదార్ధాలు (toxins) ఇతర ప్రేరేపకాల వలన సంక్రమిస్తుంది. ఈ సమస్య వృద్ధికి ధూమపానం, అధిక మద్యపానం మరియు అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) వంటి జీవనశైలి మార్పు కారకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఫోలిక్యులర్ లింఫోమా భౌతిక పరీక్ష మరియు లక్షణాల ద్వారా నిర్ధారించబడుతుంది. ఏదైనా అంతర్గత కారణ తనిఖీ కోసం రక్త పరీక్ష ఆదేశించబడవచ్చు. ఇతర నిర్దారణ పరీక్షల్లో ఇవి ఉంటాయి:
- ఎముక మజ్జ అంచనా (Bone marrow assessment)
- సిటి (CT) స్కాన్
- పెట్ (PET) స్కాన్
లక్షణాలు మెల్లగా ఉన్నందున పరిస్థితి పురోగతిని అంచనా వేయడానికి వైద్యుడు వేచి ఉండవచ్చు. సమస్య తీవ్రతను తెలుసుకున్న తర్వాత, ఈ క్రింది చికిత్సలను అనుసరించవచ్చు:
- కెమోథెరపీ ఎజెంట్ల కలయిక
- లక్ష్య చికిత్స (Targeted therapy)
- నిర్వహణ చికిత్స (Maintenance therapy)
- రేడియేషన్
- స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (Stem cell transplantation)
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- సత్వర లక్షణ నిర్వహణ అనేది సమర్థవంతమైన చికిత్సకు కీలకమైనది.
- జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ (మద్యపానాన్ని) నివారించాలి, ఇది లక్షణాల తీవ్రతను తగ్గించగలదు
ఫోలిక్యులర్ లింఫోమా అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందే ఒక రకమైన క్యాన్సర్ రూపం, కాబట్టి లక్షణాలు సంభవించినప్పుడు వెంటనే పర్యవేక్షించబడాలి.