వేలుకి గాయం - Finger injury in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

వేలుకి గాయం
వేలుకి గాయం

వేలుకి గాయం ఏమిటి?

వేలుకి గాయం అనేది పేరు సూచిస్తున్నట్లుగా, వేలు యొక్క ఆకృతి మరియు పనితీరు దెబ్బతింటుంది / మారిపోతుంది. వివిధ కారణాల వేలుకి వల్ల గాయాలు ఏర్పడవచ్చు వేలుకి గాయం వాటిన్నంటినీ సూచించే ఒక సమగ్ర పదం. గాయం దీర్ఘకాలికంగా ఉండే ఆర్థరైటిస్ వంటిది కావచ్చు లేదా వేలు విరగడం వంటి తీవ్రమైనది కావచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వేలు గాయం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • నొప్పి
  • వాపు
  • ఎర్రదనం
  • వేళ్లను తిన్నగా పెట్టలేకపోవడం లేదా వంచలేకపోవడం
  • రక్తస్రావం
  • వేలుకి కమిలిన గాయం
  • కోసుకోవడం మరియు పుండ్లు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

వేలు గాయాల యొక్క కొన్ని సాధారణ కారణాలు:

  • ఫ్రాక్చర్స్  (పగుళ్లు)
  • వేలు ఎముకలకు దెబ్బలు తగలడం
  • ఉంగరాల కారణంగా గాయాలు
  • ఆర్థరైటిస్
  • వేళ్లు బెణకడం
  • గేమ్ కీపర్స్ థంబ్ (బొటనవేలితో ఉల్నర్ కొల్లేటరల్ లిగమెంట్ [UCL] చీలిపోవడం వలన ఏర్పడుతుంది) లో లాగా బొటనవేలుకి బెణుకు లేదా గాయం కావడం
  • వేలి అంగచ్ఛేదాలు (amputations)
  • ట్రిగ్గర్ ఫింగర్ (Trigger finger), వేలి యొక్క కండరాలు ఆకస్మికంగా బెణకడం వలన నొప్పి కలిగే ఒక పరిస్థితి

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒకవేళ పైన పేర్కొన్న సంకేతాలు మరియు లక్షణాలను గమనించినట్లయితే, మరియు లక్షణాలు మరింత అధ్వాన్నంగా మారుతుంటే, వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

వైద్యులు పుండుని లేదా వేలు పైన లేదా బొటనవేలు మీద ఉన్న గాయాన్ని పరిశీలిస్తారు మరియు కారణం, తీవ్రత, లక్షణాలు, ఆరోగ్య చరిత్ర మరియు వ్యక్తిగత వివరాల గురించి సంబంధిత ప్రశ్నలను అడుగుతారు. అతను / ఆమె అప్పుడు గాయం కారణానికి చికిత్స కోసం  కొన్ని మందులను మరియు నొప్పి నివరుణులను సూచించవచ్చు.

ఫ్రాక్చర్ (విరగడం) ను, నరము చీలికను లేదా గాయం యొక్క పరిస్థితిని నిర్థారించడానికి ఎక్స్- రే అవసరరం కావచ్చు. రక్త పరీక్షలు మరియు సిటి/ ఎంఆర్ఐ (CT / MRI) స్కాన్లు అరుదుగా అవసరం కావచ్చు.

వేలు గాయాలు చికిత్స కోసం కొన్ని సమర్థవంతమైన మరియు సులభమైన ఇంటి చిట్కాలు  ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • చల్లని  నీటిని ఉపయోగించి ప్రభావవంతమైన ప్రథమ చికిత్స.
  • గాయం  ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ ను పెట్టి చేసే ఐస్ థెరపీ, ఇది గాయపడిన వేళ్ళ నొప్పి మరియు వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే, వేళ్ల పై నేరుగా  ఐసు గడ్డలని పెట్టరాదు. దానికి బదులుగా, ఒక వస్త్రంలో (చిన్న గుడ్డలో) ఐసు గడ్డను ఉంచి దానిని వేలిపై పెట్టాలి.
  • కంప్రెషన్ థెరపీ (Compression therapy), దీనిలో గాయపడిన వేలును బ్యాండేజ్ తో గట్టిగా కట్టాలి. ఇది నొప్పిని అలాగే వాపుని కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
  • ఇతర వేళ్లు ద్వారా గాయపడిన వేలుకి రక్త ప్రసరణ సమృద్ధిగా అందించడానికి  వేలుని పైకి పెట్టడానికి ప్రయత్నించాలి.
  • బద్ద కట్టు (splinting) ద్వారా వేళ్ళ కదలికలను నియంత్రించడం వలన వాపు మరియు నొప్పి తగ్గించవచ్చు.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Finger Injuries and Disorders
  2. Cheung K, Hatchell A, Thoma A. Approach to traumatic hand injuries for primary care physicians. Can Fam Physician. 2013 Jun;59(6):614-8. PMID: 23766041
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Finger pain
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Wounds and Injuries
  5. Leggit JC, Meko CJ. Acute finger injuries: part I. Tendons and ligaments. Am Fam Physician. 2006 Mar 1;73(5):810-6. PMID: 16529088