ముఖ పక్షవాతం అంటే ఏమిటి?
ముఖ పక్షవాతం అనేది ముఖ నరములకు నష్టం/ హాని కలిగే ఒక రకమైన ఆరోగ్య సమస్య, తద్వారా రోగిని ముఖ కదలికలను వ్యక్తం చెయ్యడం, తినడం లేదా మాట్లాడడం వంటివి చేయలేడు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముఖ పక్షవాతం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు;
- కనురెప్పలను మూసివేయడం లేదా రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు
- ముఖం కదిలించడంలో అసమర్థత
- నోరు వాలిపోవడం
- ముఖ ఆకృతులను సమతుల్యం (balance) చెయ్యడంలో అసమర్థత
- ముఖ పక్షవాతంలో, వ్యక్తి కనుబొమ్మలను ఎగరవేయలేడు
- మాట్లాడటం మరియు తినడం లో ఇబ్బంది
- సమగ్ర ముఖ కదలికలలో కష్టము
ముఖం ఉపయోగించి చేసే ప్రాథమిక విధులలో అసమర్థత కారణంగా, ఇది సాధారణంగా రోగిని వేరుచేస్తుంది (ఒక్కడిగా చేస్తుంది). అందువల్ల, ప్రభావవంతమైన ఫలితాల కోసం చికిత్సను వెంటనే మొదలుపెట్టడం చాలా ముఖ్యం.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ముఖ పక్షవాతం అకస్మాత్తుగా సంభవించవచ్చు లేదా క్రమంగా సంభవించవచ్చు. ముఖ పక్షవాతం యొక్క కొన్ని సాధారణ కారణాలు:
- ముఖ నరాలలో ఇన్ఫెక్షన్ లేదా వాపు
- తలలో కణితి
- మెడలో కణితి
- స్ట్రోక్
- ట్రామా (అఘాతం) లేదా ఒత్తిడి
- బెల్స్ పల్సి (US లో ఈ రకం ముఖ పక్షవాతం అత్యంత సాధారణ)
ఇది ఇతర కారణాలవల్ల కూడా సంభవించవచ్చు;
- ముఖానికి గాయం కావడం
- లైమ్ వ్యాధి (పేలు ద్వారా మానవులకు వ్యాప్తి చెందే ఒక బ్యాక్టీరియా వ్యాధి) యొక్క సంక్రమణ
- వైరస్ యొక్క సంక్రమణ
- వాస్కులైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
- సరిగ్గా నిర్వహించని దంత చికిత్సా విధానాల వలన కొన్ని ముఖ నరాలకు నష్టం కలగడం
- అరుదైన సందర్భాలలో, శిశువులు పుట్టుకతోనే ముఖ పక్షవాతంతో ప్రభావితం అవుతారు (ఇది తరువాత తగ్గిపోతుంది)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
పైన చెప్పబడిన సంకేతాలు మరియు లక్షణాలను వ్యక్తి అనుభవించడం జరిగితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. ముఖంలో తిమ్మిరి మరియు బలహీనత ఉంటే అవి ముఖ పక్షవాతం యొక్క ముఖ్యమైన ప్రారంభదశ లక్షణాలుగా పరిగణించవచ్చు.
వైద్యులు రోగి ముఖాన్ని రెండు వైపులా పరిశీలిస్తారు. రోగి ఇటీవలి ఆరోగ్య సమస్యలు మరియు గాయాలు గురించి అడిగి తెలుసుకుంటారు. అప్పుడు వారు ఏమైనా ముఖ్యమైన పరీక్షలు మరియు రోగనిర్దారణ పరీక్షలు జరపవలసి ఉంటుందా అని నిర్ణయించి రోగికి తెలియజేస్తారు. వాటిలో ఇవి ఉంటాయి:
- రక్త పరీక్షలు (రక్తంలోని చక్కెర స్థాయిలను పరిశీలించడానికి)
- లైమ్ పరీక్ష
- నరాల మరియు కండరాల పరిస్థితి యొక్క అధ్యయనం కోసం ఎలెక్ట్రోమయోగ్రఫీ (EMG)
- తల యొక్క సిటి (CT) స్కాన్ / ఎంఆర్ఐ (MRI)
ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ తర్వాత వైద్యుడు, వివిధ ప్రమాణాల (రోగి వయస్సు, కారణం, మరియు వ్యాధి తీవ్రత వంటివి) ను పరిగణనలోకి తీసుకోని రోగికి సరిపోయే చికిత్సా పద్ధతులను ఎంపిక చేస్తారు, అవి ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
- భౌతిక/ వాక్ చికిత్స (Physical/ speech therapy)
- ముఖ కండరాల శిక్షణా చికిత్స (Facial muscle training therapy)
- ముఖ కండరాల నియంత్రణ మెరుగుపరచడానికి బయోఫీడ్ బ్యాక్ శిక్షణ (Biofeedback training)
- ముఖానికి భౌతికమైన హాని కలిగినప్పుడు మరియు కళ్ళు మూయడంలో సమస్యలు ఉన్నపుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు
- అధిక రక్తపోటు వంటి అంతర్లీన కారణాలకు ప్రత్యేకమైన మందులు అవసరం కావచ్చు.