కంటి సంక్రమణలు/అంటువ్యాధులు/ఇన్ఫెక్షన్లు అంటే ఏమిటి?
కంటి సంక్రమణలు/అంటువ్యాధులు చాలా సాధారణం మరియు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. బాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ అన్ని కూడా కంటి సంక్రమణలు/అంటువ్యాధులను కలిగించగలవు ఫలితంగా ఎర్రదనం, వాపు, దురద, కంటి నుండి స్రావాలు మరియు కళ్ళ నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. అధికంగా సంభవించే కంటి అంటురోగాలలో ఒకటి కండ్లకలక, ఇది సాధారణంగా వైరల్ సంక్రమణ వలన కలుగుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ కంటి సంక్రమణలు/అంటురోగాలతో ముడిపడి ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు:
- కండ్లకలక మరియు బ్లేఫరైటిస్:
- ఉబ్బిన కళ్ళు.
- నొప్పి.
- వాపు.
- కళ్ళు నుండి నీరు కారడం.
- బాక్టీరియల్ కెరటైటిస్:
- నొప్పి.
- ఎర్రదనం
- స్రావాలు కారడం.
- ఫోటోఫోబియా (కాంతిభీతి)
- కన్నీళ్లు కారడం
- తగ్గిన లేదా అస్పష్టమైన చూపు
- కార్నియల్ అల్సర్.
- హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కెరటైటిస్:
- నొప్పి.
- తగ్గిన లేదా అస్పష్టమైన చూపు.
- కన్నీళ్లు కారడం.
- స్రావాలు కారడం.
- పుండు.
- దురద.
- కాంతిభీతి (ఫోటోఫోబియా).
- ఎండోప్తాల్మిటిస్ (Endophthalmitis):
- నొప్పి.
- చూపు మందగించడం
- ఎర్రదనం
-
కంటి కురుపు (stye):
- నొప్పి.
- చీముతో నిండిన ఒక గడ్డ
- కళ్ళు ఎరుపు రంగులో కనిపిస్తాయి మరియు నీటితో నిండి ఉంటాయి.
వీటి ప్రధాన కారణాలు ఏమిటి?
కంటి సంక్రమణలు/అంటురోగాలకు కారణాలు ఒకొక్క సంక్రమణకు భిన్నంగా ఉంటాయి మరియు వీటిని కలిగి ఉండవచ్చు:
- కండ్లకలక: తరచుగా ఇది కండ్లకలకతో బాధపడుతున్న వ్యక్తిని ప్రత్యక్ష చూడడం లేదా తాకడం ద్వారా సంక్రమిస్తుంది.
- బాక్టీరియల్ కెరటైటిస్ (Bacterial keratitis): ఇది తరచూ కాంటాక్ట్ లెన్స్ ధరించడం వలన లేదా గాయం ఫలితంగా సంభవిస్తుంది.
- హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కెరటైటిస్ (Herpes simplex virus keratitis): ఇది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వస్తుంది.
- ఎండోప్తాల్మైటిస్ (Endophthalmitis): దీనిలో సూక్ష్మజీవ సంక్రమణ వలన వాపు. ఇది తరచూ కంటి శస్త్రచికిత్స, గాయం, మరియు ఇంట్రావిట్రియల్ (కంటి లోపల) ఇంజెక్షన్స్ (సూది మందులు) చేసిన తర్వాత సంభవిస్తుంది.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స?
ఆరోగ్య చరిత్ర మరియు సూక్ష్మ శారీరక పరీక్ష ఆధారంగా కంటి సంక్రమణలు/అంటువ్యాధులు నిర్ధారణ అవుతాయి.
ఒక స్లిట్ లాంప్ మైక్రోస్కోప్ ను ఉపయోగించి కంటి వైద్యులు కళ్ళను పరిశీలించవచ్చు.
పరిశోధనలు వీటిని కలిగి ఉంటాయి:
- సూక్షమజీవుల పరిశీలన కోసం కార్నియా లేదా కంజుంటివా నుండి స్క్రాప్లింగ్స్ తీసి సాగుచేయడం .
- కింది కంజుక్టివల్ సంచి (lower conjunctival sac) లేదా కనురెప్ప స్రావాలు యొక్క సాగు.
- కార్నియా యొక్క జీవాణుపరీక్ష (Biopsy).
చికిత్స సంక్రమణ రకం, లక్షణాలు మరియు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కనిపించే కంటి సమస్యల యొక్క కొన్ని చికిత్సలు క్రింది విధంగా ఉంటాయి:
- వైరస్ వలన కండ్లకలక సంభవిస్తే వైద్యులు యాంటీవైరల్ డ్రాప్స్ లేదా జెల్ల్స్ను సూచించవచ్చు. బాక్టీరియా వలన కండ్లకలక సంభవిస్తే దాని కోసం ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్ ఎజెంట్ అవసరం అవుతుంది.
- క్లోరాంఫినికల్ (Chloramphenicol) అనేది బాక్టీరియల్ కెరాటైటిస్ కోసం అత్యంత సాధారణంగా సూచించబడే మందు.
- హెర్పెస్ సింప్లెక్స్ కెరాటైటిస్ ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీవైరల్ ఎజెంట్ మరియు సమయోచిత స్టెరాయిడ్స్తో చికిత్స పొందుతుంది.
- ఎండోప్తాల్మైటిస్ (Endophthalmitis) ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్స్ తో పాటు ఇంట్రావీనస్ (నరాలలోకి) సూది మందులు మరియు కంటికి చేసే ఇంజెక్షన్లు కూడా అవసరం కావచ్చు.
- కంటికురుపు యొక్క చికిత్స కోసం పారాసెటమాల్ లేదా ఇతర నొప్పి నివారణలు అవసరం అవుతాయి. కొన్ని నిమిషాలు కంటి మీద ఒక వెచ్చని వస్త్రాన్ని పెట్టుకోవడం అనేది వాపును తగ్గిస్తుంది.
కంటి సమస్య పూర్తిగా తగ్గిపోయేంత వరకు కాంటాక్ట్ లెన్స్ ధరించడాన్ని నివారించమని కంటి వైద్యులు సలహా ఇస్తారు.