ఎక్సట్రావసేషన్ అంటే ఏమిటి?
ఇంట్రావీనస్ (నరాలలోకి ఎక్కించిన) మందుల ద్రవాలు పొరపాటున అనుకోకుండా నరములలో నుంచి బయటికి కారిపోయి చుట్టూ ఉండే కణజాలంలోకి వ్యాపించినట్లైతే ఆ పరిస్థితిని ఎక్సట్రావసేషన్ (extravasation) అని అంటారు. వేసికేంట్ మందులు (కణజాలంలో గాయాలు లేదా బొబ్బలకు కారణమయ్యే మందులు) పరిసర కణజాలాన్నిలోకి కారి (లీక్) మరియు దానికి హాని కలిగిస్తాయి, తద్వారా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది, ప్రాథమిక వ్యాధి నిర్వహణను ఆలస్యం ఆలస్యం చేస్తుంది. కణజాల నష్టం ఔషధ గాఢత మరియు లీక్ అయిన ఔషధ పరిమాణం బట్టి ఉంటుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎక్సట్రావసేషన్ సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:
ప్రారంభ లక్షణాలు
- వాపు
- చర్మం ఎర్రబడటం
- నొప్పి
- బొబ్బలు
తర్వాతి లక్షణాలు
- చర్మ క్షీణత
- ప్రభావిత కణజాలంలో పుండు
- దీర్ఘకాలిక నొప్పి
- ప్రభావిత భాగం యొక్క పనితీరులో నష్టం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ క్రింది కారణాల వల్ల ఎక్సట్రావసేషన్ సంభవిస్తుంది:
- ఇంట్రావీనస్ (నరాలలోకి ఎక్కించిన) ద్రవాలాను అజాగ్రత్తగా ఎక్కించడం
- చర్మం లేదా రక్తనాళాలు పెళుసుగా ఉండడం (fragile)
- ఊబకాయం
- సుదీర్ఘకాలం పాటు ఇంట్రావీనస్ ద్రవాలను శరీరంలోకి ఎక్కించడం
- గతంలో చాలాసార్లు నరములకు రంధ్రములు పెట్టడం (venepunctures)
- కండరాల:చర్మ కణజాల ద్రవ్యరాశి (mass) తక్కువగా ఉండడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యక్తి ఏవైనా ఎక్సట్రావసేషన్ సంబంధిత లక్షణాలను చూపిస్తే అప్పుడు దానిని అనుమానించాలి. ఇంట్రావీనస్ థెరపీ పై ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్సట్రావసేషన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు గురించి తెలియజేయాలి. వ్యక్తులు వారు అనుభవించే ఎక్సట్రావసేషన్కు సంభందించి ఏ లక్షణాల గురించైనా వైద్యులకి వెంటనే సమాచారం అందించాలి. వైద్యులు ఎక్సట్రావసేషన్ ను నిర్దారించడానికి ఈ క్రింది తనిఖీలను చేయవచ్చు:
- ఇంట్రావీనస్ క్యాన్యుల (intravenous cannula) నుండి రక్తం తిరిగి రావకపోవడం
- ఇంట్రావీనస్ క్యాన్యుల ద్వారా మందులను సరఫరా చేసేటప్పుడు ఆటంకము
- ఇంట్రావీనస్ ద్రవ ప్రవాహంలో అడ్డంకి
చికిత్స ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది:
- ఇంట్రావీనస్ ద్రవాలను శరీరంలోకి ఎక్కించడం వెంటనే నిలిపివేయడం
- మిగిలిపోయిన ఔషధాన్ని బయటకు తీసేయడం
- నరలోలి ప్రవేశపెట్టిన పరికరం (venous access device) యొక్క తొలగింపు
- ప్రభావిత భాగాన్ని (చెయ్యి లేదా కళ్ళు) పైకి ఎత్తిపెట్టడం
- ప్రభావిత ప్రాంతాన్ని చల్లబరచడం
- కోర్టికోస్టెరాయిడ్స్ యొక్క సమయోచిత పూత (Topical application)
- డీమిత్ల్ సల్ఫోక్సైడ్ (dimethyl sulfoxide) యొక్క సమయోచిత పూత
ఎక్సట్రావసేషన్ చాలా సమయాల్లో జాగ్రత్తగా, ఒకక్రమముగా మరియు సమర్థవంతమైన నిర్వహణ పద్ధతి ద్వారా నిరోధించవచ్చు.