ఈసోఫాజియల్ ఎట్రిషియా మరియు ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా ఏమిటి?
ఇవి నోటి మరియు కడుపును కలిపే గొట్టం, ఈసోఫేగస్ (అన్నవాహిక) యొక్క సమస్యలు. ఈసోఫాజియల్ ఎట్రిషియా (EA) అనేది పుట్టుకతో వచ్చే లోపం, ఇందులో ఈసోఫాజియల్ ట్యూబ్ అభివృద్ధికి అంతరాయం ఏర్పడుతుంది మరియు ఈసోఫేగస్ రెండు భాగాలుగా విభజించబడుతుంది. తరచుగా, నోటికి కలుపబడిన పై గొట్టం మరియు అన్నవాహిక (ఈసోఫేగస్) కు కలుపబడిన ఒక కింద గొట్టంలా విభజించబడుతుంది. ఈ వేరు చేయబడిన రెండు గొట్టాల చివరలు మూసివేయబడి ఉంటాయి వాటి మధ్య సంభందం విభజించబడడం వలన లాలాజలం దాని పైభాగంలో పేరుకుపోతుంది, మరియు కింది భాగంలో లో మూసుకుపోతుంది.
ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా (TF) తరచుగా ఈసోఫాజియల్ ఎట్రిషియా ఉన్న శిశువుల్లో కనిపిస్తుంది. ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా అనేది ఈసోఫేగస్కు శ్వాసనాళిక (ట్రేకియా) కు మధ్య అసాధారణమైన సంబంధము ఉండే ఒకరకమైన లోపము. శ్వాసనాళిక (ట్రేకియా) సాధారణంగా ఎసోఫాగస్ యొక్క దిగువ భాగానికి అనుసంధానించబడి ఉంటుంది, అయితే ఈ కనెక్షన్ (సంబంధము) ఎగువ భాగానికి కానీ లేదా ఈసోఫేగస్ యొక్క రెండు భాగాలకి కానీ ఉండవచ్చు.ఈసోఫాజియల్ ఎట్రిషియా (EA) యొక్క ఉనికి లేకుండా ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా (TF) ఒక్కటే కూడా ఉండవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నవజాత శిశువులలో ఈ లక్షణాలు ఒకరి నుండి మరొకరికి మారుతూ ఉంటాయి, అయినప్పటికీ సాధారణంగా ఈసోఫాజియల్ ఎట్రిషియా (EA) మరియు ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా (TF) లలో కనిపించే సంకేతాలు:
- దగ్గు మరియు చనుబాలిచ్చు ప్రయత్నం చేస్తేటప్పుడు పొలమారడం (choking)
- పాలివ్వడానికి ప్రయత్నించినట్లయితే చర్మం సైనోసిస్ (cyanosis) వలన నీలం రంగులోకి మారుతుంది
- నోటి నుండి లాలాజలం కారడం నియంత్రించబడదు
- బరువు పెరగడంలో అసమర్థత
- వాంతులు
- అసాధారణమైన గుండ్రని పొట్ట
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ సమస్యల యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ నిపుణులు ఈ క్రింది జనన లోపాలు సాధారణంగా ఈసోఫాజియల్ ఎట్రిషియా (EA) మరియు ట్రాకియోసోఫేజియల్ ఫిస్ట్యులా (TF)తో సంబంధం కలిగి ఉంటాయని సూచిస్తున్నారు:
- వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం వంటి గుండె లోపాలు
- పాలిసిస్టిక్ మూత్రపిండాలు వంటి మూత్ర వ్యవస్థ యొక్క సమస్యలు
- ట్రైసోమి 13, 18 లేదా 21 (Trisomy 13, 18 or 21)
- మస్క్యులోస్కెలెటల్ అసాధారణతలు (Musculoskeletal abnormalities)
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
ఛాతీ మరియు ఉదర ఎక్స్-రే కిరణాలు ఈ రెండు లోపాల యొక్క ఖచ్చితమైన నిర్ధారణ కోసం సాధారణంగా ఉపయోగించే పద్ధతులు.
ఈ జనన లోపాలు రెండింటికీ చికిత్స అనేది శస్త్రచికిత్స. బిడ్డకు భవిష్యత్తులో అన్నవాహిక (ఈసోఫేగస్) కు సంబంధ సమస్యలు సంభవిచవచ్చు, ఉదా., గాయపుమచ్చ ఉన్న కణజాలం (scar tissue), దీని కోసం బిడ్డ పెరుగుతున్నప్పుడు రెండవ శస్త్రచికిత్స అవసరమవుతుంది. పిల్లలు ఎదుర్కొనే ఇతర సంబంధిత సమస్యలు వైద్యులు సూచించిన మందులతో నిర్వహించబడతాయి.