అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) - Diarrhoea (Loose Motions) in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

అతిసారం
అతిసారం

సారాంశం

సాధారణంగా లూజు లేదా నీళ్ళ బేదులు అనబడే అతిసార వ్యాధి (డయేరియా) జీర్ణవ్యవస్థ మార్గము యొక్క ఒక రుగ్మత. ఒక వ్యక్తి, అతడు/ఆమె ఒక రోజులో మూడు లేదా అంతకు మించిన సార్లు (లేదా మామూలు కంటే ఎక్కువగా) ద్రవ లేదా నీళ్ళ బేదులు చేస్తే, అతిసార వ్యాధి ఉన్నట్లుగా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరమూ సుమారు 1.7 బిలియన్ల బాల్యపు అతిసార వ్యాధి కేసులు ఉంటున్నాయి. అందువల్ల, బాల్యపు అతిసారవ్యాధి 5 సంవత్సరాల లోపు పిల్లలలో పోషకాహార లోపానికి ఒక అతి ముఖ్యమైన కారణముగా ఉంది. ఇండియాలో, సంవత్సరానికి 300,000 పిల్లల మరణాలకు లెక్కకడుతూ (అదే వయసు గ్రూపు పిల్లల మొత్తం మరణాలలో 13 శాతంగా) అతిసార వ్యాధి మూడవ అతి పెద్ద కారణంగా ఉంది. తీవ్రమైన అతిసారవ్యాధి సామాన్యంగా వైరస్ లు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల కలుగుతోంది. అతిసారవ్యాధిని కలిగించే ఇన్ఫెక్షన్ మామూలుగా కలుషితమైన నీటిని త్రాగడం వల్ల మరియు ఆహారాలను సరిగ్గా చేపట్టకపోవడం వల్ల వ్యాపిస్తుంది. అలా, వ్యక్తిగత పారిశుభ్రత లేమి మరియు వాతావరణ పరిశుభ్రత ఇన్ఫెక్షన్ వ్యాప్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.  అతిసారవ్యాధి యొక్క తీవ్రమైన కేసులు నీరు మరియు ఎలక్ట్రోలైట్ల శీఘ్రనష్టానికి కారణం కావచ్చు తద్వారా నిర్జలత్వానికి దారితీయవచ్చు. కాబట్టి, సకాలములో చికిత్స చేయకపోతే, తీవ్ర అతిసారవ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు.  అతిసార వ్యాధితో హెచ్ఐవి-పాజిటివ్ కలిగిన పిల్లల యొక్క మనుగడ రేటు చాలా తక్కువగా ఉంటుంది మరియు మరణ రేటు అనునది, అతిసార వ్యాధితో హెచ్ఐవి-నెగటివ్ కలిగిన పిల్లల కంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువగా ఉంటుంది.  టీకా చికిత్సలోని నూతన విధానాలు (రోటావైరస్ టీకా), తల్లిపాలు పట్టడం, మెరుగైన పారిశుద్ద్యం, మరియు పరిశుభ్రత అనునవి చిన్న పిల్లలలో అతిసారం వచ్ఛే సందర్భాలను తగ్గించడములో సహాయపడతాయి.

అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) యొక్క లక్షణాలు - Symptoms of Diarrhea in Telugu

అతిసారవ్యధి అనేది, అంతర్లీనంగా ఉండే గ్యాస్ట్రోఇంటెస్టినల్ రుగ్మతకు అదే ఒక లక్షణము.  అయినప్పటికీ, అది ఈ క్రింది విధమైన ఇతర లక్షణాలతో కలిసి కూడా రావచ్చు:

లూజు బేదులతో పాటుగా ఇతర తీవ్రమైన లక్షణాలతో కలిసి కూడా రావచ్చు.  వీటిలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:

ఈ క్రింది విధంగా ఉంటే డాక్టరును కలవడం అత్యుత్తమం:

  • రెండు రోజులకు మించి అతిసార ఉంటే
  • నిర్జలత్వము యొక్క చిహ్నాలను గమనించి ఉంటే
  • పొత్తికడుపు లేదా గుదములో తీవ్రంగా నొప్పి ఉంటే.
  • మలము నల్లగా లేదా రక్తముతో కూడి ఉంటే.
  • 102°F కంటే ఎక్కువ జ్వరము ఉంటే.

చాలా చిన్నపిల్లలలో పల్చని విరేచనాలు వేగంగా నిర్జలత్వానికి దారి తీయగలవు. అందువల్ల, 24 గంటల లోపున గనక లక్షణాలు నయం కాకపోతే, ఒక వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమం.

అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) యొక్క చికిత్స - Treatment of Diarrhea in Telugu

వివిధ రకాల అతిసార వ్యాధికి చికిత్సా రూపాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:

  • అక్యూట్ అతిసారవ్యాధి (తీవ్రమైన అతిసారవ్యాధి)
    తీవ్రమైన అతిసారవ్యాధిని షాపులలో అమ్మే మందులతో చికిత్స చేయవచ్చు.  అయితే, రక్త విరేచనాలు లేక అతిసారముతో పాటు జ్వరము కలిగిన ప్రజలు షాపులలో అమ్మే మందులను ఎంపికచేసుకొనకూడదు.  ఒకవేళ అతిసారం 2 రోజులకు పైగా ఉంటే, డాక్టరును సంప్రదించుట మంచిది.
  • చిన్న పిల్లలలో తీవ్రమైన అతిసారవ్యాధి
    దుకాణాలలో అమ్మే మందులతో చిన్న పిల్లల అతిసారవ్యాధిని చికిత్స చేయుట ప్రమాదకరము, ప్రత్యేకముగా శిశువులు మరియు పసిబిడ్డలకు చికిత్స చేయకూడదు.  మందులను చిన్న పిల్లలకు ఇవ్వడానికి ముందుగా డాక్టరు లేక శిశు వైద్యుడితో మాట్లాడాలి.  లక్షణాలు గనక 24 గంటలపాటు ఉంటే, ఒక డాక్టరును సందర్శించండి. 
  • దీర్ఘకాల మరియు నిరంతర అతిసారవ్యాధి
    దీర్ఘకాల మరియు నిరంతర అతిసారవ్యాధి అనునది కారణాల పైన ఆధారపడి ఉంటుంది. పరాన్నజీవులు మరియు బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నివారించడానికి లేక చంపడానికి వివిధ యాంటిబయాటిక్ మందులు సూచించబడ్డాయి.  క్రోన్ యొక్క వ్యాధి, అల్సెరేటివ్ కొలిటిస్ మరియు ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ వలన వచ్చే అతిసారవ్యాధి కొరకు నిర్ధిష్టమైన మందులు సూచించబడ్డాయి.

జీవనశైలి యాజమాన్యము

కొన్ని జీవనశైలిలో కొన్ని మార్పులను చేయడం ద్వారా అతిసారవ్యాధి యొక్క లక్షణాలను త్వరగా పరిష్కరించవచ్చు మరియు భవిష్యత్తులో మరలా రాకుండా నివారించవచ్చు.  వీటిలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:

  • వీటి ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు:
    • బాత్ రూమును ఉపయోగించిన తరువాత సబ్భుతో చేతులను శుభ్రపరచుకోవడం.
    • వంటచేసే ముందు మరియు వంట చేసిన తరువాత చేతులను శుభ్రపరచుకోవడం మరియు డైపర్స్ మార్చిన తరువాత చేతులను శుభ్రపరచుకోవడం.
    • మరిగించిన లేక బాటిల్ లోని నీటిని త్రాగడం.
    • వేడి పానీయాలను త్రాగడం.
    • శిశువులకు మరియు చిన్న పిల్లలకు వయస్సుకు తగిన ఆహారమును ఇవ్వడం.
    • 6 నెలల వరకు తల్లిపాలను తప్పనిసరిగా ఇవ్వడం.
    • ఆహారమును సక్రమముగా నిల్వచేయడం మరియు నిర్వహించడం.
  • తొలగించవలసినవి:
    • కొళాయి నీళ్లు త్రాగడం.
    • జ్యూసులు, పానీయాలు మరియు ఐస్ కొరకు కొళాయి నీటిని ఉపయోగించడం.
    • అన్ పాస్చ్యురైజ్డ్ పాలు త్రాగడం.
    • రోడ్డు ప్రక్కన ఉండే ఆహారము తినడం.
    • పచ్చి మరియు వండని ఆహారము మరియు మాంసము తినడం.
    • ఆల్కహాలు వంటి పానీయాలు.
    • మసాలా ఆహారపదార్థాలు.
    • ఆపిల్స్ మరియు పియర్స్ వంటి పండ్లు.
    • కేఫినేటెడ్ పానీయాలు.
    • పాడి ఆహారాలు.
    • డైట్ కోలా డ్రింక్స్, క్యాండీస్, మరియు కృత్రిమ స్వీటేనర్లను కలిగిన చ్యూయింగ్ గమ్స్.
  • వీటి ద్వారా డిహైడ్రేషన్ ను నివారించవచ్చు:
    • ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం (ORS)
      ఓఆర్ఎస్ ద్రావణము అనునది నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ కలిగిన మిశ్రమం, వీటిని అతిసారం వలన్ ద్రవాలను కోల్పోయిన వ్యక్తిని రీస్టోర్ చేయడానికి ఇస్తారు.  కారణముతో సంబంధ లేకుండా అతిసార సంబంధ వ్యాధులకు ఇది ఉత్తమమైన చికిత్స.  ఫార్మసీలలో తయారుచేయబడిన ఓఆర్ఎస్ స్యాచెట్లు అందుబాటులో ఉంటాయి, అయితే ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, ఇంటిలోనే ఓఆర్ఎస్ ద్రావణమును తయారుచేయవచ్చు, 6 టీస్పూనుల చక్కెర మరియు ½  టీస్పూను ఉప్పును 1 లీటరు మంచినీళ్లు (కాచి మరియు చల్లార్చిన) లో మిశ్రమముగా కలపాలి.  2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, విరేచనము అయిన ప్రతీసారి ½  కప్పులో కనీసం 1/4 వ వంతు ద్రావణమును త్రాగాలి.  2 సంవత్సరముల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు ½  కప్పు నుండి ఒక పూర్తి కప్పు ఓఆర్ఎస్ ద్రావణమును త్రాగాలి.
    • సప్లిమెంట్స్
      విటమిన్ ఎ సప్లిమెంట్స్ అనునవి  6 నెలల నుండి 5 సంవత్సరముల మద్య వయస్సు కలిగిన అతిసారముతో హెచ్ఐవి సోకిన  పిల్లలకు రికమెండ్ చేయబడతాయి.  విటమిన్ ఎ, జింక్, మరియు ఇతర విటమిన్ల యొక్క కలయికతో కూడిన సప్లిమెంట్లను కొన్నిసార్లు అతిసారము సోకిన పిల్లలకు అతిసారమును నివారించుటకు సూచించబడతాయి.
    • రోటావైరస్ టీకా
      ఓరల్ రోటావైరస్ టీకాను అతిసార సంబంధ వ్యాదులను నివారించడానికి అనేక డోసులుగా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది.  పిల్లలలో రొటేటివ్ వైరస్ ఇన్ఫెక్షన్ కారణముగా వ్యాధులు వచ్చు సందర్భాలను హాస్పిటలుకు వెళ్ళకుండా తగ్గించడానికి ఈ టీకాలు సహాయంచేస్తాయి.

అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) అంటే ఏమిటి? - What is Diarrhea in Telugu

అతిసారవ్యాధి అనునది,  గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ ను సూచించు ఒక లక్షణము.  ఈ వ్యాధి బ్యాక్టీరియా, వైరస్ లు, అదే విధముగా పరాన్న జీవుల వలన వస్తుంది.  అయితే, ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా నీళ్ల విరేచనాలు ఏర్పడటానికి కారణమవుతాయి.  ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లలు ఒక సంవత్సరములో 500,000 కంటే ఎక్కువగా మరణించుటకు అతిసారసంబంధ వ్యాధులు కారణము, అందువలన, ప్రపంచవ్యాప్తముగా చిన్న పిల్లలు మరణించుటకు ఇది రెండవ ప్రధాన కారణము.  ఒక రోజులో 2000 కంటే ఎక్కువ మంది చిన్న పిల్లలు మరణించడానికి అతిసారసంబంధ వ్యాధులు కారణము, ఇవి   మలేరియాతట్టు, మరియు ఎయుడ్స్ కలయిక వలన ఏర్పడిన చిన్న పిల్లల మరణాల కంటే వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  తీవ్రమైన అతిసారం అనునది కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది.  ఇది అధిక ద్రవాలను కోల్పోవడానికి మరియు డీహైడ్రేషన్ కు దారితీస్తుంది, ఒకవేళ దీనికి సరియైన సమయములో చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకముగా కూడా మారవచ్చు.

అతిసార వ్యాధి అంటే ఏమిటి?

అతిసారవ్యాధి అనునది, అంతర్లీనంగా ఉండే గ్యాస్ట్రోఇంటెస్టినల్ రుగ్మత యొక్క ఒక లక్షణము.  దీనిని ఒక రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు లూజు విరేచనాలు కావడముగా నిర్వచించవచ్చు.  కొంతమంది ప్రజలు ఒక రోజులో తరచుగా సాధారణముగా విరేచనాలను కలిగిఉంటారు.   వీరు అతిసార వ్యాధిని కలియున్నారని దాని యొక్క అర్థము కాదు.



వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Diarrhoeal disease.
  2. Lakshminarayanan S & Jayalakshmy R. Diarrheal diseases among children in India: Current scenario and future perspectives. Journal of Natural Science, Biology, and Medicine. 2015 Jan;6(1):24. PMID: 25810630
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Global Diarrhea Burden
  4. Liu L, Johnson HL, Cousens S, Perin J, Scott S, Lawn JE, Rudan I, Campbell H, Cibulskis R, Li M, & Mathers C. Global, regional, and national causes of child mortality: an updated systematic analysis for 2010 with time trends since 2000. The Lancet. 2012 Jun 9;379(9832):2151-61. PMID: 22579125
  5. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Diarrhea.
  6. The Mother and Child Health and Education Trust [Internet] Rehydration project; Oral Rehydration Solutions: Made at Home

అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) వైద్యులు

Dr. kratika Dr. kratika General Physician
3 Years of Experience
Dr.Vasanth Dr.Vasanth General Physician
2 Years of Experience
Dr. Khushboo Mishra. Dr. Khushboo Mishra. General Physician
7 Years of Experience
Dr. Gowtham Dr. Gowtham General Physician
1 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

అతిసారం (నీళ్ల విరేచ‌నాలు) కొరకు మందులు

Medicines listed below are available for అతిసారం (నీళ్ల విరేచ‌నాలు). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for అతిసారం (నీళ్ల విరేచ‌నాలు)

Number of tests are available for అతిసారం (నీళ్ల విరేచ‌నాలు). We have listed commonly prescribed tests below:

సంబంధిత వ్యాసాలు