రోగనిర్ధారణా ఏజెంట్లు అంటే ఏమిటి?
రోగనిర్ధారణా ఏజెంట్లు (డయాగ్నస్టిక్ ఏజెంట్లు) అంటే శరీర పనితీరులను పరీక్షించడానికి మరియు వ్యాధులను గుర్తించడం కోసం వాడే పదార్ధాలు. ఆ పదార్థాలేవంటే సేంద్రీయ పదార్థాలు లేదా సేంద్రియం కాని రసాయన సమ్మేళనాలు, బయోకెమికల్స్, రంగులు మరియు చారికలు (dyes and stains) మరియు రేడియోధార్మిక ట్రేసర్లు. ఇవి శరీరం పనితీరులో మార్పులను గుర్తించడానికి సహాయపడతాయి. ఏజెంట్ యొక్క ఉద్దేశ్యం ఆధారంగా డయాగ్నస్టిక్ ఏజెంట్లను వేర్వేరు సమూహాలుగా వర్గీకరించారు. ఓ వ్యాధి యొక్క రోగనిర్ధారణ కోసం రోగనిర్ధారణా ఏజెంట్లను వివిధ దర్యాప్తు పద్ధతుల్లో వాడడానికి కూడా సహాయపడతాయి.
డయాగ్నస్టిక్ ఏజెంట్లను ఎలా వాడతారు?
డయాగ్నస్టిక్ ఏజెంట్లు వైద్య ప్రక్రియల్లో క్రింది పాత్రను కలిగి ఉంటాయి:
- సేంద్రీయ మరియు సేంద్రియం కాని సమ్మేళనాలు:
- టిష్యూ కల్చర్ గ్రేడ్
- బ్యాక్టీరియలాజికల్ ఏజెంట్
- హిస్టాలజీ పరీక్షలు
- కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్ణయించడం
- రంగులు మరియు మరకలు (చారలు)
- సైటోకెమికల్ రంగులద్దకం
- క్షీరద (సస్తనజంతుజాతి) కణజాలాల మరకలద్దేటందుకు
- రీజెంట్ డైస్
- మూత్ర విశ్లేషణ
- మరకలేసే ఎజెంట్ (staining agent)
- మలేరియా మరియు రక్త పరాన్నజీవులు
- హిస్టోలాజికల్ స్టైనింగ్ ఏజెంట్
- కల్చర్-మీడియా
- బాక్టీరియా యొక్క వేర్పాటు (isolation)మరియు గుర్తింపు
- వంధ్య పరీక్ష (Sterility testing)
- సెలెక్టివ్ ఐసొలేషన్ మరియు బాక్టీరియా సాగు (Selective isolation and cultivation of bacteria)
- బాక్టీరియాను ఒంటరిగా వేరు చేయడం (Differential isolation of bacteria)
- రేడియోధార్మిక ట్రేసర్లు (Radioactive tracers)
- బ్లడ్ పూల్ ఇమేజింగ్
- కణితిని కోరుతున్న ఏజెంట్
- ఎముక ఖనిజ విశ్లేషణ
- కొవ్వు శోషణ గుర్తించడానికి
రోగనిర్ధారణా ఏజెంట్లను ఏఏ వ్యాధులను విశ్లేషించడానికి ఉపయోగిస్తారు?
విశ్లేషణ ఏజెంట్లను క్రింది వ్యాధుల నిర్ధారణలో ఉపయోగిస్తారు:
- బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
- క్యాన్సర్
- కార్డియాక్ అసాధారణతలు
- ఎముక మజ్జ వ్యాధి
- కిడ్నీ వ్యాధులు
- మూత్ర మార్గము అంటువ్యాధులు
- పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్
- డయాబెటిస్
- అల్జీమర్స్ వ్యాధి వంటి మానసిక రుగ్మతలు
- రక్తహీనత మరియు రక్త కాన్సర్తో సహా రక్త వ్యాధులు
- మెనింజైటిస్
- మలేరియా , డెంగ్యూ , మరియు చికెన్ గినియా
- మెదడు, రొమ్ము, తల, మూత్రపిండాలు, థైరాయిడ్ మరియు కాలేయం వంటి అవయవాల యొక్క ఇమేజింగ్
- విల్సన్ వ్యాధి
రోగనిర్ధారణా ఏజెంట్లను ఎందుకు వాడతారు?
రోగనిర్ధారణ ఏజెంట్లను రక్తం, మలం, ఉమ్మి, మూత్రం మరియు ఇతర శరీర ద్రవాలు లేదా కణజాల నమూనాలపై పరీక్ష నిమిత్తం ఉపయోగిస్తారు. ఈ ఏజెంట్లను వివిధ వ్యాధి పరిస్థితులను విశ్లేషించడానికి ఉపయోగిస్తారు. రోగనిర్ధారణ ఏజెంట్లు ప్రతిస్పందనలకు గురవుతాయి మరియు నిర్దిష్ట పరిమాణాత్మక మరియు గుణాత్మక ఫలితాలను అందిస్తాయి, ఆ ఫలితాలు ఒక వ్యాధి యొక్క ఉనికిని సూచిస్తుంది. ఈ ఫలితాలు రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం మరియు వ్యాధి యొక్క ఉనికిని గుర్తించడం, వ్యాధి వ్యాప్తిని నిర్ణయిస్తాయి మరియు కొనసాగుతున్న మందుల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. అందువలన, రోగనిర్ధారణ ఏజెంట్లు సరైన వైద్య హేతువిచారాన్ని (clinical reasoning) సాధించడంలో, మరియు చికిత్స యొక్క ప్రణాళికను సిద్ధం చేయడంలో సహాయం చేస్తాయి.