డయాబెటిక్ డైస్లిపిడెమియా అంటే ఏమిటి?
డైస్లిపిడెమియా అనేది లిపోప్రొటీన్ జీవక్రియకు సంబంధించిన ఒక రుగ్మత. ఈ రుగ్మత, లిపోప్రొటీన్ అధిక ఉత్పత్తి లేదా , లిపోప్రొటీన్ కొరత అధిక రక్త కొలెస్ట్రాల్ లేదా అల్ప రక్త కొలెస్ట్రాల్ పరిస్థితికి కారణం కావచ్చు. డయాబెటిస్ వ్యాధి ఉన్న రోగులు డైస్లిపిడెమియాకు అధికంగా గురయ్యే ప్రమాదం ఉంది, అంటే మార్పు చెందిన లిపిడ్ స్థాయిలు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
డైస్లిపిడెమియా తేలికపాటి స్థాయిలో ఉన్నప్పుడు, ఇది ఎలాంటి లక్షణాలను ఉత్పత్తి చేయదు. అయితే, డయాబెటిక్ డైస్లిపిడెమియా వ్యాధి యొక్క తీవ్రమైన స్థాయి కింద సూచించిన వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది
- తరచుగా కడుపు నొప్పులు
- ఛాతి నొప్పి
- శ్వాస సమస్యలు
- కండరాల నొప్పి
- గందరగోళం
డయాబెటిక్ డైస్లిపిడెమియా ఉన్న వ్యక్తులలో, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి డైస్లిపిడెమియా నుండి అభివృద్ధి చెందే సమస్యల ప్రమాదం కూడా ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టైప్ 2 డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు డైస్లిపిడెమియా వ్యాధి వచ్చే అధిక ప్రమాదం ఉంది.
చక్కెరవ్యాధి (డయాబెటీస్) అనేదే ఒక వైద్య పరిస్థితి (అంటే వైద్యం అవసరమైన ఒక వ్యాధి) మరియు డైస్లిపిడెమియా చక్కెరవ్యాధికి ద్వితీయ కారణంగా దారి తీస్తుంది. సాధారణ మృదులాస్థి స్థాయిలతో చక్కెరవ్యాధి (మధుమేహం) జోక్యం చేసుకుని, వాటిని పెంచుతుంది. హార్మోన్ ఇన్సులిన్ మరియు అధికస్థాయి గ్లూకోస్ స్థాయిల చర్య లో ఒక లోపము డయాబెటిస్ వ్యక్తుల్లో డైస్లిపిడెమియాకు ప్రధాన కారణాలు.
ఊబకాయం మరియు రక్తనాళ వ్యాధులు వంటి వైద్య పరిస్థితులు, డైస్లిపిడెమియాకు కారణం కావచ్చు. డైస్లిపిడెమియాకు అదనపు కారణాలు ఇలా ఉన్నాయి
- కాలేయ వ్యాధి
- అధిక మద్యపానం
- క్రియారహిత జీవనశైలి
- అధిక కేలరీల ఆహారం (అనారోగ్యకరమైన ఆహారం)
- పదార్థ దుర్వినియోగం
డయాబెటిక్ డైస్లిపిడెమియాను ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
డైస్లిపిడెమియాని నిర్ధారించడానికి డాక్టర్ చేత రక్త పరీక్ష మరియు మూత్ర పరీక్ష జరుగుతుంది.
మధుమేహం ఉన్న వ్యక్తులలో, హృదయ సంబంధ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను నివారించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం చాలా అవసరం. అందువల్ల, వైద్యుడు ఆహారం మరియు జీవనశైలి మార్పులను సిఫార్సు చేయడమే కాకుండా, తరచూ సాధారణమైన క్రమమైన వైద్య తనిఖీలను (regular medical check-ups) చేయించుకొమ్మని నొక్కి చెబుతాడు.
డైస్లిపిడెమియా యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి, స్టాటిన్స్ అని పిలువబడే మందులు మరియు ఫైబ్రినోజెన్లనే (fibrinogens) మందులను సూచించవచ్చు.