సైనైడ్ విషప్రయోగం అంటే ఏమిటి?
మనిషి శరీరంలో వేగంగా పనిచేసే విషపూరిత సైనేడ్తో సంపర్కం ఏర్పడ్డప్పుడు కలిగే పరిస్థితినే “సైనైడ్ విషప్రయోగం” అంటారు. సైనైడ్ అనేది “శినిదము” అనే రసాయనిక విషపదార్ధం. సైనైడ్ యొక్క వాయురూపం హైడ్రోజన్ సైనైడ్, సైనైడ్ యొక్క ఉప్పును “పొటాషియం సైనైడ్” అని పిలుస్తారు. లిమా బీన్స్, బాదం , కాసావా మొక్క, పురుగుమందుల వంటి పారిశ్రామిక మూలాలు, ఫోటోగ్రఫీలో ఉపయోగించే ద్రవపదార్థాలు (solutions) మరియు ఆభరణాల శుద్ధీకరణకు ఉపయోగించే ద్రవాలలో ప్రకృతిసిద్ధమైన సైనైడ్ విషపదార్థాలుంటాయి. భారతదేశంలో సైనైడ్ విషప్రయోగం యొక్క గణాంకాలు తెలియవు.
సైనైడ్ విషప్రయోగం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సైనైడ్ విషప్రయోగం అనేది ఎపుడు సంభవిస్తుందంటే సైనైడ్ విషపదార్థం కడుపులోకి చేరవేయడం మూలంగా లేదా ఈ విషపదార్థాన్ని పీల్చడం ద్వారా గాని సంభవించినపుడు. ఇలా జరిగినపుడు సైనైడ్విషం రక్తంలో దాదాపు 40 mol/L సాంద్రత స్థాయిలో మిళితమైనపుడు ఈ విషప్రయోగం జరుగుతుంది. ఈ విషప్రయోగం లక్షణాలు సాధారణంగా చాలా వేగవంతంగా ఉంటాయి. సైనైడ్ ను వాయురూపంలో పీల్చినట్లయిన అది రక్తంతో మిళితమైన కొద్దీ సెకన్లలోనే ప్రాణం పోతుంది. సైనైడ్ ని ఉప్పురూపంలో కడుపులోని గ్రహిస్తే కొన్ని నిముషాల్లో ప్రాణం పోతుంది. సైనైడ్ ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ మరియు హృదయనాళ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటుంది. పీల్చడం ద్వారా, చర్మం ద్వారా శోషణ అవడం ద్వారా, లేదా సైనైడ్-కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. సైనైడ్ విషప్రయోగం జరిగినపుడు దాని ప్రారంభంలో ఈ లక్షణాల్ని వ్యక్తీకరిస్తుంది.
- ఆట్లు పోట్లుగా వుండే లేక సలిపే (throbbing) తలనొప్పి
- మైకము
- వికారం
- వాంతులు
- వేగవంతమైన గుండె రేటు మరియు శ్వాస
ఎటువంటి మార్గం ద్వారానైనా సరే సైనైడ్ ని పెద్ద మొత్తాల్లో కడుపులోకి గ్రహించినప్పుడు, క్రింది లక్షణాలను చూడవచ్చు:
- మూర్ఛలు (అత్యంత సాధారణం)
- స్పృహ కోల్పోవడం
- అల్పరక్తపోటు (హైపోటెన్షన్)
- ఊపిరితిత్తుల గాయం
- తగ్గిన గుండె స్పందన రేటు
సైనైడ్ విషాన్ని సేవించిన తర్వాత బతికినవాళ్ల మనుగడలో నరాలకు సంబంధించిన మానసిక రోగ లక్షణాలను మరియు దృష్టి క్షీణతను ప్రదర్శించవచ్చు.
సైనైడ్ విషప్రయోగం ప్రధాన కారణాలు ఏమిటి?
సైనైడ్ విషప్రయోగం కారణంగా, శరీర కణాలు ప్రాణవాయువును ఉపయోగించలేక పోతాయి, తద్వారా, ప్రాణాంతకదశకు దారితీస్తుంది. సైనైడ్ కొద్ధి పరిమాణంలో శరీరంలోకి చేరితే ఆ విషపదార్థం థియోసైయనేట్ (thiocyanate) రూపంలోకి మార్చబడుతుంది. సైనైడ్ పెద్ద మోతాదుల్లో కడుపులోకి చేరితే దాని చర్యలు మరింత స్పష్టంగా ఉంటాయి, వేగంగా శరీరకణాల మరణానికి దారితీస్తుంది. ఇది మరణానికి దారితీసే ముఖ్యమైన అవయవాల వైఫల్యానికి కారణమవుతుంది. విష మోతాదు 100-200 mg పరిధిలో ఉంటుంది.
సైనైడ్ విషప్రయోగాన్ని నిర్ధారణ చేసేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి ?
సైనైడ్ విషప్రయోగం యొక్క రోగ నిర్ధారణ పూర్తిగా వైద్య (క్లినికల్) పరిశోధన, అయితే కొన్ని ప్రయోగశాల పరీక్షలు కూడా ఇందులో సహాయపడతాయి. ప్రయోగశాల పరీక్షల ద్వారా సైనైడ్ విషప్రయోగంలో క్రింది జీవసంబంధ అసాధారణతలు గుర్తించబడతాయి:
- జీవక్రియ అసిడోసిస్ (రక్తంలో ఆమ్ల పరిమాణం పెరగడం).
- లాక్టిక్ ఆమ్లం యొక్క పెరిగిన స్థాయిలు.
- 90% కంటే ఎక్కువ సిరల ఆక్సిజన్ సంతృప్తత.
చేయించిన పరీక్షల్లో ఇవి ఉన్నాయి:
- పూర్తి రక్తగణన పరీక్ష
- బ్లడ్ గ్లూకోజ్ కొలత.
- బయోకెమికల్ పరీక్షలు.
- ECG పర్యవేక్షణ.
సైనైడ్ విషప్రయోగాన్ని కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగంతో పోలిస్తే వేరుగా ఉంటుంది, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం విషయంలో అరుదుగా మూర్ఛలు వస్తాయి కాబట్టి.
చికిత్స పద్ధతులు ఇలా ఉంటాయి:
- కల్మష నిర్మూలన:
- యాంటిడోట్ కిట్: దీనిలో సైనైడ్ను జీవక్రమానుసారం చేసే మూడు అంశాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.
- హైడ్రోసోకోబాలమిన్: ఇది సైనైడ్తో మిళితమై మూత్రంలో సైనైడ్ ని తొలగిస్తుంది.
స్వీయ రక్షణ చిట్కాలు:
- మీరు గనుక సైనైడ్ను కలిగి ఉన్న ఏదైనా వాయు పదార్థాలకి గురైనట్లయితే, ఆ ప్రాంతం నుండి వేగంగా దూరంగా తరలి పొండి.
- సైనేడ్తో తడిసిన లేదా ఆ విషపదార్థం అంటుకున్న దుస్తులను తొలగించండి.
- నీరు మరియు సబ్బును పుష్కలంగా ఉపయోగించి కళ్ళను బాగా శుభ్రం చెయ్యండి, ముఖ్యంగా కళ్ళలోకి నీటిని చెదిరేట్టుగా (splash) వెదజల్లి కళ్ళు బాగా శుభ్రం అయ్యేట్టు చూడాలి.
- సైనైడ్ కడుపులోకి దిగుంటే ఉత్తేజితమైన కర్ర బొగ్గు (charcoal) సైనైడ్ యొక్క శోషణను నిరోధిస్తుంది.
- సైనైడ్ను తొలగించడానికి బ్లీచ్ ఉపయోగించడం మానుకోండి.
- వెంటనే వైద్య సహాయం కోరండి.
నివారణ చిట్కాలు:
- సైనైడ్ విషప్రయోగం గురించి ఎరుక కల్గించే విద్యను పరిశ్రమలలోని కార్మికులకు కల్పించాలి, దీనివల్ల విభిన్న రూపాల్లో సైనైడ్ను ఉపయోగించే పరిశ్రమల్లో కార్మికులకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరక్కుంగా నివారించేందుకు వీలవుతుంది.
- పరిశ్రమల్లో వృత్తిపరమైన ప్రమాదాలు సర్వసాధారణం, మరియు కార్మికులకు సైనైడ్-కలిగిన ఉత్పత్తులను నిర్వహించడంలో ముందుగానే శిక్షణ ఇవ్వాలి.
- సైనైడ్ విషప్రయోగం మరియు తదుపరి జాగ్రత్తల గురించిన సమాచారం అందించడానికి రోగులకు పనికొచ్చే కారపత్రాల్ని (పేషెంట్ హ్యాండ్ అవుట్స్) వారికి అందుబాటులో ఉంచాలి.
ఇతర విషప్రయోగాల్లా కాకుండా, సైనైడ్ విషప్రయోగం చాలా ప్రమాదకరమైనది మరియు సరైన చర్యలు వెంటనే తీసుకోకపోతే వేగంగా మరణానికి దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలను నివారించడానికి ముందస్తు పరిణామాల గురించి తెలుసుకోవడం మంచిది.