సి.ఓ.పి.డి (క్రోనిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్) అంటే ఏమిటి?
సి.ఓ.పి.డి అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల వాపు వ్యాధులకు ఒక సంక్లిష్ట పదం, ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులలోని వాయు ప్రసారాన్ని అడ్డుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా, మరణాలు మరియు రోగవ్యాప్తికి సి.ఓ.పి.డి ఒక ఒక ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మోస్తరు నుండి తీవ్రమైన సి.ఓ.పి.డితో బాధపడుతున్నారు. భారతదేశంలో నమోదైన సి.ఓ.పి.డి యొక్క ప్రాబల్యం పురుషులలో 2% -22%గా మరియు స్త్రీలలో 1.2% -19% గా ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇతర శ్వాస సమస్యల లక్షణాలతో కలిసిపోవడం వలన, మొదట్లో సి.ఓ.పి.డిను సులభంగా గుర్తించలేకపోవచ్చు. సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- శ్వాస తీసుకోవడంలో కష్టం
- దగ్గు
- అధికంగా శ్లేష్మం స్రవించడం
- గురక
- ఛాతీ పట్టేయడం
- పెదవులు లేదా వేలి గోళ్లు నీలం రంగులోకి మారడం
- అలసట
- అసాధారణ బరువు నష్టం
- కింది భాగాలలో ఎడెమా (నీరు చేరడం)
సి.ఓ.పి.డి మూడు పురోగతి చెందే ఊపిరితిత్తుల సమస్యలను కలిగి ఉంటుంది: దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, మరియు స్థిరమైన ఆస్తమా. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ను అనుభవించే వ్యక్తులలో నిరంతర దగ్గు మరియు శ్లేష్మం స్రవించడం (mucus secretion) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎంఫిసెమాలో, వాయుకోశము (ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచులు) ప్రభావితమవుతాయి అంటే వివిధ వాయు ప్రకోపకాలు (gaseous irritants) ఉదాహరణకు, సిగరెట్ పొగ వంటి వాటి కారణంగా అవి పాడైపోతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సి.ఓ.పి.డి కి అతి ముఖ్యమైన ప్రమాద కారకం ధూమపానం మరియు జీవ ఇంధనాలు (biofuels) లేదా గృహ పొగకు బహిర్గతం కావడం. ఇతర హాని కారకాలు గుండె జబ్బులు, గుండె మంట, నిరాశ లేదా మధుమేహం వంటి అదనపు వ్యాధులను కలిగించే విధంగా ఉంటాయి. పాక్షిక ధూమపానం మరియు ఆల్ఫా -1 లోపం (alpha-1-deficiency) కారణంగా సంభవించే అరుదైన జన్యుపరమైన రుగ్మత కారణంగా కూడా సి.ఓ.పి.డి రావచ్చు. ఆస్తమా కూడా సి.ఓ.పి.డి ను పెంచుతుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సి.ఓ.పి.డి నిర్ధారణకు ఈ క్రింది పరీక్షలు జరపవచ్చు:
- ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు: ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి.
- ఛాతీ ఎక్స్-రే: ఇతర ఊపిరితిత్తుల సమస్యల సంభావ్యతను నిర్ములించడానికి.
- రక్తనాళాలలో వాయువు యొక్క విశ్లేషణ.
- ప్రయోగశాల పరీక్షలు.
గోల్డ్ మార్గదర్శకాలను (Gold guidelines) సాధారణంగా సి.ఓ.పి.డి రోగుల చికిత్స ఎంపికల కోసం ఉపయోగిస్తారు. చికిత్సలు వీటిని కలిగి ఉంటాయి:
- నివారణ చర్యలు:
- ధూమపానం మానివేయాలి మరియు పొగ మరియు ఇతర శ్వాసకోశ ఇరిటెంట్లకు (చికాకు కలిగించే పదార్థాలు) దూరంగా ఉండాలి.
- మందులు:
- బ్రాంకోడైలేటర్లు (Bronchodilators).
- పీల్చే స్టెరాయిడ్లు (Inhaled steroids).
- కలయిక ఇన్హేలర్లు (Combination inhalers).
- ఫాస్ఫోడియోరేస్ -4ను నిరోధించేవి (Phosphodiesterase-4 inhibitors).
- యాంటిబయాటిక్స్.
- మందులు ఉపయోగించని చర్యలు:
- ఆక్సిజన్ థెరపీ.
- ఊపిరితిత్తుల పునరుద్ధరణ చర్యలు (Lung rehabilitation programs).
- శస్త్ర చికిత్స:
- ఊపిరితిత్తుల పరిమాణ తగ్గింపు శస్త్రచికిత్స.
- ఊపిరితిత్తుల మార్పిడి.
- బ్యులెక్టమీ (Bullectomy).
వ్యాధి పురోగతిని నివారించడం మరియు ఆపడం ఉత్తమం.
సి.ఓ.పి.డి అనేది ఉపశమనం కానీ ఒక నిరంతర వ్యాధి, కానీ ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్సతో సి.ఓ.పి.డిను నిర్వహించవచ్చు.
(మరింత సమాచారం: ఊపిరితిత్తుల సంక్రమణ చికిత్స)