దీర్ఘకాల వెక్కిళ్లు ఏమిటి?
దీర్ఘకాలిక వెక్కిళ్లు అనేవి మామూలు వెక్కిళ్లు కాదు. మామూలుగొచ్చే వెక్కిళ్లు 48 గంటలు దాటినా ఆగకుండా కోనసాగుతూనే ఉంటే వాటినే “దీర్ఘకాలిక ఎక్కిళ్ళు” అంటారు. రొమ్ముకు-పొట్టకు మధ్య ఉండే పెద్ద షీట్ లాంటి కండరం ఉదారవితానం (డయాఫ్రాగమ్), దీనికి హఠాత్సంకోచం ఏర్పడ్డప్పుడు, వెంటనే గాత్ర త్రాడులు (vocal cords) మూసుకుంటాయి. ఇలా ఆకస్మికంగా జరిగే క్రియవల్ల “వెక్కిళ్లు” వస్తాయి, తద్వారా వెక్కిళ్లు శబ్దం కూడా వస్తుంది. మనందరకూ ఎపుడో ఒకప్పుడు సాధారణంగా వెక్కిళ్లు వచ్చే ఉంటాయి. అయితే దీర్ఘకాలలిక వెక్కిళ్లు అనేవి చాలా తక్కువగా వస్తాయి మరియు దీనికి వైద్యపరిరక్షణ కల్పించాలి
దీర్ఘకాలిక వెక్కిళ్ళకు ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దీర్ఘకాలిక వెక్కిళ్ల యొక్క ప్రధాన సంకేతం ఏమిటంటే వెక్కిళ్లే. అంటే వెక్కిళ్లే వెక్కిళ్ళకు సంకేతం. అయినప్పటికీ, ఇలా నిరంతరం దీర్ఘకాల వ్యవధుల్లో వచ్చే వెక్కిళ్లకు అనుబంధంగా ఇతర లక్షణాల్ని కూడా గమనించవచ్చు, వాటిలో:
- నిద్ర లేకపోవడం
- ఏదైనా తినడానికి లేదా త్రాగడానికి అసమర్థత
- అలసట
- బరువు నష్టం
- నిర్జలీకరణము
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వెక్కిళ్ల కారణాలు బాగా మారుతుంటాయి. అయినప్పటికీ, ఎవరికైనా దీర్ఘకాలిక వెక్కిళ్లు వచ్చినపుడు, అవి కింద తెల్పిన కారణాలవల్ల కావచ్చు:
- నాడీ సంబంధిత రుగ్మత
- గర్భధారణ
- ఇటీవలి అనస్తీషియా (నొప్పి తెలియకుండా ఉండేందుకిచ్చే మత్తు సూది మందు) యొక్క ప్రభావం
- శస్త్రచికిత్స; ముఖ్యంగా కడుపు లేదా ఉదరం యొక్క శస్త్రచికిత్స
- కడుపు, ప్రేగు, కాలేయం లేదా ఉదరవితానం (diaphragm)తో సమస్యలు
- మద్యపానవ్యసనం
- క్యాన్సర్
- న్యుమోనియా లేదా రొమ్ము నొప్పి, పార్శ్వశూల.
- ఊపిరి తిత్తులు నాడీ వ్యవస్థ గట్టిపడుట (మల్టిపుల్ స్క్లేరోసిస్) లేదా కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క ఇతర పరిస్థితులు
- ఒత్తిడి లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు
వెక్కిళ్ళను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
దీర్ఘకాలిక వెక్కిళ్ల రోగ నిర్ధారణ చాలా సులభం మరియు దాదాపు వెంటనే నిర్ధారణ చేయవచ్చు. వెక్కిళ్ల రుగ్మత రోగ నిర్ధారణకు ఓ వివరణాత్మక చరిత్ర మరియు భౌతిక పరీక్ష తరచుగా సరిపోతుంది. అయితే, మూల కారణాన్ని లేదా సంబంధిత సమస్యలను నిర్ధారించేందుకు కొన్ని ఇమేజింగ్ అధ్యయనాలు సూచించబడటం అసాధారణం కాదు. మీ వైద్యుడు మీ ఛాతీ లేదా పొట్ట యొక్క X- రే తీయించమని సూచించవచ్చు, దీనివల్ల దీర్ఘకాలిక వెక్కిళ్ళకు దారితీసే రోగకారకం ఏమిటన్నది డాక్టర్ నిర్ధారణ (pathology) చేసుకోవడం వీలవుతుంది.
చికిత్స రోగి యొక్క పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది మరియు కింది వా టిని కలిగి ఉండవచ్చు:
- క్లోరిప్రొమాజిన్ (Chlorpromazine), బక్లోఫెన్ లేదా వల్ప్రోమిక్ యాసిడ్ లను వైద్యుడు సూచంచవచ్చు
- పరిస్థితుల వలన వచ్చే ఎక్కిళ్ళకు చికిత్స
- కండరాల విశ్రామక మందులు మరియు (శాంతపరిచే) మత్తుమందులు
- వాగస్ నాడిని ప్రేరేపించడానికి సహాయపడే శస్త్రచికిత్స
- ఉదరవితానానికి (డయాఫ్రాగమ్ కు) రక్త సరఫరా చేసే మధ్యపటలీయ మజ్జాతంతువు (phrenic nerve) లోనికి మత్తుమందును ఎక్కించడం.
- ఆక్యుపంక్చర్ లేదా హిప్నోథెరపీ వంటి ప్రత్యామ్నాయ చికిత్స