ఛాతి నొప్పి - Chest Pain in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 14, 2018

September 11, 2020

ఛాతి నొప్పి
ఛాతి నొప్పి

సారాంశం

తరచుగా ఛాతీ నొప్పి అంటే భయపెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది గుండె పోటు మరియు ఇతర గుండె వ్యాధులకు దగ్గర పోలికల్ని కల్గి ఉంటుంది. ఛాతీ నొప్పి తేలికపాటి నొప్పి నుండి తీవ్రమైన నొప్పిగా కూడా వస్తుంటుంది. ఛాతీ నొప్పి ప్రాథమిక ఔషధాలతో తగ్గకపోతే వైద్య నిపుణులచేత దీనిని పరీక్ష చేయించుకోవాల్సిందిగా మీకు సిఫార్సు చేయడమైంది. మన ఛాతీలో గుండెతో పాటు అనేక అవయవాలు ఉన్నాయి. అవే కడుపు, ఊపిరితిత్తులు, క్లోమం లేదా (ప్యాంక్రియాస్) వృక్వము, పిత్తాశయం మొదలైన కండరాలు, పక్కటెముకలు, నరములు, మరియు చర్మం వంటివి. అందువల్ల, ఛాతీ నొప్పి పైన పేర్కొన్న అవయవాల నుండి ఉద్భవించగలదు. కొన్నిసార్లు, మీకొచ్చే ఛాతీ నొప్పి దానంతట అదే పోవచ్చు.  కానీ అలా జరగకపోతే, అంటే నొప్పి అట్లాగే కొనసాగితే, మీరు వైద్యుల్ని సంప్రదించి వ్యాధి ఏమిటో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మీ దేహానికున్న అంతర్గత కారణాల ఆధారంగా మీ వైద్యుడు మీకు మందులు ఇచ్చి, జీవనశైలి మార్పులు సూచించి చికిత్స చేస్తాడు. లేదా, అవసరమైతే, శస్త్రచికిత్స కూడా చేస్తాడు.

 

ఛాతి నొప్పి యొక్క రకాలు - Types of Chest Pain in Telugu

ఛాతీ నొప్పిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు:

తీవ్రత ఆధారంగా:

  • స్వల్పమైన ఛాతి నొప్పి అనేది సాధారణంగా వస్తుంది మళ్లీ వెళ్లిపోతుంది. ఈ రకమైన ఛాతి నొప్పి సాధారణంగా సహించుకోదగినదిగా ఉంటుంది.
  • ఓ మోస్తరు నొప్పి ప్రారంభమవుతుంది, అటుపై మీరే పనులూ చేయకుండా మిమ్మల్ని క్షోభపెడుతుంది.
  • తీవ్రమైన నొప్పి ఏమంటే నొప్పిని భరించలేకపోయినప్పుడు, ఇక తక్షణ వైద్య సంరక్షణ అనివార్యమైనప్పటి పరిస్థితి.

వ్యాధి లక్షణం ఆధారంగా

  • తీవ్రమైన నొప్పి - అధిక తీవ్రత కలిగిన పదునైన నొప్పి ఆకస్మికంగా ఛాతిపై దాడి చేస్తే దాన్ని ‘తీవ్రమైన నొప్పి’ అని పిలుస్తారు.
  • నిస్తేజమైన నొప్పి- దీని యొక్క  స్థాయి మితమైన నొప్పి నుండి తీవ్రంగా ఉండే నొప్పి. ఛాతి నొప్పి కల్గిన శరీర భాగాన్ని నొక్కనట్లైతే నొప్పి మరింత ఎక్కువవుతుంది.
  • కత్తిపోటులాంటి నొప్పి: ఒక కత్తి మీ శరీరంలోకి దిగబడితే నొప్పి ఎంత హింసాత్మకంగా భరించలేనిదిగా ఉంటుందో అంత తీవ్రమైందిగా ఉంటుందీ  ‘కత్తిపోటువంటి ఛాతి నొప్పి’. ఇది అధిక తీవ్రత మరియు భరించలేనిధిగా ఉంటుంది.
  • బోరింగ్ నొప్పి-ఛాతిలోని లోతైన భాగాలలో సూదులతో పొడిచినట్లు భయంకర అనుభూతిని కల్గించే నొప్పినే బోరింగ్ నొప్పిగా వ్యవహరిస్తారు.
  • సలిపే నొప్పి-కొట్టినట్లుండే చాతి నొప్పి లేదా ఛాతి యొక్క నాడీవ్యవస్థలో సలుపుతున్నట్లుంటే దాన్నే ‘సలిపే ఛాతి నొప్పి’ లేదా  ‘త్రోబింగ్ నొప్పి’ అని పిలుస్తారు.
  • మండుతున్నట్లుండే ఛాతి నొప్పి-బాధిత ఛాతి భాగంలో మండుతున్నట్లు నొప్పి కల్గితే  దాన్నే మండే ఛాతి నొప్పి (బర్నింగ్ పెయిన్) అని వ్యవహరిస్తారు.
  • సూదులతో పొడిచినట్లుండే నొప్పిని ‘టింగ్లింగ’ పెయిన్’ లేదా సూదులతో గుచ్చినట్లున్న నొప్పి లేదా సూదితో కుట్టినట్లున్న నొప్పి అని భావించబడింది.
  • ఒత్తిడి నొప్పి-మీ శరీరం యొక్క బాధిత భాగం, అంటే ఛాతీ భాగంలో, నొప్పితో పాటు బిగుతుగా పట్టేసినట్లున్న భావన కానీ, లేదా ఛాతీ అంతటా నొప్పి అనిపిస్తే దాన్నే ఒత్తిడి నొప్పి లేదా సంపూర్ణనొప్పి అని పిలువబడుతుంది.

స్థానం ఆధారంగా

ఛాతీ ప్రాంతాన్ని ఎడమ, కుడి, మరియు మధ్యభాగాలుగా విభజించవచ్చు. నొప్పి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా రాగలదు.

వ్యాపిస్తున్న ఛాతీ నొప్పి: ఛాతీ నుండి మెడ, దవడ లేదా భుజం వంటి ఇతర భాగాలకు వ్యాపిస్తుంది ఈ రకం ఛాతీ నొప్పి.

వ్యవధి ఆధారంగా

  • తీవ్రమైన నొప్పి కొద్దీ వ్యవధిలోనే ఛాతీలో ఆకస్మికంగా రావడం, ఇలాంటి  ఆకస్మికం తీవ్ర నొప్పికి అత్యవసర వైద్య సాయం అవసరం.
  • మీరు దీర్ఘకాలిక నొప్పిని, అంటే 3 నెలల కన్నా ఎక్కువ కాలం, నిరంతరం లేదా అప్పుడప్పుడూ ఎదుర్కొంటున్నప్పుడు.
  • పునరావృత ఛాతీనొప్పి (లేదా ఎపిసోడిక్ నొప్పి): అప్పుడప్పుడు ప్రతిసారి నొప్పి అనుభవించినప్పుడు. ఇలా అప్పుడప్పుడు వచ్చే రెండు వరుస ఛాతీ నొప్పి ఎపిసోడ్ల మధ్య సమయం ఓ నిర్దిష్ట క్రమంగా లేదా క్రమరహితంగా ఉండవచ్చు. ఇలా వచ్చే ఛాతీ నొప్పి ఎపిసోడ్ల మధ్యకాలంలో ఆ వ్యక్తికి ఎలాంటి బాధ ఉండదు.
  • విచ్చిన్నకర ఛాతీ నొప్పి: ఓ సుదీర్ఘమైన కాలం పాటు నిస్తేజమైన ఛాతీ నొప్పిని అనుభవించినప్పుడు, అది ఆకస్మికంగా వస్తుండి, పదునైన నొప్పిగా  ఉంటుంది. ఒకిన్ని కాల వ్యవధుల్లో ఆకష్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పి గుంపులు గుంపులుగా వస్తే దాన్నే ‘విచ్చిన్నకర ఛాతీ నొప్పి’ గా పిలుస్తారు.

హాని ఆధారితంగా ఛాతీ నొప్పి

  • నోసిసెప్టివ్ నొప్పి
    ‘నోసిసెప్టివ్’ ఛాతీనొప్పి: అంతర్గత కండరకణజాలంలో జరిగే హాని కారణంగా ఛాతీలో  కలిగే నొప్పి ఇది. ఛాతీ యొక్క ఉపరితల కణజాలం అయిన చర్మం, దాని అంతర్గత భాగాల్లో హాని జరిగినప్పుడు కలిగే ఛాతీ నొప్పి, దీనినే “శారీరక నొప్పి” అని కూడా  పిలుస్తారు. ఛాతీ అంతర్గత అవయవాలైన ఊపిరితిత్తులలో, పిత్తాశయము, క్లోమము, గుండె వంటి వాటిలో హాని సంభవించినప్పుడు దాన్ని “విస్సురల్ పెయిన్” లేదా “అంతరాంగ ఛాతీ నొప్పి” గా పిలువబడుతుంది.

  • నరాలసంబంధ నొప్పి
    ఛాతీ ప్రాంతానికి రక్తం సరఫరా చేసే నరంలో హాని సంభవించినప్పుడు కలిగే  ఛాతీ నొప్పిని “నరాలకు సంబంధించిన ఛాతీ నొప్పి” అంటారు.

  • మనోవ్యాధిజనిత ఛాతీనొప్పి
    మీరు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు లేదా భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, ఛాతీ ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి సాధారణంగా ఆందోళన మరియు తీవ్ర భయాందోళనలకు సంబంధించినది. ఇది మానసిక నొప్పిగా లేదా ‘సైకోజెనిక్ పెయిన్’ గా పిలువబడుతుంది.

  • మస్క్యులోస్కెలెటల్
    ఛాతీప్రాంతంలోని ఎముకలు మరియు కండరాలు దెబ్బతిన్నపుడు లేదా ఒక ప్రక్కటెముక విరిగిపోయినప్పుడు కలిగే ఛాతీ నొప్పినే ‘కండరాలు-ఎముకలకు సంబంధించిన’ ఛాతీ నొప్పి (మస్క్యులోస్కెలెటల్ పెయిన్) గా  చెప్పబడుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

ఛాతి నొప్పి అంటే ఏమిటి? - What is Chest Pain in Telugu

మీ మెడ నుండి (కడుపుకు దిగువనున్న) పక్కటెముకల మధ్యలో ఉన్న ఏభాగంలో నొప్పి వచ్చినా దాన్ని ‘ఛాతీ నొప్పి’ అని పిలుస్తారు. ఈ నొప్పి ఛాతిలో సంపూర్ణంగా ఉండచ్చు.  ఇంకా, ఛాతీలో బిగుతుగా, పిండేసినట్లు, మండుతున్నట్లు లేదా ఛాతీలో ఒత్తిడితో కూడిన సంచలనం కూడా కావచ్చు. ఊపిరాడక పోవడం, అలసట, చెమట, వికారం, జ్వరం, చలి వంటి అనేక లక్షణాలు ఛాతి నొప్పితో ముడిపడి ఉంటాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో  ఛాతీ నొప్పికి సంబంధించిన అనేక లక్షణాలు మరణానికి కూడా దారి తీస్తాయి. ఛాతీ నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. కానీ వైద్యుడు మాత్రమే మీ ఛాతి నొప్పికి ఖచ్చితమైన కారణమేంటో చెప్పగలడు.

ఛాతి నొప్పి యొక్క లక్షణాలు - Symptoms of Chest Pain in Telugu

మేము పైన చెప్పినట్లుగా, మీరు అనుభవించే ఛాతీ నొప్పి వివిధ రకాలుగా ఉంటుంది. ఛాతీ నొప్పితో పాటు, మీరు క్రింది లక్షణాలను కూడా అనుభవించవచ్చు:

  • ఛాతీ ప్రాంతంలో బిర్రబిగుసుతనం (బిగుసుతనం) లేదా పట్టేసినట్లున్నఅనుభూతి.
  • ఛాతీ లో పూర్తిగా భారం అనిపించడం
  • నొప్పి మెడ, దవడ లేదా భుజం ప్రాంతాలకు వ్యాపించడం 
  • ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి భావన
  • పెరిగిన హృదయ స్పందన లేదా పెరిగిన గుండె లయల రేటు
  • భుజం నొప్పి
  • వ్యత్యాసమైన హృదయ స్పందన: ఈ స్థితిలో గుండె  వేగంగా, గట్టిగా, మరియు అక్రమపద్ధతిలో కొట్టుకుంటుంది.
  • వికారం
  • వాంతులు
  • జ్వరం (ఫీవర్) లేదా చలి
  • పసుపు-ఆకుపచ్చ కఫం లేదా శ్లేష్మంతో దగ్గు
  • ఊపిరి ఆడని స్థితి
  • తక్కువ (లో బ్లడ్ ప్రెషర్)  లేదా అధిక రక్తపోటు
  • చమటోడడం (డయపోరేసిస్) అనేది అమితంగా చమటలు పట్టడం. ఛాతీలో నొప్పి కారణంగానే ఇళ్ల ఎక్కువగా చమటలు పడతాయి.  
  • తలనొప్పి కూడా అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఛాతీ నొప్పి కల్గిన వ్యక్తి తెలివి తప్పి పడిపోవచ్చు (స్పృహ తప్పటం) .
  • సుస్తీ లేదా అలసట. అలసట వల్ల ఎలాంటి పని చేయలేక పోతారు.

డాక్టర్ని ఎప్పుడు చూడాలి?

మీరు క్రింది వ్యాధి లక్షణాలలో ఏదైనా సరే అనుభవించినట్లయితే, తక్షణమే వెళ్ళి డాక్టర్ని చూడండి. మీ పరిస్థితి తీవ్రంగా ఉంటే, మీ కుటుంబ సభ్యుల్లో లేదా స్నేహితుడికి చెప్పండి డాక్టర్ వద్దకు మిమ్మల్ని వెంటనే తీసుకెళ్లమని లేదా డాక్టర్ కు ఫోన్ చేసి వెంటనే పిలవమని చెప్పండి.

  • ఛాతీలో బిగుతు లేదా పట్టేస్తున్నట్లు అనిపించే తీవ్రమైన నొప్పి.
  • నొప్పి మీ మెడ, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది.
  • శ్వాసలో సమస్యలు లేక ఊపిరాడక పోవడం.
  • హఠాత్తుగా వచ్చే ఛాతీనొప్పి తీవ్రమైనదిగా ఉండచ్చు. మరియు మీ వైద్యుడు గతంలో సూచించిన ఔషధాలను తీసుకున్న తర్వాత కూడా ఛాతీ నొప్పి తగ్గకపోవడం జరగొచ్చు.
  • మైకము, ఆందోళన, విపరీతంగా చెమట పట్టడం, గందరగోళం మొదలైనవి.
  • నిరంతరంగా కొనసాగే ఛాతీ నొప్పి, తగ్గనే తగ్గకపోవడం జరిగినప్పుడు.
  • పడుకున్నా, ముందుకు వంగినా కూడా ఉపశమనం పొందని ఛాతీ నొప్పి.
  • చాలా తక్కువ రక్తపోటు లేదా అధిక రక్తపోటు.
  • చలి పట్టడం లేదా జ్వరం, దగ్గినపుడు పసుపు-ఆకుపచ్చ రంగుల్లో శ్లేష్మం పడటం.

ఛాతి నొప్పి యొక్క కారణాలు - Causes of Chest Pain in Telugu

ఎందుకు ఛాతీ నొప్పి జరుగుతుంది?

ఛాతీ ప్రాంతంలో ఊపిరితిత్తులు, గుండె, క్లోమం (పాంక్రియాస్), కడుపు, పిత్తాశయం, ఎముకలు, కండరాలు, నరములు మొదలైన అనేక అవయవ నిర్మాణాలు ఉన్నాయి. అందువల్ల ఛాతీ నొప్పి అనేది అంతర్గత పరిస్థితికి సంబంధించింది. పైన పేర్కొన్న అవయవాలకు ఏదైనా హాని, గాయము, సంక్రమణం, వాటిల్లో కణితి (గడ్డ) ఏర్పడినా లేదా ఇతరత్రా ఎలాంటి అసాధారణ మార్పులేర్పడ్డా కూడా ఛాతీనొప్పి రావచ్చు.

గుండె సమస్యలు

“ఆంజినా” అనే పదం ఛాతీలో వచ్చే పిండేసినట్లుండే నొప్పిని లేదా తీవ్ర ఒత్తిడితో కూడిన నొప్పిని నిర్వచించడానికి ఉపయోగించేది. అంతర్లీన గుండె సమస్యల కారణంగానే ఈవిధంగా ఛాతీలో నొప్పి సంభవిస్తుంది. ఆంజినా మరియు గుండెపోటు అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఆంజినా సంభవిస్తే అది గుండె జబ్బు యొక్క సంకేతం, అయితే, గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) అనేది తీవ్రమైన వ్యాధి, దీనికి అత్యవసర చికిత్స చేయకపోతే కూడా ప్రాణాంతకం కావచ్చు అంటే మనిషి వెంటనే చనిపొయ్యే ప్రమాదముంది.

  • వాపు (ఇన్ఫ్లమేషన్)
    వాపు పరిస్థితిలో శరీరం యొక్క ఏదైనా భాగం లేదా అవయవం ద్రవంతో చేరి ఊడుకుపోవడం, అలాగే రోగనిరోధక వ్యవస్థ కణాలు లేదా విదేశీ శరీర విషపదార్ధాల కారణంగా వాపులేర్పడ్డం. హృదయాన్ని చుట్టుముట్టి ఉండే తిత్తిలో కూడా వాపు సంభవించవచ్చు. దీన్నే గుండె నంజు లేదా  “పెరికార్డిటిస్” అని పిలుస్తారు, ఇది ఛాతీలో పదునైన నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి మెడ లేదా భుజం కండరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

  • అంటురోగం (ఇన్ఫెక్షన్)
    కొంతమందిలో, అంటుకొనే బ్యాక్టీరియా క్రిములు గుండె కండరాలకు అంటుకుని అంటువ్యాధికి దారి తీయచ్చు. అటువంటివాటిల్లో ఒకటే ఈ గుండె ‘కండరాల క్రిమిదోష అంటువ్యాధి’ లేదా ‘అక్యూట్ బాక్టీరియల్ ఎండోకార్డిటిస్”. మీరు శ్వాస పీల్చినా, తుమ్మినా లేదా దగ్గినా ఛాతీ నొప్పికి కారణమవుతుంది.

  • ప్రతిష్టంభన (అడ్డంకులు) 
    రక్తంలో కొవ్వు (కొలెస్ట్రాల్)  స్థాయిన ఎక్కువగా ఉంటే, గుండెకు రక్తము సరఫరా చేసే హృదయ ధమనుల గోడలపై కొవ్వు పేరుకుపోతుంది. అలా ధమనుల్లో కొవ్వు పెరిగి పెరిగి గుండెకు రక్త సరఫరాను అడ్డుకోవటానికి దారి తీస్తుంది. ఇది “హృద్దామని వ్యాధి’ లేదా  “కొరోనరీ ఆర్టరీ” వ్యాధి గా పిలువబడుతుంది. ఈ వ్యాధిలో, ఛాతీ నొప్పి సంభవిస్తుంది. ఎందుకంటే మీ గుండె కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది తద్వారా గుండె నొప్పికి కారణమవుతుంది. ఆ నొప్పి ఛాతీ లో ఒక కష్టతర పరిస్థితిని  అంటే ఒత్తిడితో కూడిన సంచలనాన్ని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి మెడ, దవడ, భుజం, లేదా చేతికి కూడా పాకుతుంటూ ఉంటుంది.(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్)

  • హృదయ కండరాలకు హాని
    గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోతే, ఇది గుండె కండరాలహానికి  దారితీస్తుంది. ఇది జరిగినప్పుడు, ఆంజినా దశలో కలిగే నొప్పికి సమానమైన నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఛాతీకి ఎడమ వైపున గాని సంభవిస్తుంది. ఇది ఆంజినా నొప్పి కంటే తీక్షణంగా ఉండి తీవ్రంగా పిండేస్తున్నట్టు లేదా అది మేస్తున్నట్టు ఉంటుంది.

  • జన్యుపరమైన రుగ్మత
    కొన్ని జన్యుపరమైన అవ్యవస్థల్లో గుండె యొక్క ఒక భాగంలో కండరాలు చాలా మందంగా మారవచ్చు. ఇది వ్యాయామం చేసేటపుడు లేదా తీవ్ర శారీరక శ్రమ కల్గిన  సమయంలో ఛాతీలో నొప్పికి కారణమౌతుంది. అంటే గాక ఊపిరాడక పోయే పరిస్థితిని కలుగజేస్తుంది. అలా గుండె కండరాల మందం అట్లే పెరుగుతూ పోతే గుండెకు రక్తం సరఫరాలో అంతరాయమేర్పడి గుండె పని చేయటం కష్టం అవుతుంది. ఫలితంగా, తరువాతి దశలలో, మైకము కమ్మడం, అలసట, మూర్ఛ మొదలైనవాటిని ఎదుర్కోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, గుండెపోటు కూడా రావచ్చు.

  • హృదయ నిర్మాణాలు పనిచేయకపోవడం
    కొన్నిసార్లు, గుండె యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణాలు సరిగ్గా పని చేయకపోవచ్చు. ఉదాహరణకు, మన గుండెకు ఎగువ మరియు దిగువ గదుల మధ్య రక్తాన్నిసరఫరా చేసే ప్రధాన రక్తనాళాల మధ్య కూడా కవాటాలు ఉన్నాయి. ఈ కవాటాలు రక్తం యొక్క అక్రమ ప్రవాహాన్న నిరోదించి రక్తం ఒక దిశలోనే  ప్రవహిస్తుంచేందుకు సహాయ పడతాయి. ద్విపత్ర కవాట భ్రంశం లాగా ఒక కవాటం (వాల్వ్) పనిచేయకపోతే, అది పూర్తిగా మూసివేయదు, రక్తం సరఫరా చేయడానికి గుండె గదిలో తగినంత ఒత్తిడి ఉండదు. ఈ కావాలట భ్రంశం (ప్రోలప్స్) తేలికపాటిదిగా ఉంటే, వ్యాధి ఏ లక్షణాలను చూపించకపోవచ్చు. తీవ్రమైన కేసుల్లో వ్యక్తి ఛాతి నొప్పిని అనుభవిస్తాడు, ఇది ఇతర లక్షణాలైనటువంటి తీవ్ర హృదయ కంపనం, తలతిప్పడం, కళ్ళు తిరగడాలతో ముడిపడి ఉంటుంది.

  • ధమని చినుగు
    కొన్ని సందర్భాల్లో, గుండె యొక్క ఒక ధమని (హృదయ ధమని) గోడ చినగొచ్చు.  దీన్నే’హృదయ ధమని ఛేదనం’ లేదా “కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్” అని పిలుస్తారు. బృహద్ధమని లేదా అవోర్తా-గుండె నుండి రక్తాన్ని శరీరానికి సరఫరా చేసే ప్రధాన రక్తనాళం. దీన్నే “బృహద్ధమని ఛేదనం” అంటారు. ఇది ఛాతీ కుహరంలో రక్తాన్ని నింపడానికి దారితీస్తుంది. ఈ రక్తస్రావం మరింత ఎక్కువవడంతో ఛాతీలో ఆకస్మికమైన తీవ్రనొప్పి ఏర్పడుతుంది. ఈ నొప్పి మెడ, మీద వెనుక లేదా ఉదరం (ఎముకలు మరియు పొత్తికడుపు మధ్య ప్రాంతం) లోకి కూడా తీక్షణంగా పాకుతుంది.

ఊపిరితిత్తుల సమస్యలు

  • వాపు 
    మన ఊపిరితిత్తులను కప్పే కండర పొరను ‘ప్లుయెరా’ (pleura)  అంటారు ‘ప్లుయెరా’లో ఏదైనా మంట పుట్టిందంటే అది కాస్త “పువురైటిస్’ అని పిలువబడే  వాపుకు దారి తీయవచ్చు. ఈ ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పి ఛాతీలో తీక్షణమైన నొప్పికి దారి తీస్తుంది. ఈ ఛాతీ నొప్పి  శ్వాసిస్తున్నపుడు, దగ్గుతున్నపుడు లేదా తుమ్ముతున్నపుడు వస్తుంటుంది.

  • ఇన్ఫెక్షన్
    కొన్నిసార్లు, మన ఊపిరితిత్తుల బ్యాక్టీరియా లేదా వైరస్ క్రిముల బారిన పడవచ్చు. ఇటువంటి పరిస్థితులలో మీరు ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు, ఇది ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పిని పోలి ఉంటుంది మరియు తుమ్మినపుడు, దగ్గినపుడు లేదా శ్వాసిస్తున్నపుడు ఛాతీలో రావడం జరుగుతుంది. న్యుమోనియాలో, ఛాతీ నొప్పి నిస్తేజంగా (dull) ఉంటుంది. ఈ ఛాతీ నొప్పి జ్వరం, దగ్గు, చలి వంటి ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, దగ్గినప్పుడు శ్లేష్మంతో పాటుగా చీము కూడా వస్తుంది. .

  • రక్తం గడ్డకట్టడం లేదా అడ్డుపడటం
    గడ్డకట్టిన రక్తం రక్తప్రవాహంలో ప్రవహించి ఊపిరితిత్తుల వరకు ప్రయాణించవచ్చు మరియు ఊపిరితిత్తులలోనే నిలిచిపోవచ్చు. ఈ రక్తం గడ్డకట్టడం అనేది పువురైటిస్’  లో లాగా కనిపించే తీవ్రమైన, పదునైన నొప్పికి దారి తీస్తుంది మరియు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మరియు శ్వాసిస్తున్నపుడు ఈ నొప్పి వస్తుంటుంది. ఈ ఛాతీ నొప్పి  కూడా జ్వరాన్ని కలిగించవచ్చు. తీవ్ర సందర్భాల్లో, వ్యక్తి షాక్ స్థితిని ఎదుర్కొంటాడు. ప్రాణాంతకమైన ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈస్థితిలో తగినంత ప్రాణవాయువు శరీరానికి సరఫరా చేయబడక పోవడంతో వివిధ అవయవాలకు హాని కలగొచ్చు. రక్తం గడ్డ కట్టడం అనేది గడ్డను తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స తర్వాత, లేదా లోతైన సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది.

  • గాయం
    ప్రమాదవశాత్తు గాయం లేదా ఛాతీకి అకస్మాత్తుగా దెబ్బ తగిలినప్పుడు, ఛాతీ కుహరంలోకి గాలి చేరుతుంది. ఈ పరిస్థితినే “న్యుమోథొరాక్స్” అంటారు. ఇది ఆకస్మిక మరియు పదునైన నొప్పిని కలిగిస్తుంది, ఈ ఛాతీ నొప్పి తరచుగా తక్కువ రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుంది.

  • అధిక రక్తపోటు
    గుండె యొక్క కుడి వైపుభాగం ఊపిరితిత్తుల నుండి రక్తం సరఫరాని పొందుతుంది. అందువల్ల, ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు మూలంగా గుండె కుడి వైపున పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీన్నే ‘పల్మోనరీ హైపర్వెంటిలేషన్’ అంటారు. ఈ పరిస్థితిలో అనుభవించిన ఛాతీ నొప్పి ఆంజినానొప్పికి సమానంగా ఉంటుంది.

  • వ్యాధి లేదా అలెర్జీ
    మీరు ఉబ్బసం వంటి వాయుమార్గ వ్యవస్థలో వ్యాధి లేదా అలెర్జీ ఉన్నట్లయితే మీరు ఛాతీ నొప్పిని కూడా అనుభవించవచ్చు. ఈ నొప్పి తరచుగా గుర్రుగుర్రుమని శ్వాసలో శబ్దం చేయడం, శ్వాస తీసుకోలేకపోవడం, ఆస్తమా, గురక మరియు శ్వాసక్రియలో అసౌకర్యం వంటి లక్షణాలని కలిగి ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ యొక్క సమస్యలు

  • పుండ్లు (పూతలు)
    కడుపు గోడల పొరల్లో పుళ్ళు గనుక ఉంటే వాటినే ‘కడుపు పూతలు’ అని పిలుస్తారు. ఈ పుండ్ల కారణంగానే ఛాతీ ప్రాంతంలో నొప్పి మరియు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటారు. నొప్పి తరచుగా తీవ్రమైందిగా ఉండి మంటతో కూడుకొని ఉంటుంది.

  • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి
    మీ కడుపులోనికి చేరిన ఆహారం తిరిగి అన్నవాహిక లోకి ఆమ్లంతో కలిసి  ప్రవహించినట్లైతే తొందర కల్గుతుంది, ఈ తొందరనే “గ్యాస్ట్రోఎసోఫాగియల్ రెఫ్లక్స్” వ్యాధి (GERD) అని పిలుస్తారు. ఇలా కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవేశించినపుడు ఛాతీ దిగువన కేంద్ర ప్రాంతంలో కడుపు నొప్పి, మంట,  గుండె మంటను కలుగజేస్థాయి.

  • అన్నవాహిక (ఎసోఫాగస్) సమస్య
    అన్నవాహిక (ఎసోఫాగస్) కండరాలలో సమస్య అన్నవాహిక (ఎసోఫాగస్) యొక్క కండరాలు ఏకకాలంలో సంకోచించకపోతే లేదా ఎక్కువగా సంకోచించినా ఛాతీ మధ్యలో నొప్పిని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి సాధారణంగా ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం గొంతులో దిగుతున్నపుడు మంట పుట్టి నొప్పి ఏర్పడుతుంది.

  • వాపు
    మీ క్లోమము లేదా పిత్తాశయం వాపు కలిగి ఉంటే, అది చాలా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. క్లోమానికి సంబంధించిన నొప్పి అయితే చాతీకి ఎడమ వైపున నొప్పిస్తుంది. పిత్తాశయానికి సంబంధించినదైతే నొప్పి కుడి వైపున ఉంటుంది. ఇది ఛాతీ మధ్యలో కూడా నొప్పి వస్తుంది మరియు అదే శరీరం యొక్క ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చు. నొప్పి పదునైనదిగాను మరియు తీవ్రమైనదిగాఉంటుంది. ముందుకు వంగడం ద్వారా క్లోమం నొప్పి నుంచి శమనం (రిలీఫ్) పొందవచ్చు. .

  • హైపర్సెన్సిటివిటీ/అతిసున్నితత్వం
    కొన్నిసార్లు, అన్నవాహిక (ఎసోఫ్యాగస్) పై ఒత్తిడి లేదా ఆమ్ల (పులుపు) పదార్థాలు తాకిడి కాస్త ఎక్కువైనా అన్నవాహిక అతిసున్నితత్వంతో బాధాకరంగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితినే అన్నవాహిక అతిసున్నితత్వం లేదా ఎసోఫాగియల్ హైపర్సెన్సిటివిటీ అని పిలుస్తారు.

  • అన్నవాహికలో పగుళ్లు  
    తీవ్రమైన వాంతుల సందర్భాల్లో లేదా ఏదైనా ఆపరేషన్ (శస్త్రచికిత్స) చేయించుకున్న తర్వాత, అన్నవాహిక ఛిద్రం అవచ్చు. అంటే పగలవచ్చు. ఇది ఛాతీ లో ఆకస్మికమైన మరియు పదునైన నొప్పికి కారణమవుతుంది.

  • హెర్నియా (వరిబీజం)  
    ఆహారం తిన్న తర్వాత పొట్ట తనకు తానుగా ఛాతీ దిగువ ప్రాంతంలోకి  నెట్టివేయబడుతుంది. ఈ పరిస్థితిని వివరించడానికే ‘హియాటల్ హెర్నియా’ పదాన్ని ఉపయోగించడమైనది. దీన్నే ‘వరిబీజం దిగబడింది లేదా బుడ్డ దిగింది అంటారు. ఈ పరిస్థితి కారణంగా, ఛాతీలో భారం, నొప్పి, తీవ్ర అసౌకర్యం కలగొచ్చు.

  • ఎపిగ్లోటిటీస్
    ఇది చాలా అత్యవసర పరిస్థితి. మీ బేబీ యొక్క శ్వాసనాళికకు అంతరాయం లేదా అడ్డు ఏర్పడడం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో శిశువు శ్వాస పీల్చలేకపోవడం, అధిక జ్వరం, ఛాతీ నొప్పి, చాలా విపరీతంగా గొంతు నొప్పి వంటి లక్షణాలుంటాయి ఈ లక్షణాలన్నీ మింగడంలో కష్టపడటానికి కూడా కారణం కావచ్చు.

అస్థిపంజర కండర (మస్క్యులోస్కెలెటల్) సమస్యలు

అస్థిపంజరం పక్కటెముకలలోని కండరాల్లో బెణుకు సంభవించినా లేదా పక్కటెముకలు విరిగినా ఛాతీ నొప్పి కలుగుతుంది. ఈ రకం నొప్పి పదునైనదిగా, తీవ్రమైనదిగా ఉంటుంది. మరియు నొప్పి గాయం లేదా ఎముక విరిగిన ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. .

ఛాతీ గోడల నొప్పి లేదా ‘కోస్టోకోండ్రిటిస్’ పరిస్థితి ఎలాంటిదంటే ఛాతీ ఎముకలను కలుపుతున్న కణజాలానికి వాపు ఏర్పడినపుడు అది తీవ్ర ఛాతీ నొప్పికి కారణమవుతుంది. ఛాతీ గోడల నొప్పి లేదా కోస్టోకోండ్రిటిస్ అనేది శిశువులలో సంభవిస్తుంది. ఈ నొప్పి పొడి దగ్గుతో కలిపి వస్తూ ఉంటుంది.

నరాల సమస్యలు

ఛాతీలోని నరాలకు గాయం లేదా అంటువ్యాధి సోకినపుడు వెన్నెముక ప్రాంతంలో గాని, రొమ్ము లేదా ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్) ఏర్పడి ఛాతీలో నొప్పి రావడం సాధారణం. . ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్గు) విషయంలో వరిసెల్లా-జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమణం కారణంగా నరాలతో సంభవిస్తుంది. ఇది ఛాతీ, భుజం, మరియు వెనక భాగంలో తీవ్ర నొప్పిని కలిగిస్తుంది. తరచుగా నరాల పక్కన ప్రాంతంలో ఈ దద్దుర్లు (rashes) ఏర్పడుతుంటాయి.

ప్రమాద కారకాలు

క్రిందిచ్చిన కొన్ని కారకాలు ఛాతీ నొప్పికి లోనయ్యేలా చేస్తాయి.

  • ధూమపానం.
  • అధిక సురాపానం (సారాయి/ఆల్కహాల్ తీసుకోవడం).
  • ఊబకాయం (అధిక బరువు)
  • రోగనిరోధక వ్యవస్థలో లోపాలు కారణంగా అంటురోగాల భారిన పడేలా చేస్తుంది.
  • రక్తంలోని సిరలలో ఉండే అధిక కొవ్వు (కొలెస్ట్రాల్) కారణంగా హృదయ ధమని నిరోధకత (coronary artery blockage) ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అధిక రక్తపోటు మన గుండె మీద మరింత శ్రమను పెంచుతుంది.
  • శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం లేక శారీరక శ్రమ తగినంత లేకపోవడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ లేకపోవడం అనేది మొత్తం శరీరానికే ప్రతికూల ప్రభావం కలుగజేస్తుంది.
  • అనారోగ్యకరమైన చిరు తిండ్లు (‘జంక్ ఫుడ్’) తినడం మూలాన గుండె సమస్యలు  మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలుగజేస్తాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

ఛాతి నొప్పి యొక్క నివారణ - Prevention of Chest Pain in Telugu

జన్యుపరమైన లేదా అలెర్జీపరమైన కారణాలు మినహాయిస్తే ఛాతీ నొప్పిని కలుగజేసే మిగతా చాలా కారణాలను నివారించవచ్చు.

ఛాతీ నొప్పి నివారణకు తీసుకోవాల్సిన చర్యల జాబితా కింది విధంగా ఉంది:

  • వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోండి
    మీరు వ్యక్తిగత పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు, న్యుమోనియా, క్షయవ్యాధి మొదలైన అనేక వ్యాధులను నిరోధించవచ్చు.

  • ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
    ఆరోగ్యకరమైన శరీరం కల్గి ఉండాలంటే సరైన ఆహారం తినాలి మనం. బలమైన రోగనిరోధకత కేవలం ఒక రోజులోనే నిర్మించబడదు. ముఖ్యమైన నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి అవసరమైన కీలకమైన పోషకాలను ఎల్లప్పుడూ తినడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం మనదవుతుంది. హృదయసంబంధమైన వ్యాధులు, అధిక రక్తపోటు, గుండె ధమనుల్లో అడ్డుకోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం మొదలైన రక్తనాళాల వ్యాధులను నివారించడానికి తక్కువ-కొవ్వున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

  • మద్యం తీసుకోవడం పరిమితం చేయండి మరియు ధూమపానం ఆపండి
    ధూమపానం మానేసి సారాయి తాగడం పరిమితం చేసినట్లయితే అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల, గుండె మరియు కాలేయ వ్యాధులను మరియు ధూమపానంతో సంబంధం ఉన్న క్యాన్సర్లను నిరోధిస్తుంది.

  • మీకొచ్చిన జబ్బు అంటువ్యాధి అని అనుమానించినట్లయితే ఇంట్లో పుష్కలమైన విశ్రాంతి తీసుకోండి
    ఔషధసేవనంతో పాటు ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటే, మీ శరీరంలోని జబ్బు  వేగంగా నయం అవుతుంది.

  • రోజూ వ్యాయామం చేయండి  
    నిత్య వ్యాయామం మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ గుండె మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది, మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. రోజూ శారీరక కసరత్తు చేయడం వల్ల వ్యాధులు నివారించబడడమే కాకుండా ఆవ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేటందుకు శరీరానికి శక్తి కల్గుతుంది. .

  • ఆరోగ్యకరమైన శరీర బరువు ఉండేట్లు చూసుకోండి
    గుండె, జీర్ణ వ్యవస్థ, క్లోమం మరియు పిత్తాశయాలకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో ఆరోగ్యకరమైన బరువు చాలా ముఖ్యం.  

  • ఏవైనా అసాధారణ ఆరోగ్య పరిస్థితులు లేదా వ్యాధులను దరి చేరనీయకుండా ఉండేందుకు ప్రతి 6 నెలలకు ఒక సాధారణ రక్త పరీక్షను చేయించుకోండి.

  • మీరు ఆరోగ్యవంతులని మరియు ఎలాంటి వ్యాధులు లేనివారని నిర్ధారించుకోవడానికి సంవత్సరంలో ఒకసారి పూర్తి శరీరాన్ని వైద్య పరీక్షల సాయంతో తనిఖీ చేయించుకోండి.

  • మీకు ఛాతీలో ఎలాంటి అసాధారణ లక్షణాలు లేక అసౌకర్యం కలిగినా డాక్టర్ కు చూపించండి.

ఛాతి నొప్పి యొక్క వ్యాధినిర్ధారణ - Diagnosis of Chest Pain in Telugu

మేము పైన చెప్పినట్లుగా, మీ ఛాతీనొప్పిని కేవలం ఓ డాక్టర్ మాత్రమే సరిగ్గా విశ్లేషించగలడు. అందువల్ల, మీ ఛాతీ నొప్పిని ఏమాత్రం విస్మరించకూడదని మేము కోరుతున్నాము. ఎందుకంటే మీ ఛాతీనొప్పి వెనుక చికిత్స అవసరమైన ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి దాగి  ఉండటానికి అవకాశాలు ఉన్నాయి.

మీ ఛాతీ నొప్పి నిర్ధారణ అనేది మీపై జరిపే వైద్య పరిశోధనలు  లేదా డయాగ్నొస్టిక్ పరీక్షల కన్నా ఎక్కువగా వివరమైన మీ ఆరోగ్య చరిత్ర, భౌతిక పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఛాతీ నొప్పి యొక్క నిర్ధారణ క్రింది దశలను కలిగి ఉంటుంది:

వైద్య చరిత్ర

మీ ఛాతీ నొప్పి యొక్క కారణాన్ని నిర్ధారించడంలో మీకున్న వైద్య చరిత్ర చాలా ముఖ్యమైన దశ అయినందున, మీ వైద్యుడు పలు ప్రశ్నలను అడుగుతాడు మరియు ఏవైనా రోగనిర్ధారణ పరీక్షకు సలహా ఇచ్చే ముందు మీ ఛాతీ ప్రాంతం యొక్క శారీరక పరీక్షను నిర్వహిస్తారు.

మీ ఛాతీ నొప్పి, మీ ఆరోగ్య స్థితి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి కింద తెలిపినటువంటి పలు ప్రశ్నల్ని వైద్యుడు మిమ్మల్ని అడగవచ్చు. :

  • మీ నొప్పిని వివరించండి?
  • నొప్పి ఎప్పుడు సంభవించింది?
  • ఛాతీలో ఏ ప్రాంతంలో మీకు నొప్పి వస్తోంది?
  • చాతీ నొప్పి ఎంతసేపు ఉంటుంది?
  • చాతీ నొప్పి మీ శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాపిస్తుందా?
  • శారీరక శ్రమ తర్వాత మీకు చాతీ నొప్పి వస్తోందా?
  • మీకు  జ్వరం, చలి, వాంతి వికారం, మైకము, చెమట, రక్తం లేదా చీముతో కూడిన దగ్గు, నోటిలో చేదు రుచి వంటి ఇతర లక్షణాలు ఉన్నాయా?
  • మీరు శ్వాసించినపుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు మీకు ఛాతీ నొప్పి వస్తోందా?
  • మీ ఛాతీ ప్రాంతాన్ని నొక్కినప్పుడు ఛాతీ నొప్పి మరింత తీవ్రంగా ఉందా?
  • ఆహారం తిన్నాక ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది? ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది?
  • మీ ఛాతీనొప్పి ఏవిధంగా తీవ్రమవుతుంది?
  • ఛాతీ నొప్పి వచ్చినపుడు ఔషధాలను తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, కింద పడుకోవడం వంటివి చేసినపుడు నొప్పిలో ఉపశమనం కల్గుతోందా?
  • మీకు ఛాతీ నొప్పి ఉన్న ప్రాంతంలో దద్దుర్లు ఏమైనా ఉన్నాయా?
  • మీరు ఇటీవల గాని లేదా గతంలో గాని గాయపడ్డారా?
  • మీరు అధిక రక్తపోటు, మధుమేహం, క్షయ, కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి వంటి ఏవైనా జబ్బుల కారణంగా బాధపడుతున్నారా?
  • మీరు మీ ఛాతీ ప్రాంతంలో ఏదేని శస్త్రచికిత్స చేయించుకున్నారా?

శారీరక పరీక్ష

  • మీ వ్యాద్ధి యొక్క వివరణాత్మక చరిత్ర తీసుకున్న తర్వాత, మీ వైద్యుడు మీ శారీరక పరీక్షను ఈ క్రింది విధంగా నిర్వహిస్తారు:
  • ప్రాణాధార సంకేతాలు: ఒక వ్యక్తి యొక్క ముఖ్యమైన శరీర విధుల యొక్క స్థితిని సూచించే క్లినికల్ కొలతలు. వీటిలో గుండె లయల రేటు, నాడి రేటు లేదా పల్స్ రేటు, రక్తపోటు, శ్వాస రేటు మరియు శరీర ఉష్ణోగ్రత ఉన్నాయి.
  • మీ వైద్యుడు బృహద్ధమని విభజన (aortic dissection) కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు మీ రెండు చేతుల్లో రక్తపోటుని కొలుస్తారు.
  • మీ గుండె మరియు శ్వాస శబ్దాలను కూడా స్టెతస్కోప్ ఉపయోగించి మీ డాక్టర్ తనిఖీ చేస్టారు.
  • దీని తరువాత మీ ఛాతీ చర్మంపై దద్దుర్లు, గాయం లేదా బాధకారకాలైన మరేవైనా గాయాలు, నొప్పి లేదా ‘ఫట్’ మని విరుగుడు ధ్వని ఏమైనా ఉన్నాయా అని ఛాతీ నొప్పి ఉన్న చోట నొక్కడం ద్వారా పరీక్షిస్తారు. ఇంకా, శ్వాస తీసుకున్నపుడు మీ ఛాతీ సాధారణంగానే  విస్తరిస్తుందా లేదా మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు మీకేమైనా ఛాతీ నొప్పి కల్గుతోందా అన్నవాటిని పరీక్షిస్తారు.

విశ్లేషణ పరీక్షలు

మీ ఛాతీ నొప్పిని నిర్ధారించడానికి కింది పరీక్షలు జరుపబడతాయి:

  • బ్లడ్ టెస్ట్
    ఈ పరీక్షలో, మీ శరీరం నుండి రక్తం యొక్క నమూనా తీసుకోబడుతుంది. ఈ రక్త పరీక్ష మీ రక్తకణాల సంఖ్య ను, గుండె (హృదయము) ఎంజైమ్లు (క్వి న్నం లేదా దోహక పదార్ధం)  మరియు ప్రోటీన్ల సంఖ్యను అంచనా వేస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుదల అంటురోగం (సంక్రమణ) యొక్క ఉనికిని సూచిస్తుంది. రక్తప్రవాహంలో హృదయ ఎంజైములు మరియు హృదయ ప్రోటీన్ల ఉనికి గుండెకు హానిని సూచిస్తుంది. రక్త ప్రసరణలోకి వీటి విడుదల గుండెకు ప్రమాద సూచికే. రక్త ప్రసారంలో ఈ హృదయ ఎంజైములు మరియు ప్రోటీన్ల ఉనికి భవిష్యత్తులో గుండెపోటుకు ప్రమాద సూచికేనాని వైద్య నిపుణుల హెచ్చరిక.

  • కఫం పరీక్ష
    మీకు ఛాతీ నొప్పితో పాటుగా తడిదగ్గు (శ్లేష్మంతో కూడిన దగ్గు) కూడా ఉంటే, దగ్గులో పడే కఫాన్ని (మీ వైద్యుడు) వైద్యతనిఖీ నిమిత్తం సేకరించవచ్చు. ఈ కఫ పరీక్ష ద్వారా న్యుమోనియా, క్షయవ్యాధి వంటి తీవ్రమైన అంటువ్యాధులేమైనా సోకినాయా  అని పరీక్షిస్తారు. అంటువ్యాధి (సంక్రమణం) ఉన్నట్లయితే, మీకు సోకిన ఆ అంటువ్యాధి (సంక్రమణ) రకాన్ని, దాని తీవ్రతను కఫ పరీక్ష లెక్క కడుతుంది. ఈ శ్లేష్మం లేదా గవదబిళ్ళ నమూనాను బాక్టీరియా పెరిగే ఒక ప్లేట్ మీద ఉంచబడుతుంది. న్యుమోనియా, క్షయవ్యాధి వంటి తీవ్రమైన సంక్రమణం ఉన్నట్లయితే, ఈ బ్యాక్టీరియాను సూక్ష్మదర్శిని (కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు,  పదార్ధాలను పెద్దవిగా చూపించే పరికరం) కింద పరీక్షించబడతాయి.

  • బ్రోన్కోస్కోపీ
    ఈ పరీక్షలో, కాంతివంతమైన వెలుగు ఆధారంతో కూడిన సూక్ష్మ కెమెరా కల్గిన ఒక సన్నని ట్యూబ్ ను వైద్యుడు ఉపయోగిస్తాడు. దీనినే ‘బ్రోన్కోస్కోప్’ అని పిలుస్తారు. మీ నోరు లేదా ముక్కు ద్వారా ఈ ట్యూబ్ విడువబడుతుంది. బ్రోన్చోస్కోపీ మీ వాయుమార్గ (శ్వాసనాళం) వ్యవస్థ యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇంకా ఈ పరీక్ష మీ శ్వాసనాళంలో వాయుప్రసరణ, బ్రోంకస్ (ట్రాచీ మరియు ఊపిరితిత్తుల మధ్య ఉండే వాయుమార్గం యొక్క భాగం) మరియు ఊపిరితిత్తులలో రక్తస్రావం, గడ్డలు, కణితుల వంటి , లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. శ్వాసనాళం లోతు భాగాలలో నుండి కఫము (శ్లేష్మం), సేకరించడానికి, ప్రత్యేకంగా పిల్లలలో,  ఈ పరికరాన్ని వైద్య నిపుణులు ఉపయోగిస్తారు.

  • ఛాతీ X- రే
    ఛాతీ X- రేలు ఊపిరితిత్తులు లేదా గుండె వంటి ఛాతీ అవయవాలు అసాధారణంగా విస్తరించడం, మీ శ్వాసనాళం (విండ్పైప్) యొక్క విచలనం (deviation), మీ పక్కటెముకల పగులు, అంటువ్యాధి (సంక్రమణ) ఉన్నట్లయితే, మరేదైనా అనుమానాస్పద ప్రాంతం మొదలైనవాటిని గుర్తించడంలో ఉపయోగపడుతుంది.

  • CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్మీ
     ఛాతీ ప్రాంతంలో CT స్కాన్ అంతర్గత అవయవాలకు స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇది కడుపు, పిత్తాశయం, కాలేయం, మరియు క్లోమం వంటి అవయవాల  అసాధారణ వాపును, పిత్తాశయ రాళ్లు, ఊపిరితిత్తులలో ఏవైనా మార్పులు లేదా వీటి యొక్క అసాధారణ వాపును గుర్తించడంలో ఉపయోగపడుతుంది.

  • ECG
    ECG పరీక్ష గుండె యొక్క లయ మరియు గుండె లయల రేటు సాధారణంగా ఉందా లేదా అని తనిఖీ చేసేందుకు చేసే ఒక వైద్య పరీక్ష. ఇది హృదయానికి ఎలాంటి నష్టం కలిగించగలదు. ఈ విధానంలో, ఒక జెల్ మీ ఛాతీ మరియు కొన్నిసార్లు మీ చేతులు, కాళ్ళుకు పూస్తారు. తర్వాత సెన్సార్లు (ఎలక్ట్రోడ్లు అని పిలుస్తారు) ద్వారా మీ గుండె యొక్క చర్యలను రికార్డు చేస్తారు.

  • ఎఖోకార్డియోగ్రఫీ
    గుండె, దాని నిర్మాణాలు మరియు అది నిర్వర్తించే రక్తం పంపింగ్ సాధారణంగానే ఉందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయడానికి ఎఖోకార్డియోగ్రఫీ పరీక్ష చేస్తారు.

  • క్యాతిటరైజేషన్
    గుండెను పరిశీలించడానికి ఒక ‘కాథెటర్’ ను ఉపయోగించి చేసే పరీక్ష ఇది. ఇదో గొట్టపు పరికరము. ఈ ప్రక్రియలో, కాథెటర్ ను గుండె వద్దకు పంపేందుకు మీ చేతి లేదా కాలిలో ఉన్న మీ రక్తనాళాల ద్వారా జొప్పించి హృదయాన్ని చేరుకొనేలా చేస్తారు. హృదయంలో ప్రవేశించే కాథెటర్లో ఒక రంగు (dye) కూడా  చొప్పించబడుతుంది అటుపై మరియు X-రే కిరణాలు తీసుకోబడతాయి. ధమనులలో ఏవైనా అడ్డంకులను గుర్తించడంలోనూ, సరైన శస్త్రచికిత్సా విధానాన్ని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది.

  • ఆంజియోగ్రఫీ
    కరోనరీ ఆంజియోగ్రఫీ లేదా అర్టెరియోగ్రఫీ అనే ఈ ప్రక్రియలో రక్తంలో ఓ రంగు (dye) చేర్చబడుతుంది. ఈ రంగు కలిపినా రక్తం హృదయానికి చేరినప్పుడు, X-రే  కిరణాలు గుండె యొక్క ధమనుల (కరోనరీ ధమనులు) యొక్క స్పష్టమైన చిత్రాన్ని చూపిస్థాయి. ఇది అడ్డంకుల ఉనికిని గుర్తించడానికి సహాయపడుతుంది.

  • న్యూక్లియర్ స్కాన్
    ఈ విధానంలో ఒక రేడియోధార్మిక పదార్థం (తేలికపాటి వికిరణాన్ని విడుదల చేసే పదార్థాలు) రక్తప్రవాహంలో చొప్పించబడుతుంది. గుండె ద్వారా రక్తం యొక్క ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి ఈ ఇమేజింగ్ విధానం పరీక్ష చేయబడుతుంది.

ఛాతి నొప్పి యొక్క చికిత్స - Treatment of Chest Pain in Telugu

ఛాతీ నొప్పి చికిత్స అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటుంది, మరియు ఇది మందులు, శస్త్రచికిత్స మరియు జీవనశైలి మార్పులను కలిగి ఉంటుంది.

మందులు

  • నొప్పి నివారణలు మరియు వాపు నిరోధక మందులు
    ఛాతీనొప్పికి అంతర్లీన కారణం వాపు అయితే అంటే అంతర్గత అవయవాలైన కడుపు, పిత్తాశయము, క్లోమము, పక్కటెముక మృదులాస్థులు వంటి వాటి వాపు అయితే మీ వైద్యుడు మీ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మరియు వాపును  తగ్గించడానికి కొన్ని మందులను సూచించవచ్చు.

  • యాంటీబయాటిక్స్ మరియు యాంటివైరల్స్
    మీ ఛాతీ నొప్పికి మూల కారణం అంటువ్యాధి (సంక్రమణం) అయితే  యాంటీబయాటిక్స్ మరియు యాంటివైరల్స్ మందులు ఇవ్వబడుతాయి. ఈ మందులవల్ల అంటువ్యాధి తగ్గిన వెంటనే మీ ఛాతీ నొప్పి కూడా తాగుతుంది. వాపు మరియు నొప్పిని తగ్గించడానికి యాంటిబయోటిక్స్ సాధారణంగా నొప్పి నివారిణులు మరియు వాపు నిరోధక మందులతో పాటు సూచించబడతాయి. న్యుమోనియా, ప్యాంక్రియాటైటిస్, షింగిల్స్, పెప్టిక్ పూతల, కోలేసైస్టిటిస్ (పిత్తాశయం యొక్క వాపు) మొదలైన వ్యాధుల చికిత్సకు ఇది సహాయపడుతుంది.

  • ఆంటీప్లేట్లెట్ (Antiplatelet) మందులు
    రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసారానికి అడ్డంకి ఏర్పడి తద్వారా ఛాతీ నొప్పి వచ్చినపుడు ఈ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులు రక్తం గడ్డ కట్టడాన్ని నివారించేందుకు, తద్వారా రక్త ప్రసారంలో అడ్డంకుల్ని తొలగించేందుకు సహాయపడుతాయి. ఉదాహరణకు,ఆస్పిరిన్.

  • రక్తాన్ని పలుచబరిచే మందులు
    ఈ మందులు ‘ఆంటీకాగులెంట్లు’ అని కూడా పిలువబడుతాయి. రక్తాన్ని పలుచబరిచి అది గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తంలో ఇప్పటికే గడ్డలు కట్టి ఉంటే, ఆ గడ్డలు మరింత పెరగకుండా అంటే వాటి పరిమాణం పెరక్కుండా నివారిస్తుంది.

  • రక్త గడ్డల్ని కరిగించే మందులు   
    ఈ మందులు ‘ట్రంబోలైటిక్ ఏజెంట్లు’ అని కూడా పిలువబడుతాయి. గుండె నరాల్లో ఇప్పటికే రక్తం ఘనీభవించి గడ్డలుగా మారినవాటిని ఈ మందులు కరిగిస్తాయి. ఉదాహరణకు ఆ మందులేవంటే హెఫా రిన్, వార్ఫారీన్.

  • గుండె కండరాలకు మందులు
    డిజిటాలిస్ అనే మందు గుండె కండరాలు చురుగ్గా పని చేసేందుకు మరియూ గుండె రక్తాన్ని మరింత సమర్థవంతంగా తోడేందుకు (pumping) సహాయపడుతుంది. ఈ  మందు గుండె లయను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

  • ACE (యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్) నిరోధకాలు
    ఈ మందులు రక్తం ఒత్తిడి అధికంగా ఉన్నవారికి ఉపయోగకరమైనవి. ఈ మందులు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) యొక్క చర్యను నిరోధిస్తాయి.  మరియు రక్త నాళాలు ముకుళించుకుని ఇరుకై పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తనాళం ముకుళించుకుని పోయి ఇరుకయ్యేందుకు కారణమయ్యే హార్మోన్ ల (యాంజియోటెన్సినోజెన్ ల) ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ హార్మోన్లను నిరోధిస్తే రక్తపోటు అధికంగా ఉన్న వ్యక్తులలో రక్తపోటు (బిపి) తగ్గిపోతుం ది. గుండె రక్తాన్ని సమర్ధవంతంగా (పంప్) తోడడంలో ఈ మందులు సహాయపడతాయి.

  • బీటా-బ్లాకర్స్
    ఈ మందులు రక్తపోటును తగ్గించి గుండె పైని పని భారాన్ని తగ్గిస్తాయి. అసంబద్ధ గుండె లయను తప్పించి రెండో సారి గుండెపోటు రాకుండా కాపాడుతాయి ఈ మందులు.

  • నైట్రోగ్లిసరిన్ లేదా నైట్రేట్స్
    ఈ మందులు రక్తనాళ గోడలలోని కండరాలను సడలించడం ద్వారా బాధిస్తున్న ఛాతీ నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

  • కాల్షియం ఛానల్ బ్లాకర్స్
    ఈ మందులు నైట్రోగ్లిజరిన్ మాదిరిగానే పనిచేస్తాయి మరియు రక్తపోటు మరియు ఛాతీ నొప్పి చికిత్సకు ఉపయోగపడతాయి

  • డయూరెటిక్స్ మందులు (అతిమూత్రవిసర్జనకారకాలు)
    శరీరం నుండి ద్రవాలు మరియు లవణాలను తొలగించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో ఈ మందులు సహాయపడతాయి. అందువల్ల వీటిని "నీటి మాత్రలు" అని కూడా పిలుస్తారు. ఈ మందులు గుండె మీది పనిభారాన్ని తగ్గించి, గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.

  • కొలెస్ట్రాల్ ని-నియంత్రించే మందులు
    ఈ మందులు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లు లేదా’ చెడు కొవ్వుల’ స్థాయిని తగ్గిస్తాయి. లిపోప్రొటీన్ లనే ‘చెడ్డ కొలెస్ట్రాల్’ అని కూడా అంటారు. ఈ మందులు గుండె యొక్క ధమనులలో ఏర్పడే అడ్డంకుల్ని తగ్గిస్తుంది.

శస్త్రచికిత్స (సర్జరీ)

మీ ఛాతీ నొప్పికి గల మూల కారణము రక్త నాళాల అవరోధాలు, రక్తం గడ్డకట్టడం, పిత్తాశయ రాళ్ళు లేదా అవయవాలు దెబ్బతినటం వలన అయితే, మీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.ఆ శస్త్రచికిత్సలు ఏవంటే కోలిసిస్టెక్టోమీ, ప్యాంక్రియాటెక్టోమీ, రిబ్ ఫ్రాక్చర్ రిపేర్, కరోనరీ ఆంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్, కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG), గుండె కవాటాల భర్తీ, గుండె మార్పిడి, పేస్ మేకర్ పెట్టే శస్త్రచికిత్స మొదలైనవి. ఈ శస్త్రచికిత్సల్లో ఏవి సముచితమో వైద్యుల సలహా మేరకు చేయించుకోవలసి ఉంటుంది..

  • కోలలెసిస్టెక్టోమీ
    వ్యాధికి గురైన పిత్తాశయం యొక్క తొలగింపు.

  • క్లోమం శస్త్రచికిత్స లేదా ప్యాంక్రియాటమీ
    వ్యాధికి గురైన క్లోమం (పాంక్రియా) యొక్క బాధిత భాగం లేదా మొత్తాన్ని తొలగించడం.

  • రిబ్ ఫ్రాక్చర్ రిపేర్
    విరిగిన పక్కటెముక యొక్క భాగాలను అతికించి మరమ్మతు చేయడం.

  • న్యుమోథొరాక్స్ కు శస్త్రచికిత్స
    ఈ శస్త్ర  చికిత్స ‘ప్లెరోడెసిస్’ (శ్లేష్మపటలం/ శ్లేష్మస్తరం లేదా ప్లేవురాను అతికించడం) ఆపరేషన్, శ్లేష్మ పటలాన్ని రాపిడి చేయడం (ఊపిరితిత్తులకు శ్లేష్మస్తరాన్ని అతికించేందుకు శ్లేష్మస్తరాన్ని (ప్లూరాను) రుద్దడం), ప్లేఉరెక్టమీ (శ్లేష్మస్తరం తొలగింపు, తద్వారా ఊపిరితిత్తులు ఛాతీ గోడకు అతుక్కుంతాయి.) మొదలైనవి ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలు అన్నీ శ్లేష్మ పొరల మధ్య గాలి లేదా ద్రవం గుమిగూడడాన్ని అరికడతాయి.

  • కరోనరీ ఆంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్
    స్టెంట్ (ట్యూబులాంటిది) ట్యూబ్ గుండెకు చేరుకోవడానికి చేతి లేదా కాలు యొక్క ధమనిలో చేర్చబడుతుంది మరియు ప్రారంభంలో ధమనిని నిరోధించిన ఫలకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక చిన్న ఊపిరిబుడ్డ (లేదా బెలూన్) ఉపయోగించబడుతుంది.

  • కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్:
    నిరోధించబడిన ధమనికి ఒక ఆరోగ్యకరమైన రక్తనాళాన్ని కలుపుతారు లేదా అంటుకట్టబడుతుంది అంటే కలుపుతారు. దీనివల్ల, గుండె రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) యొక్క అడ్డంకిని (బ్లాక్ చేయబడిన ప్రాంతాన్ని) తప్పించుకుంటుంది ఇలా ఆరోగ్యకర రక్తనాళాన్ని ధమనికి కలిపి రక్తాన్ని గుండెకు ప్రవహించుటకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరుస్తుంది.

  • హార్ట్ వాల్వ్ రిపేర్ లేదా భర్తీ
    ఒక కొత్త కవాటం సాయంతో సరిగ్గా లేదా అసలు పనిచేయని హృదయ కవాటాన్ని సరిచేయడానికి లేదా భర్తీ చేయడానికి ఈ శస్త్ర చికిత్స చేయబడుతుంది.

  • గుండె మార్పిడి లేదా హార్ట్ ట్రాన్స్ ప్లాంట్
    తీవ్రంగా దెబ్బతిన్న గుండె విషయంలో, వ్యాధినిరోధక హృదయాన్ని దాత నుండి సేకరించి వ్యాధిగ్రస్తమైన గుండెను తొలగించి దాని స్థానంలో దాత ఇచ్చిన కొత్త గుండెను భర్తీ చేయడం. దీన్నే ‘గుండె మార్పిడి’ అంటారు. .

  • పేస్ మేకర్ (Pacemaker)
    ఛాతీ చర్మం క్రింద పేస్ మేకర్ ను వైర్లుతో గుండెకు అనుసంధానం చేస్తారు. ఇది గుండె యొక్క లయను సరిగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

  • విఏడి (VAD) శస్త్రచికిత్సలు (వెంటిక్యులర్ అసిస్ట్ డివైస్) మరియు టీఏహెచ్ (TAH) (సంపూర్ణ కృత్రిమ హృదయం)
    బలహీనమైన గుండెను కల్గినవారికి రక్తాన్ని మరింత సమర్థవంతంగా పంప్ చేయడంలో VAD శస్త్రచికిత్సలు సహాయపడుతాయి. హృదయం యొక్క దిగువ భాగాన ఉన్న రెండు గదులను భర్తీ చేయడానికి TAH (పూర్తిగా నకిలీ గుండె) ను వాడతారు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

ఛాతి నొప్పి యొక్క చిక్కులు - Complications of Chest Pain in Telugu

ఛాతీ నొప్పికి అనేక కారణాలున్నాయి. అవి చాలా తీవ్రమైనవి కావు. అయితే నిరంతరంగా లేదా తీవ్రంగా ఉన్న ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయతగదు. ఎందుకంటే అలాంటి తీవ్రమైన ఛాతీ నొప్పి తీవ్ర వైద్య సమస్యను సూచిస్తుంది. ఇలాంటి ఛాతీ నొప్పికి  చికిత్స చేయకపోతే, మీ శరీరం యొక్క వివిధ భాగాలకు నష్టం కలిగించి తీవ్ర ఉపద్రవాలను తెచ్చి పెట్టొచ్చు. అలాంటి ఉపద్రవాలు ఏమిటో క్రింది విధంగా ఉన్నాయి గమనించండి:

  • ఛాతీ నొప్పి అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది.
    ఛాతీ నొప్పికి అంటువ్యాధి (ఇన్ఫెక్షన్), పిత్తాశయ రాళ్ళు, రక్తం గడ్డకట్టడం, గుండె రక్తనాళం పనిచేయకపోవడం, పూతల వంటివి అంతర్లీన కారణం అయితే, వాటికి తగిన సమయంలో చికిత్స చేయకపోతే గుండె, ఊపిరితిత్తులు, క్లోమం ( ప్యాంక్రియాస్), పిత్తాశయం వంటి అవయవాలకు తీవ్రమైన నష్టాన్ని కల్గిస్తాయి.

  • కుళ్ళకం (సెప్సిస్)
    శరీరంలో అంటువ్యాధి (infection) గనుక ఉంటే, సంబంధించిన అవయవాలకు హాని కల్గించి, అటుపై కుళ్ళకానికి (పూతిక)కు లేదా “సెప్సిస్” కు దారితీస్తుంది.

  • సెప్టిక్ షాక్
    సంక్రమణము లేదా అంటువ్యాధి దాని యొక్క మూలం నుండి శరీర ఇతర  భాగాలకు రక్తప్రవాహం ద్వారా వ్యాపిస్తే, దీన్నే ‘సెప్టిక్ షాక్’ అంటారు.

  • మరణం 
    సెప్టిక్ షాక్ అనేది శరీరం యొక్క ప్రధాన అంగ వ్యవస్థల వైఫల్యానికి (మల్టీసిస్టమ్ వైఫల్యం), కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. గుండె కండరాలు దెబ్బతిన్నట్లయితే, అది గుండెపోటుకు దారితీయవచ్చు, చికిత్స చేయకపోతే వెంటనే మరణానికి దారితీయవచ్చు.



వనరులు

  1. National Heart, Lung, and Blood Institute [Internet]. U.S. Department of Health and Human Services; Ischemic Heart Disease
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Warning signs and symptoms of heart disease
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Treatment for Pancreatitis
  4. Jörg Haasenritter, Tobias Biroga, Christian Keunecke, Annette Becker, Norbert Donner-Banzhoff, Katharina Dornieden, Rebekka Stadje, Annika Viniol,Stefan Bösner. Causes of chest pain in primary care – a systematic review and meta-analysis. Croat Med J. 2015 Oct; 56(5): 422–430. PMID: 26526879.
  5. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Heart Surgery

ఛాతి నొప్పి కొరకు మందులు

Medicines listed below are available for ఛాతి నొప్పి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for ఛాతి నొప్పి

Number of tests are available for ఛాతి నొప్పి. We have listed commonly prescribed tests below: