చాండ్లర్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
కంటిలో శుక్లపటలం (cornea) వాపుదేలితే దానినే “చాండ్లర్ సిండ్రోమ్” అంటారు. ఇంకా, కంటియొక్క కృష్ణపటలం (కన్నుగుడ్డు చుట్టూ ఉండే తెల్లనిభాగం) ఛిద్రమై కురూపిగా తయారై కంటిలోవైపులో అసాధారణంగా అధిక పీడనం కూడా ఉంటుంది. ఇది మూడు కంటి రుగ్మతలకు చెందిన “ఇరిడోకోర్నిల్ సిండ్రోమ్” కు చెందినది. ఈ రుగ్మతతో కార్నియల్ ఎండోథెలియం (శుక్లపటలం యొక్క సన్నని కణజాలం) అసాధారణంగా మారుతుంది మరియు వెండి (hammered silver) లాగా కనిపిస్తుంది. ఈ రుగ్మత మగవారి కంటే స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంది మరియు మధ్య వయస్కులైన పెద్దలకు యువతకు కూడా రావడం సాధారణం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చాండ్లర్ సిండ్రోమ్ ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు:
- మసక దృష్టి
- కార్నియా యొక్క వాపు
- అసాధారణ కృష్ణ పటలం (కనుపాప)
- లైట్ల చుట్టూ రెయిన్బో-రంగు కాంతివలయం
- సొరంగ (టన్నెల్) దృష్టి
కనుపాప (కంటి యొక్క మధ్యభాగంలో నల్లని, గుండ్రని భాగం) సాధారణ స్థితి నుండి స్థానభ్రంశం చెందుతుంది మరియు ఆకారం మరియు పరిమాణంలో వక్రీకృతమవుతుంది. కృష్ణపటలం (ఐరిస్) సైజు తగ్గింపు ఇతర సారూప్య కంటి లోపాలతో పోలిస్తే తేలికగా ఉంటుంది. అసహజ కార్నియల్ ఎండోథెలియం కార్నియా వెనుక వెండి రంగులో (hammered silver) ఉపరితలంగా కనిపిస్తుంది.
ఇరిడోకార్నియల్ సిండ్రోమ్ యొక్క ఇతర రెండు రకాల్లో ఇలాంటి లక్షణాలే కనిపించవచ్చు:
- ప్రోగ్రసివ్ ఐరిస్ అట్రోఫి
- కోగన్-రీస్ సిండ్రోమ్
చాండ్లర్ సిండ్రోమ్ రోగులలో 82% మందిలో కంటి లోపలి దృష్టి దోషం లేదా గ్లాకోమా లేదా కంటిలో పెరిగిన పీడనం అనే బాధ ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని అనుమానిత మంట లేదా దీర్ఘకాలిక వైరల్ సంక్రమణ సంభావ్యతే కారణం. ఎండోథెలియల్ ఉపరితలం సాధారణంగా కార్నియా నుండి సజలతడిని పంపుతుంది. ఈ చర్య విఫలమయినప్పుడు, కార్నియాలో ద్రవం చేరడం జరుగుతుంది, తత్ఫలితంగా కంటి చూపు అస్పష్టమైపోతుంది. ఇది గ్లాకోమా రుగ్మతకు దారితీస్తుంది. గ్లాకోమా ది తలనొప్పి మరియు అస్పష్టమైన దృష్టితో కూడుకుని ఉంటుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి ?
ఈ పరిస్థితికి సాధారణంగా పరిశీలన అవసరమవుతుంది మరియు పూర్తి కంటి పరిశీలనను నిర్ధారణ చేయాలి. చాండ్లర్ సిండ్రోమ్ సాధారణంగా రోగిలో ఏకపక్ష, ద్వితీయ కోణ-మూసివేత గ్లాకోమా అని పిలువబడే స్థితిలో రోగనిర్ధారణ చేయబడుతుంది. ఇదే విధమైన ప్రదర్శనతో ఇతర రుగ్మతలను అధిగమిమించడానికి వైవిధ్యమైన రోగ నిర్ధారణ జరుగుతుంది. ఇందుకు నిర్దిష్ట పరీక్షల్లో ఇవి ఉన్నాయి:
- నేత్రకోణదర్శిని (నేత్రపూర్వాంత కక్ష్య కోణదర్శక కొలమాని)
- కంటి ఒత్తిడి మరియు కండరాల మందం కొలత
- విజువల్ ఫీల్డ్ టెస్ట్
- ఆప్టిక్ నరాల ఇమేజింగ్
గ్లాకోమా పరిశీలనలో సాధారణంగా కంటిలో వాపు మరియు ఒత్తిడిని అంచనా వేయడానికి సలహా ఇస్తారు.
చికిత్స కంటి వాపు తగ్గుదలపై దృష్టి పెడుతుంది తద్వారా కంటిలో ఒత్తిడి పెరుగుతుంది. పూత ఔషధాలను మొదటి-శ్రేణి చికిత్సగా ఉపయోగిస్తారు. కళ్ళలో ఒత్తిడిని తగ్గించడానికి కంటి చుక్కలమందును వైద్యుడు సూచించవచ్చు. ఈ రుగ్మత కల్గిన ఓ మోస్తరుపాటి కేసులను మృదువైన కాంటాక్ట్ లెన్సులు మరియు హైపర్టానిక్ సెలైన్ సొల్యూషన్స్ ఉపయోగించి నిర్వహించవచ్చు.
శస్త్ర చికిత్సలు:
- ట్రాబ్క్యూలెక్టోమీ కంటిలో ఒత్తిడిని తగ్గించడానికి
- కార్నియల్ ట్రాన్స్ప్లాంట్
ఈ రుగ్మత యొక్క ఫలితాలు దీనివల్ల కల్గిన సమస్యలకు సంబంధించినవి, ఇది రోగనిర్ధారణ మరియు చికిత్సయొక్కవిజయం లేదా వైఫల్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక గ్లాకోమా నిపుణుడు పరిస్థితిని అంచనా వేయవచ్చు మరియు దృష్టిని మెరుగుపరచడానికి మరియు మెరుగైన ఫలితాలను అందించడానికి ఒక చికిత్సాప్రణాళికను రూపొందించవచ్చు.
స్వీయ రక్షణ చిట్కాలు ఇలా ఉన్నాయి:
- కళ్ళకు ఒత్తిడిని నివారించండి.
- యోగా, ధ్యానం మరియు వినోద కార్యకలాపాలు కళ్ళకు ఒత్తిడిని తగ్గించగలవు.
- క్రమమైన వ్యాయామం కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు దృష్టిని కోల్పోయే అవకాశాలు తగ్గిస్తాయి.
- విటమిన్లు A , విటమిన్ E మరియు విటమిన్ సి , జింక్, రాగి మరియు సెలీనియం వంటివి కంటికి అవసరమైన ఆహార పదార్ధాలు .
- మరింత వ్యాధి పురోగతిని నివారించడానికి రెగ్యులర్ కంటి చెక్ అప్లను చేయాలి.