గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?
గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాల యొక్క అసాధారణ పరుగుదల, అది గర్భసంచిలేదా గర్భంలోని లోపల భాగం. చాలా క్యాన్సర్ లు పొలుసుల కణ రకం (squamous cell type), అయితే అడెనోక్యార్సినోమా (adenocarcinoma) దాని తర్వాత అత్యంత సాధారణ రకం. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో, స్త్రీలలో సంభవించే క్యాన్సర్లలో ఇది 6-29% గా ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ప్రారంభ దశల్లో గర్భాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు గమనించలేము. గర్భాశయ క్యాన్సర్ పురోగతి చెందే కొద్దీ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
- ఋతుక్రమ సమయంలో లేదా లైంగిక సంభోగం తరువాత క్రమరహిత లేదా అసాధారణ యోని రక్తస్రావం
- నడుము నొప్పి లేదా కాళ్ళ నొప్పి
- అలసట
- బరువు తగ్గుదల
- ఆకలి తగ్గుదల
- చెడు వాసనతో కూడిన యోని స్రావాలు లేదా యోనిలో అసౌకర్యం (మరింత సమాచారం: యోని వాసన)
- కాళ్ళ వాపు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చాలా సందర్భాలలో గర్భాశయ క్యాన్సర్ అనేది మానవ పపిల్లోమావైరస్ (human papillomavirus, HPV) వలన సంభవిస్తుంది. అది యోని, నోరు లేదా అంగ సంపర్కం ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. క్యాన్సర్ అవకాశాలను పెంచే కొన్ని ఇతర అంశాలు:
- ధూమపానం
- తగ్గిన రోగనిరోధక శక్తి
- 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం జనన నియంత్రణ మాత్రల (birth control pills) ఉపయోగం
- ముగ్గురికి పైగా పిల్లలను కనడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి ?
ప్రారంభ దశలలో సంకేతాలు లేదా లక్షణాలు ఏమి కనిపించవు; అయినప్పటికీ, క్రమమైన చెక్-అప్లులు గర్భాశయ క్యాన్సర్ను గుర్తించడంలో సహాయపడతాయి. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న స్త్రీలు కనీసం ఒక్కసారి అయినా తనిఖీ చేయించుకోవాలని సలహా ఇవ్వబడుతుంది. నిర్దారణ పద్ధతులు:
- శారీరక పరీక్ష మరియు ఆరోగ్య చరిత్ర: రోగి యొక్క సాధారణ ఆరోగ్య చరిత్ర మరియు పరీక్ష.
- కటి (Pelvic) పరీక్ష: సంక్రమణ (infection) లేదా వ్యాధుల సంకేతాలను పరిశీలించడానికి యోని మరియు గర్భాసంచి పరీక్ష.
- పాప్ (Pap) పరీక్ష: ఏదయినా వ్యాధి, సంక్రమణ లేదా క్యాన్సర్ అవకాశాలను గుర్తించడానికి గర్భాశయం నుండి కణాలు సేకరించి పరీక్షించడం.
హెచ్పివి (HPV) పరీక్ష: HPV పరీక్షలో, ఎసిటిక్ యాసిడ్ తో కణాలను సూక్ష్మదర్శినిలో (microscope) చూడడం ద్వారా తనిఖీ మరియు మైక్రోస్కోపిక్ పరీక్ష.
- ఎండోసర్వికల్ క్యూరెట్టేజ్ (Endocervical curettage): గర్భాశయ లోపలి ద్వారంలో క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
- కలోపోస్కోపీ (Colposcopy): యోని మరియు గర్భాశయంలోని అసాధారణ ప్రాంతాల తనిఖీ కోసం.
- జీవాణుపరీక్ష (Biopsy): క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి గర్భాశయ కణజాల తనిఖీ.
చికిత్స పద్ధతులు వీటిని కలిగి ఉంటాయి:
క్యాన్సర్ యొక్క తీవ్రతను బట్టి వైద్యులు ఎదో ఒక రకమైన చికిత్స (మోనోథెరపీ) లేదా కలయిక చికిత్సను (combination therapy) ఇవ్వవచ్చు.
ప్రామాణిక చికిత్సలు:
- శస్త్రచికిత్స:
- కొనిసెషన్ (Conisation): గర్భాశయలో ఒక సంక్రమిత త్రికోణపు కణజాలం తీసివేయబడుతుంది.
- మొత్తం గర్భాశయం తీసివేయడం (Total hysterectomy): శస్త్రచికిత్స ద్వారా గర్భసంచితో సహా పూర్తి గర్భాశయం యొక్క తొలగింపు.
- రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలు చంపడానికి అధిక శక్తి కిరణాలు ఉపయోగించడం.
- కెమోథెరపీ: మందులు ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఆపడం లేదా చంపడం.
- టార్గెటెడ్ థెరపీ: క్యాన్సర్ కణాలను గుర్తించే మరియు వాటిని లక్ష్యంగా చేసుకుని నిరోధించే మోనోక్లోనల్ యాంటీబాడీస్ను (monoclonal antibodies) ఉపయోగించడం.
హెచ్ పి వి (HPV) టీకామందు (రెకమ్బినాంట్ టీకాలు,recombinant vaccines) 9-26 సంవత్సరముల మధ్య వయస్సు గల బాలికలకు సిఫారసు చేయబడుతుంది. ఈ టీకాలు అనుమతించబడినవి, సురక్షితమైనవి మరియు సమర్థవంతమైనవి అయినందున, క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి అనేక సంవత్సరాలు పడుతుంది, అలాగే నిరోధించవచ్చు కూడా.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- గర్భాశయంలో జరిగే సహజ మార్పులను గమనించడం కోసం అద్దం మరియు ఫ్లాష్లైట్ ఉపయోగించటం ద్వారా స్వీయ-పరిశీలన.
- గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు కండోమ్ వంటి మందుల రహిత గర్భ నిరోధక పద్ధతుల ఉపయోగం.
- హెచ్ పి వి (HPV) సంక్రమణను నివారించడానికి ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాన్ని నివారించాలి.
- ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ను నివారించడానికి ఆరోగ్యవంతమైన పరిసర పరిస్థితులను పాటించాలి.
- వ్యాధి దశను తెలుసుకోవడానికి తరచుగా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. రోగనిర్ధారణ తరువాత 2 సంవత్సరాల వరకు ప్రతీ 3-4 నెలలు ఒకసారి తనిఖీ అవసరం.
గర్భాశయ క్యాన్సర్లను ఒక సామాజిక కళంకంగా పరిగణించకూడదు, క్యాన్సర్ను పరీక్షించడం మరియు ముందుగా గుర్తించడం కోసం గైనకాలజిస్ట్ను సంప్రదించడానికి సంకోచించకూడదు. సానుకూల స్పందన మరియు సాధారణ తనిఖీలతో, గర్భాశయ క్యాన్సర్ నిరోధించవచ్చు.