మస్తిష్క పక్షవాతం అంటే ఏమిటి?
మస్తిష్క పక్షవాతం (Cerebral palsy-CP) అనేది పిల్లలలో అభివృద్ధి చెందకుండా ఉండే మెదడువల్ల సంభవించే వ్యాధి. ఇది గాయం లేదా వైకల్యం (దుర్నిర్మాణం) వలన సంభవించే (పురోగమనం లేని) నరాల సమస్య. ఇది తీవ్రమైన బాల్య వైకల్యానికి చాలా సాధారణమైన కారణం. ఇది ప్రధానంగా కదలికలకు సంబంధించి మరియు కండరాల సమన్వయంలో సమస్యలను కలిగిస్తుంది. భారతదేశంలో ప్రతి వెయ్యి మందిలో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం సంభవనీయత ఉన్నట్లు అంచనా వేయబడింది.
మస్తిష్క పక్షవాతం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
దొర్లడం (రోలింగ్), కూర్చోవడం, నడవడం వంటివి ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలు (శారీరక అభివృద్ధికి సంబంధించి) సాధించాల్సిన మైలురాళ్ళు. అలాంటిది, మస్తిష్క పక్షవాతం కల్గిన పిల్లల్లో ప్రక్రియలన్నీ ఆలస్యం కావచ్చు. ఇది బాలికల కంటే మగపిల్లలలోనే చాలా సాధారణమైనది, మరియు తెల్లజాతీయుల కంటే నల్లజాతీయులలో మరింత సాధారణం. వయసు వారీగా ఉన్న లక్షణాలు:
3-6 నెలలు:
- శిశువును పక్క నుండి ఎత్తినప్పుడు తల వెనక్కి వాలిపోవటం
- శరీరం మొత్తం పెడసరం (బిర్రబిగుసుకుపోవడం)
- తగ్గిన కండరాల బలం
- ఎక్కువగా విస్తరించిన వీపు వెనుక మరియు మెడ
6 నెలలు కంటే ఎక్కువ:
- దొర్ల లేకపోవడం
- రెండు చేతులను ఒకటిగా కూడదీసుకోవటంలో వైఫల్యం
- నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు
10 నెలల వయసు కంటే పెద్ద పిల్లలు:
- క్రమ రహితంగా దోకడం, క్రమం లేని కదలికలు
- మద్దతుతో నిలబడటానికి అసమర్థత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడు యొక్క నిర్మాణాత్మక దశలలో ఏదైనా గాయం లేదా అసాధారణత వలన మెదడు ప్రధానంగా దెబ్బతింటుంది . మస్తిష్క పక్షవాతం కండరాల తీరును, ప్రతిచర్యల్ని, భంగిమను, సమన్వయాన్ని, కదలికల్ని మరియు కండరాల నియంత్రణను బాధిస్తుంది.
మెదడు అభివృద్ధికి దారితీసే సమస్యలకు కారణమయ్యే ఇతర కారకాలు:
- ఉత్పరివర్తనాలు (మారడము): జన్యుపరమైన అసాధారణత బలహీనమైన మెదడు అభివృద్ధికి దారి తీస్తుంది.
- మాతృత్వపు ఇన్ఫెక్షన్లు: గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిని బాధించే పాటలవర్ణపు బొబ్బలు పుట్టెడు ఒక అంటురోగము (రుబెల్లా).
- భ్రూణ స్ట్రోక్: శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకమేర్పడడం.
- బాల్యంలోని అంటువ్యాధులు: మెదడు భాగాలనుబాధించే వాపు-నొప్పి కి సంబంధించిన స్పందనలు.
- ప్రమాదకరమైన తల గాయం: వాహన ప్రమాదాలు తీవ్రమైన మెదడు హానిని కలిగిస్తాయి.
- ప్రాణవాయువు లేకపోవడం: ప్రసూతి సమయంలో లేక కష్టకరమైన ప్రసూతిలో ఆక్సిజన్ లేమి.
మస్తిష్క పక్షవాతాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టర్ సంకేతాలు లేదా వ్యాధి లక్షణాల కోసం శిశువును తనిఖీ చేసి, శారీరక పరీక్షను నిర్వహించడం ద్వారా బిడ్డకున్నవ్యాధిని మదింపు చేస్తాడు. చిన్నపిల్లల నరాలవైద్యంలో నిపుణులైన వైద్యులకు శిశువును చూపించమని మీ వైద్యుడు మీకు సూచించవచ్చు.
వైద్యుడు పలు పరీక్షల శ్రేణుల్ని సూచించవచ్చు:
బ్రెయిన్ స్కాన్లు
- మాగ్నెటిక్ రెసోనాన్స్ ఇమేజింగ్ (MRI): మెదడులో ఏవైనా గాయాలు లేదా అసహజతను గుర్తించడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తారు.
- కపాల అల్ట్రాసౌండ్: మెదడు యొక్క ప్రాధమిక అంచనా; ఇది త్వరితగతిన జరిగేది మరియు చవకైనది.
- ఎలక్ట్రోఎన్స్ఫాలోగ్రామ్ (EEG): మూర్ఛని గుర్తించడానికి ఈ పరీక్ష.
దీని కోసం ఇతర పరీక్షలు:
- దృష్టి సమస్యలకు
- వినికిడి బలహీనత
- మాట్లాడడంలో తొందర్లకు
- మేధో వైకల్యం
- కదలికల్లో లోపాలు
శిశువు యొక్క బలహీనతను బట్టి ఆరోగ్య నిపుణుల బృందం దీర్ఘకాల వైద్య సంరక్షణను చేపడుతుంది. మందులు ప్రధానంగా కదలికలకు-సంబంధించిన వైకల్యాలు, నొప్పి నిర్వహణ మరియు ఏకాంత మరియు సాధార దుస్సంకోచ స్థితికి సంబంధించిన లక్షణాలకు చికిత్స చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంటాయి.
పిల్లల నాణ్యతా నాణ్యతను మెరుగుపరిచేందుకు నాన్-డ్రగ్ చర్యలు:
- ఫిజియోథెరపీ: కండరాల శక్తి మరియు వశ్యత యొక్క విస్తరణ కోసం. బ్రేస్లు లేదా చీలికలు (splints) సిఫార్సు చేయబడవచ్చు.
- వృత్తి చికిత్స ( పని కల్పించే చికిత్స): పిల్లల భాగస్వామ్య సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించడానికి.
- స్పీచ్ మరియు భాషా చికిత్స: భాషను ఉపయోగించడం లేదా సంభాషించడానికి సంకేత భాషను ఉపయోగించడం.
- వినోద చికిత్స: బహిరంగ కార్యక్రమాలలో (outdoor activities) పాల్గొనేందుకు.
- పోషకాహార మరియు ఆహార చికిత్స: ఆహారంజీవనంలోని ఇబ్బందులు ఎదుర్కోవటానికి మరియు తగిన పోషణను నిర్ధారించడానికి.
స్వీయ రక్షణ చిట్కాలు ఇలా ఉంటాయి:
- చాలా సందర్భాలలో, మస్తిష్క పక్షవాతాన్ని న్న నిరోధించలేము, కాని తగినంత ప్రసూతి పూర్వపరిరక్షణ, (ప్రినేటల్ కేర్), సురక్షిత ప్రసూతి మరియు గర్భధారణలో ప్రమాదాలను నివారించడం వలన బాహ్యంగా మస్తిష్క పక్షవాతాన్ని పొందే (acquired) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ప్రయాణంలో శిరస్త్రాణాలు మరియు రక్షిత సీట్ బెల్టుల వాడకంతో పిల్లల తల గాయాల్ని నివారించవచ్చు.
- పిల్లల రోజువారీ కార్యకలాపాలను పరిశీలించండి.
తల్లిదండ్రులు / సంరక్షకులు బాలల పరిస్థితి మెరుగుపర్చడానికి మరియు పిల్లల అవసరాలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికను సర్దుబాటు చేయడానికి వైద్య బృందానికి మద్దతునిచ్చి సహకరించాలి. దీర్ఘకాలిక భావోద్వేగ మద్దతు మరియు సంరక్షణ పిల్లల పరిపూర్ణ ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు కీలకం.