సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (CPP)అంటే ఏమిటి?
సెంట్రల్ ప్రికోసియస్ పబ్బీటి (సిపిపి) అనేది పిల్లలలో యుక్తవయస్సు లక్షణాలు ముందుగానే ప్రారంభమయ్యే స్థితి. ఒకవేళ ఎనిమిది సంవత్సరముల వయస్సు లోపు బాలికలు మరియు తొమ్మిది సంవత్సరముల వయస్సు లోపు బాలురు లో ముందస్తు యుక్తవయస్సు సంకేతాలు కనిపిస్తే, వారు సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (CPP) వంటి అంతర్లీన పరిస్థితులను ఎదుర్కుంటున్నారని అంచనా వేయాలి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు సహజ యవ్వన లక్షణాలు మాదిరిగానే ఉంటాయి. అయినప్పటికీ, ఇవి చిన్న వయసులోనే కనిపిస్తాయి. అమ్మాయిలు లో యుక్తవయస్సు యొక్క సాధారణ లక్షణాలు:
- రొమ్ములు పెరగడం
- మొదటి రుతు చక్రం ప్రారంభమవ్వడం
అబ్బాయిలలో యవ్వనానికి సంబంధించిన సాధారణ లక్షణాలు:
- వృషణాలు మరియు పురుషాంగం యొక్క పెరుగుదల
- కండరాల పెరుగుదల
- గంభీరమైన గొంతు
- హఠాత్తుగా విరజిమ్మడం (Growth spurt)
- ముఖ జుట్టు పెరుగుదల
బాలబాలికలలో సాధారణ లక్షణాలు:
- మొటిమలు
- జననేంద్రియ మరియు శరీర జుట్టు పెరుగుదల
- హఠాత్తుగా విరజిమ్మడం (Growth spurt)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (CPP) యొక్క కారణం ఇంకా కనుగొనబడలేదు. అరుదుగా, కొన్ని పరిస్థితులు CPP కు దారి తీయవచ్చు. అవి:
- మెదడు అంటువ్యాధులు
- హార్మోన్ల రుగ్మతలు
- మెదడు గాయాలు లేదా అతిక్రమణలు
- పిట్యూటరీ గ్రంథి యొక్క కణితులు
- క్యాన్సర్లో మాదిరిగా రేడియోధార్మికతకు మెదడు బహిర్గతం కావడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
పిల్లల చిన్న వయస్సులోనే యుక్తవయస్సు లక్షణాలు గమనించినట్లయితే, వైద్యున్ని సంప్రదించాలి. వైద్యులు శారీరక పరీక్ష చేస్తారు మరియు ఆ పరిస్థితిని, దాని కారణాలను నిర్ధారించడానికి క్రింది పరీక్షలను సిఫారసు చేయవచ్చు:
- శరీరంలోని హార్మోన్ల స్థాయిలను గుర్తించడానికి మూత్ర పరీక్ష మరియు రక్త పరీక్ష. అధిక స్థాయిలో హార్మోన్లు ఉంటే యుక్తవయస్సు ప్రారంభమవుతుందని సూచిస్థాయి. హార్మోన్ల స్థాయి అది సెంట్రల్ లేదా పెరిఫెరల్ ప్రికోషియస్ ప్యూబర్టీయా అని కూడా నిర్ధారించడంలో వైద్యులకు సహాయం చేస్థాయి.
- మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) మరియు సిటి (CT) స్కానింగ్ మెదడులోని ఏదైనా లోపాన్ని గుర్తించడానికి మెదడును స్కాన్ చేయడానికి ఉపయోగిస్తారు. పిల్లల్లో ఎముక పెరుగుదల సాధారణంగా ఉన్నదా అని గుర్తించడానికి, ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగిస్తారు.ఎంఆర్ఐ, సిటి (CT) స్కాన్, మరియు ఎక్స్-రేలు సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (CPP) యొక్క కారణం కనుగొనేందుకు సిఫార్సు చేస్తారు.
- ఎముక వయస్సు నిర్ధారణను చేసే డేక్స (DEXA) స్కాన్ మరియు పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ (pelvic ultrasonography) వంటి ఇతర పరీక్షల ద్వారా బాలికలలో సెంట్రల్ ప్రికోషియస్ ప్యూబర్టీ (CPP) ని నిర్దారిస్తారు.
చికిత్స పరిస్థితి ప్రారంభమైన వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ సమస్య ప్రారంభమైన వయస్సు సాధారణ వయస్సుకి చాలా దగ్గరగా ఉంటే, చికిత్స అవసరం లేదు. కానీ చాలా చిన్న వయసులోనే ప్రారంభమవుతుంటే, చికిత్స ఉంటుంది:
- గోనడోట్రోపిన్-విడుదల హార్మోన్ (gonadotropin-releasing hormone) వ్యతిరేక మందులు ఉపయోగించి పురుషులలోను, స్త్రీలలోను వున్న వ్యత్యాసము తెలిపే లైంగిక ఆవయవముల (secondary sexual characteristics) పురోగతిని ఆపడం
- బాలికలలో ఋతుచక్రాలను ఆపే మందులు
- పరిస్థితికి గల కారాణానికి చికిత్స