కంటిశుక్లాలు అంటే ఏమిటి?
మనందరికి కంటిలో ఒక కటకం (lens) ఉంటుంది, అది దృష్టికి చాలా ముఖ్యమైనది. మనము ధరించే కళ్ళజోడు లేదా ఉపయోగించే కెమెరా లెన్స్ వంటిది, మన కళ్ళలో ఉన్న కటకాల (lens) పై ఆధారపడి మన కంటి చూపు స్పష్టత అనేది ఉంటుంది. కంటిశుక్లాలు అంటే ఆ కాటకాలకు (lens) మచ్చలు ఏర్పడటాయి మరియు అది స్పష్టమైన దృష్టిని లేదా చూపును నిరోధిస్తుంది. ఇది సాధారణంగా వృద్ధులలో ఎక్కువ కనిపిస్తుంది, అయితే యువతను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కంటిశుక్లం దృష్టిని, రోజువారీ పనితీరును మరియు బండి తోలడం, చదవడం, మరియు వివరాలను చూడడం వంటి వాటిని ప్రభావితం చేస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కంటిశుక్లాలను మొదట్లో గుర్తించడం కష్టం. ఈ సమస్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ అది చాలా నెమ్మదిగా ఉన్నందున మార్పులు సహజంగా గుర్తించబడవు. తరచుగా దృష్టిలో ఈ మార్పులు వృద్ధాప్యం కారణంగా అని భావింపబడతాయి. సంకేతాలు పెరిగినప్పుడు మాత్రమే, అది కంటిశుక్లం అని గుర్తించబడుతుంది. కంటిశుక్లం యొక్క లక్షణాలు:
- అస్పష్టమైన లేదా మసక కంటి చూపు
- రాత్రుళ్లు కనపడడం కష్టం అవుతుంది
- స్పష్టంగా చూడడానికి పెద్ద అక్షరాలు మరియు ఎక్కువ వెలుగు అవసరమవుతాయి
- రంగుల్లో ప్రకాశం తక్కువగా కనిపిస్తుంది
- సూర్య కాంతికి మరియు లైట్ల వెలుగు చూడడంలో సున్నితత్వం
- రెండుగా కనిపించడం
- వెలుగుతున్న వస్తువుల చుట్టూ ఒక వలయంలా కనిపించడం
- ప్రిస్క్రిప్షన్ మరియు కళ్ళజోడు సంఖ్యలో తరచుగా మార్పులు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కంటిశుక్లం ఈ క్రింది కారణాల వలన కలుగవచ్చు:
- వయస్సు పెరుగడం వలన
- కటకాల (lens) యొక్క కణజాలంలో మార్పులు
- జన్యుపరమైన రుగ్మతలు
- మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు
- శస్త్రచికిత్స, అంటువ్యాధులు మొదలైనుటువంటి మునుపటి కంటి సమస్యలు
- స్టెరాయిడ్స్ల దీర్ఘకాల వినియోగించడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
కంటి పరీక్ష మరియు ఆరోగ్య చరిత్ర అనేవి ప్రాథమిక నిర్ధారణను తెలుపుతాయి, తర్వాత ఈ క్రిందివి ఉండవచ్చు:
- చదివడంలో నిర్దిష్టత యొక్క తనిఖీ కోసం విజన్ పరీక్ష
- కటకాలను (లెన్స్), కార్నియా, ఐరిస్ (నల్ల కనుగుడ్డు) మరియు వాటి మధ్య ఖాళీలు పరిశీలించడానికి స్లిట్ లాంప్ పరీక్ష
- కంటిశుక్లం (క్యాటరాక్ట్) తనిఖీ కోసం రెటీనా పరీక్ష
ప్రిస్క్రిప్షన్ (ఔషధపత్ర) చేసిన కళ్ళజోడు సహాయపడకపోతే మెరుగైన కంటిచూపును పొందటానికి ఏకైక మార్గం కంటిశుక్లాన్ని తీసివేయడం కోసం శస్త్ర చికిత్సను ఎంపిక చేసుకోవడం. కంటిశుక్లం కోసం శస్త్రచికిత్స అనేది నిరూపించబడినది మరియు సురక్షితం, మరియు ఈ ప్రక్రియల్లో మెరుగుదల త్వరితంగా మరియు ఎటువంటి అవాంతరం లేకుండా ఉంటుంది. కంటిశుక్లంతో ఉన్న లెన్స్ ఒక కృత్రిమ లెన్స్తో భర్తీ చేయబడుతుంది, తరువాత అది కంటిలో భాగమవుతుంది. శస్త్రచికిత్స తర్వాత సరిదిద్దిన లెన్సులు (Corrective lenses) కళ్ళజోళ్ళ అవసరాన్ని కూడా తొలగించవచ్చు. శస్త్రచికిత్స యొక్క అత్యంత ముఖ్యమైన విషయాలకు సంబంధించినది శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ.