కాండిడా సంక్రమణ అంటే ఏమిటి?
శరీరం యొక్క అనేక భాగాల్లో వచ్చే అతి సాధారణ శిలీంధ్ర-సంబంధమైన(ఫంగల్ ఇన్ఫెక్షన్లో) సంక్రమణల్లో కాండిడాల్ ఇన్ఫెక్షన్ ఒకటి . కొన్ని పరిస్థితుల్లో, మొత్తం శరీరం అంతటా కూడా ఈ వ్యాధి వచ్చే అల్లుకుపొయ్యే అవకాశం లేకపోలేదు, తద్వారా, తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. కాండిడాల్ ఇన్ఫెక్షన్ మూడు ముఖ్యమైన రకాలు. అవి:
- అన్నవాహిక, గొంతు మరియు నోటి యొక్క అంటురోగం.
- జననేంద్రియ కాండిడాల్ ఇన్ఫెక్షన్ (మరింత సమాచారం: యోని ఈస్ట్ సంక్రమణ చికిత్స)
- ఇన్వాసివ్ కాండిడాల్ ఇన్ఫెక్షన్. “కాండిడా అల్బికెన్స్” అనే అత్యంత సాధారణ కారణం తో కూడిన అంటువ్యాధులు 20 కంటే ఎక్కువ రకాలున్నాయి..
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కాండిడాల్ ఇన్ఫెక్షన్ లో సంభవించే లక్షణాలు శరీరంలోని ఏ భాగంలో ఆ వ్యాధి (కాండిడాల్ ఇన్ఫెక్షన్) వచ్చిందన్న దాన్నిబట్టి వ్యాధిలక్షణాలు మారుతూ ఉంటాయి. కాండీడియాసిస్ (candidiasis యొక్క అన్ని రకాల్లో సాధారణంగా కనిపించే సంకేతాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- వెంట్రుకల మోడళ్లలో మోటిమలు వలె కనిపించే ఇన్ఫెక్షన్ (పుండు)
- ఎరుపుదేలి (reddish), దురదతో కూడిన చర్మ దద్దుర్లు
- జననేంద్రియ ప్రాంతం, నోటి ప్రాంతం, రొమ్ముల కింద, చర్మం మడతలు మరియు శరీరం యొక్క ఇతర ప్రాంతాలపై దద్దుర్లు (rashes) సోకిన భాగం
కాండిడా సంక్రమణకు ప్రధాన కారణాలు ఏమిటి?
మన చర్మాన్ని బాధించే కాండిడాల్ ఇన్ఫెక్షన్ శరీరంపై విస్తృతంగా వ్యాపిస్తుంది. శరీరంలోని ఏభాగంలోనైనా సంభవిస్తుందిది, కానీ ఎక్కువగా తడిగా మరియు చర్మపు మడతతో కూడిఉన్న భాగాలను బాధిస్తుంది. క్రింది కారణాలు ఏ చర్మం సంక్రమణకు దారి తీస్తాయి:
కాండిడాల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా చర్మం మరియు గజ్జలు వంటి చర్మం యొక్క తేమ ప్రాంతాల్లో బాధిస్తుంది, అయితే,ఇది నోటి యొక్క మరియు గోర్ల యొక్క మూలల్లో కూడా బాధిస్తుంది. యోని మరియు నోటి భాగాల్లో వచ్చే కాండిడాల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా యాంటిబయోటిక్ థెరపీ వల్ల వస్తుంది. ఇది హెచ్ఐవి (HIV) సంక్రమణ వంటి బలహీనమైన రోగనిరోధకత కల్గిఉన్న వ్యక్తులలో కూడా కనిపిస్తుంది .
కాండిడా సంక్రమణను ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాధారణంగా కాండిడాల్ ఇన్ఫెక్షన్ ను ఎలా నిర్ధారిస్తారంటే వ్యాధి సోకిన చోటనుండి చర్మాన్ని గోకడం (scraping) ద్వారా వ్యాధికి గురైన ఆ చర్మం తీసుకుని దాన్ని సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించేందుకు వైద్య పరికరాలతో పరీక్షించడం జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది. పరీక్షలో కాన్డిడియాసిస్ ను గుర్తించినట్లయితే సదరు వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి రక్తంలో అధిక రక్త-చక్కెర స్థాయి గనుక ఉన్నట్లయితే ఈ వ్యాధికారకమైన ఫంగస్ పెరిగేందుకు తెదపాది వ్యాహి ఉధృతమవుతుంది.
ఏరకం కాండిడాల్ ఇన్ఫెక్షన్ కు అయినా చికిత్స క్రింది విధంగా ఉంటుంది:
- సరైన ఆరోగ్యనిర్వహణ మరియు పరిశుభ్రతను పాటించడం చికిత్సలో ప్రాధమిక అవసరం.
- మీ చర్మం యొక్క తేమ ప్రాంతాలకు తేమను పీల్చుకునే పొడులను (absorbent powders) ఉపయోగించడంవల్ల వ్యాధిని నివారించడానికి, అలాగే కాన్డిడియాసిస్ చికిత్సకు సహాయపడుతుంది
- సూర్యరశ్మి సోకేలా వ్యాధి సోకినా మీ చర్మాన్ని ఎండలో ఉంచండి
- మీ రక్తంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయిలో నిర్వహించండి
- మీ వైద్యుడు మీ చికిత్సకు సహాయపడే పూతమందులైన యాంటీ- ఫంగల్ క్రీమ్లు మరియు ఆయింట్మెంట్ మందులను సూచించవచ్చు
- తీవ్రమైన కాన్డిడియాసిస్ విషయంలో, పొట్టలోకి తీసుకునే ఔషధాలతో కూడిన (oral) యాంటీ-ఫంగల్ చికిత్సను కూడా డాక్టర్ సూచించవచ్చు.