మెదడు రక్త నాళాల వాపు వ్యాధి (Brain Aneurysm) అంటే ఏమిటి?
మెదడులోని నరాల (ధమనుల) గోడలపై బలహీనమైన ప్రాంతంలో ఉబ్బినట్లు లేదా బుడగ-వంటి రూపాన్ని కలిగి ఏర్పడే వ్యాధి పరిస్థితినే “మెదడులో రక్త నాళాల వాపు వ్యాధి” గా చెప్పబడుతుంది. నరాలు ధమనులు, సిరలు అని రెండు రకాలు, ధమనులు గుండె నుండి ఇతర శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టాలు. మెదడులో రక్త నాళాల వాపు వ్యాధి మెదడులోని ఏ ప్రదేశంలోనైనా రావచ్చు, ముఖ్యంగా రక్తనాళాలు విభజించబడే చోట్లలో ఈ వ్యాధి సంభవించవచ్చు. రక్తనాళాల్లో బొబ్బలు కల్గి ఉంటే, అవి పగిలి బొబ్బ యొక్క పొక్కును చీల్చుకొని రక్తస్రావం అవుతుంది. మెదడులో వాపుదేలిన రక్తనాళం మనిషి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం, దీనివల్ల మరణం కూడా సంభవించవచ్చు.
భారతీయ జనాభాలో, మెదడులో రక్త నాళాల వాపు వ్యాధి లేదా పెద్ద మెదడు రక్తనాళాల వ్యాధి (సెరిబ్రల్ అనయూరిజమ్) సాధారణంగా 35 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వయస్సులో ఉండే ప్రజలలో కనిపిస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెదడులో ఇంకా పగలని (unruptured) వాపుదేలిన రక్త నాళాల వ్యాధి లక్షణాలు బయటపడేదెపుడంటే, ఈ వాపుకల్గిన నరాలు మరింత ఉబ్బినపుడు అవి తమ దగ్గర్లోని ఇతర నరాలకు మరియు కండర కణజాలాలకు ఒత్తుకుంటాయి. అలా వాపుదేలిన మెదడు నరాలు ఒత్తుకున్నపుడు కలిగే రోగ లక్షణాలు రోగిచే అనుభవించబడతాయి. ఆ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి:
- వస్తువులు రెండుగా కనబడడం (double vision) లేదా దృష్టి కోల్పోవడం.
- కళ్ళ లో నొప్పి.
- తలనొప్పి .
- ముఖంలో నొప్పి.
- బలహీనత .
- తిమ్మిరి.
- మాట్లాడటంలో సమస్యలు, మనసు కేంద్రీకరించడంలో (దృష్టి పెట్టడంలో) సమస్యలు.
- సంతులనం యొక్క నష్టం.
మెదడు రక్తనాళాల వాపు వ్యాధికి సంబంధించి చాలా మటుకు సందర్భాల్లో ఒక రక్తనాళము పగిలే ప్రమాదం దాపురించేంతవరకూ రోగిని ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు, లేదా అనుభూతి కావు. కొన్ని సమయాలలో, ఒక వాపుకు గురైన అనారోగ్యపు రక్తనాళాల ద్వారా చిన్నగా రక్తస్రావం అవడం మరియు తలనొప్పికి పొడజూపవచ్చు.
మెదడులో వాపుదేలిన రక్త నాళం పగిలినపుడు సంభవించే వ్యాధి లక్షణాలు:
- తీవ్రమైన తలనొప్పి.
- మెడలో బిరుసుదనం (stiffness) .
- వికారం మరియు వాంతులు .
- కాంతికి సున్నితత్వం.
- స్పృహ కోల్పోవడం.
- గందరగోళం.
- మూర్ఛపోవడం (seizure).
- శరీరం యొక్క ఒక వైపు పక్షవాతం .
మెదడులో రక్త నాళాల వాపు వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటి?
ధమనుల గోడలోని ప్రాంతం బలహీనపడటం అనేది ఆ భాగంలో కండరాల పొర లేకపోవడం లేదా పొరను కోల్పోవటం వల్ల జరుగుతుంది. ఇందుకు కారణం ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. ఈ వ్యాధి ప్రమాదానికి గురిచేసే కారకాలు:
- వయస్సు 40 సంవత్సరాలకు పైబడ్డప్పుడు .
- మెదడు రక్తనాళాల వాపు వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర.
- ధూమపానం.
- అధిక రక్తపోటు .
- పుట్టినప్పటి నుండే బలహీనమైన ధమని గోడల ఉనికి.
- కిడ్నీ వ్యాధి, పలు తిత్తుల ఉనికిని కలిగి ఉండే కిడ్నీవ్యాధి.
- పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి .
- మందుల దుర్వినియోగం.
- మెదడుకు గాయం .
- ధమని గోడల సంక్రమణ.
మెదడు రక్తనాళాల వాపు వ్యాధిని ఎలా నిర్ధారించేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
మెదడు రక్తనాళాల వాపు వ్యాధి యొక్క తొలి లక్షణమేమంటే ఆకస్మికంగా వచ్చే భరించలేని తలనొప్పి. వైద్యుడు ఇలాంటి రోగ లక్షణాలతో కూడిన వైద్య చరిత్రను రోగిని అడిగి తెల్సుకుని శారీరక పరీక్ష చేస్తాడు. మెదడులో వాపుకు గురైన అనారోగ్యపు రక్తనాళాల్లో ఎలాంటి పగుళ్లు, వాటి నుండి రక్తస్రావాలు లేవని నిర్ణయించడానికి, MRI మరియు CT వంటి ఇమేజింగ్ పరీక్షల్ని మీకుగా మీ డాక్టర్ చేత చేయబడతాయి. మెదడు రక్తనాళాల వాపు వ్యాధితో పాటు పగిలిన రక్తనాళం ఉన్నవారికి తీసిన CT స్కాన్ పరీక్షలో ప్రతికూల ఫలితాలు వస్తే (అంటే negative results), ఒక వెన్నుపూస పంక్చర్ (lumbar puncture) (ఇక్కడ సెరెబ్రోస్పానియల్ ద్రవం యొక్క నమూనా సేకరించబడుతుంది మరియు రక్తం పరీక్షతో పరిశీలింపబడుతుంది) పరీక్ష జరుగుతుంది. రక్త నాళాల్లో సమస్యలను గుర్తించడానికి డిజిటల్ సబ్ట్రాక్షన్ ఆంజియోగ్రఫీ (DSA) పరీక్ష కూడా జరుగుతుంది.
మెదడు రక్తనాళాల వాపు వ్యాధికి చికిత్స అనేది ఆ వ్యాధి యొక్క పరిమాణం, స్థానం, లక్షణాలు మరియు తీవ్రతను బట్టి మారుతుంది. ఈ వ్యాధి బారిన పడిన ప్రతి వ్యక్తికి మందుల అవసరం ఉండకపోవచ్చు. పగులుకు గురైన మెదడు రక్తనాళం యొక్క ప్రమాదం తక్కువగా ఉంటే, సాధారణమైన తనిఖీల ద్వారానే డాక్టర్ రోగిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. మెదడులో వాపుకు గురైన రక్తనాళము పగులుకు (ఛిద్రం కాకుండా) గురయ్యే అవకాశాలను తగ్గించడానికి సిగరెట్ ధూమపానం లేదా అధిక రక్తపోటుకు చికిత్స వంటి జీవనవిధానం సవరణల్ని వైద్యుడిచే సూచించబడ్డాయి. మెదడులో వాపుకు గురైన రక్తనాళం బొబ్బ (unruptured bleb) చికిత్స కోసం వైద్యుడు సాధారణంగా మందుల్ని సిఫార్సు చేస్తారు. ఈ వ్యాధికి శస్త్రచికిత్స ద్వారా మెదడులో వాపుకు గురైన రక్తనాళం పగులుకు గురి కాకుండా నిరోధించడం జరుగుతుంది మరియు పగులుకు గురైన మెదడులోనిరక్తనాళానికి చికిత్స కూడా ఈ శస్త్ర చికిత్స ద్వారానే జరుగుతుంది. న్ని . (విచ్ఛిన్నం అనిర్విసిస్ యొక్క చీలిక మరియు చికిత్స నివారణకు సహాయపడుతుంది. ఈ శస్త్రచికిత్సలో ఒక “స్ప్రింగ్” లాంటి (mesh) మెష్ ను రక్తనాళం ఏ చోట వాపుకు గురైనదో అక్కడ ఏర్పాటు చేసి ఉంచడం జరుగుతుంది. ఈ మెష్ ఏర్పాటు ద్వారా, వాపుకు గురైన మెదడులోని రక్తనాళం పగలకుండా నివారింపబడుతుంది. లేదా ఉష్ణ శక్తిని ఉపయోగించి రక్తనాళంలో వాపుకు గురైన ప్రాంతాన్ని మొత్తంగా తొలగించి, చుట్టుపక్కల ఉన్న రక్త నాళాలను తిరిగి కలుపుతారు.