ఒంటి నొప్పి అంటే ఏమిటి?
ఒంటి నొప్పి అనేది శరీరం మొత్తం అలసటతో మరియు నీరసమైన అనుభూతిని కలిగి ఉండే ఓ విషాదకార అనుభూతి. ఇది హఠాత్తుగా ఏర్పడొచ్చు, మరి కొన్నిసార్లు నెమ్మదిగా కలగొచ్చు, ఇంకొన్నిసార్లు రోజులతరబడి ఉండొచ్చు. ఒంటి నొప్పి నరాల వంటి మృదు కణజాలం లేక నరాల బంధకాల్లో దాపురిస్తాయి. ఇంకా, ఒంటినొప్పులనేవి వివిధ కండరాల్లో సంభవించనూవచ్చు. చేయవచ్చు. కొన్నిసార్లు, ఈ ఒంటినొప్పి రావడమనేది ఓ అంతర్లీన తీవ్ర వ్యాధిని సూచిస్తుంది, కొన్నిసార్లు కేవలం ఆందోళన వ్యక్తీకరించేదిగా ఉంటుంది ఒంటినొప్పి.
ఒంటి నొప్పి యొక్క ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఒంటి నొప్పి తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. కానీ కాస్త హెచ్చు-తక్కువగా ఒకే లక్షణాల్ని కలిగి ఉంటుంది; తీవ్రమైన ఒంటినొప్పి కొన్ని రోజులు పాటు కొనసాగవచ్చు. లేదా దీర్ఘకాలిక ఒంటి నొప్పి నెల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుంది. ఈ రెండు రకాలైన ఒంటి నొప్పులకు కారణాలు భిన్నమైనవి.
ఒంటి నొప్పికి సంబంధించిన లక్షణాలు:
- శరీరంలోని వివిధ చోట్లలో లేదా భాగాల్లో నొప్పి.
- ఒంట్లోని మృదువైనచోట్లలో (ఈ పాయింట్లులో నొక్కినప్పుడు నొప్పి పెరిగింది).
- అలసట
- చెదిరిన నిద్ర; ఉదయాన్నే లేచినపుడు శరీరంలో తాజాదనమనేది లోపించడం జరుగుతుంది.
- ఉదయకాల దృఢత్వం - బిర్ర బిగుసుకుపోయే గుణం (30 నిముషాల కంటే తక్కువగా ఉంటుంది).
- కాళ్ళు, చేతుల్లో తిమ్మిరి మరియు జలదరింపు
- తలనొప్పి
- ఆందోళన
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దీర్ఘకాలిక ఒంటి నొప్పిలోను మరియు తీవ్రమైన ఒంటినొప్పి విషయంలో కూడా ఒకేవిధమైన సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉండవచ్చు.
తీవ్రమైన ఒంటి నొప్పి యొక్క కారణాలు:
- ఆఘాతం (ట్రామా) లేదా గాయం
- నిర్జలీకరణము (డిహైడ్రాషన్)
- హైపోకలేమియా (తక్కువ పొటాషియం స్థాయిలు)
- నిద్రలేమి
- తీవ్రమైన వైరల్ లేదా బ్యాక్టీరియా సంక్రమణలు
- అధిక శారీరక శ్రమ
దీర్ఘకాలిక ఒంటి నొప్పి యొక్క కారణాలు:
- ఫైబ్రోమైయాల్జియా - టచ్లో మృదువైన అనేక శరీరాల్లోని నొప్పి
- మానసిక కారకాలు - ఒత్తిడి , ఆందోళన లేదా నిరాశ
- పోషకాహార లోపం - విటమిన్ D , విటమిన్ B12 , ఇనుము
- దీర్ఘకాలిక నిస్త్రాణ రుగ్మత (క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్) - ఒత్తిడి లేక అదనపు శారీరక శ్రమ లేనప్పటికీ రోజుల తరబడి నిస్త్రాణగా ఉన్నానన్న భావనతో కొనసాగుతుండడం
- ఆటో ఇమ్యూన్ వ్యాధులు - రుమటాయిడ్ ఆర్థరైటిస్ , మల్టిపుల్ స్క్లేరోసిస్ , లూపస్
- దీర్ఘకాలిక సంక్రమణలు - క్షయవ్యాధి , HIV , హెపటైటిస్ B
ఒంటినొప్పి నిర్ధారణను ఎలా చేస్తారు, దీనికి చికిత్స ఏమిటి?
కొన్నిసార్లు, ఒంటి నొప్పికి రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. అయినా, క్లినికల్ పరీక్షతో తగిన వైద్య చరిత్ర సమీక్షతో ఈ ఒంటి నొప్పి రోగనిర్ధారణ మరియు ఒంటి నొప్పికి కారణాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష కాకుండా, ఒంటి నొప్పి యొక్క కారణాన్ని గుర్తించేందుకు కొన్ని రక్త పరిశోధనలు ఉన్నాయి. ఆ పరీక్షలు ఏవంటే:
- పూర్తి రక్త గణన - రక్తహీనతను గుర్తించడానికి సహాయపడుతుంది
- ఎరోథ్రోసైట్ అవక్షేపణ రేటు (ESR) మరియు సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) - శరీరంలో వాపు లేదని నిర్ధారించేందుకు సాయపడతాయి ఈ పరీక్షలు.
- అస్పర్పరేట్ ట్రాన్స్మినానేజ్తో కూడిన ఆల్కలీన్ ఫాస్ఫాటేస్ - కండర విచ్ఛిన్నం యొక్క సంభావ్యతను నిర్ధారించడానికి.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) కారకం - రుమటోయిడ్ ఆర్థరైటిస్ నిర్ధారణకు.
- యాంటీ-న్యూక్లియర్ యాంటీబాడీస్ (వ్యతిరేక అణు ప్రతిరోధకాలు) - ఒంటి నొప్పికి ఆటో రోగనిరోధక కారణాల్ని తోసిపుచ్చేందుకు.
- విటమిన్ బి 12 మరియు D3 స్థాయిలు-విటమిన్ B12 మరియు D3 యొక్క పోషకాహార లోపం కారణాల్ని తోసిపుచ్చేనందుకు
ఈ పరీక్షల తర్వాత కూడా, వ్యాధి కారణం నిర్ణయం కాకపోతే, అప్పుడు మనస్తత్వవేత్త లేదా కౌన్సెలర్తో సంప్రదించి ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక కారణాలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
వ్యాధికి కారణం తెలుసుకున్న తర్వాత, ఆ కారణం ఆధారంగా, చికిత్స యొక్క తదుపరి రోగనివారణాచర్య (కోర్సు) నిర్ణయించబడుతుంది. కొంతమంది రోగులకు కేవలం లక్షణాల చికిత్స అవసరమవుతుంది, అయితే కొంతమంది కేవలం సలహాల సమావేశాలతో పాటు సర్వరోగ నివారిణి మందు (placebo) అవసరం కావచ్చు.
చికిత్స కోసం ఉపయోగించే కొన్ని మందులు:
- అనాల్జెసిక్స్ - పారాసెటమాల్ లేదా నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (డిక్లోఫెనాక్ లాంటివి) నొప్పి నివారణకు తీసుకోవచ్చు.
- కండరాల ఉపశమనకాలు - ఒంటి నొప్పి కండరాల గట్టిదనం కారణంగా అయి ఉంటుంది; కండరాల ఉపశమనకాలు తీసుకోవడం వల్ల ఒంటి నొప్పికి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది
- విటమిన్ సప్లిమెంట్స్ - ఒంటి నొప్పి పోషకాహారలోపం కారణంగా అయితే విటమిన్ బి 12 (లేదా బి కాంప్లెక్స్), విటమిన్ డి (కాల్షియంతో పాటు) తీసుకుంటే పోషకాహార లోపాలు కారణంగా ఏర్పడిన ఒంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
- యాన్జియోలిటిక్స్ లేదా యాంటీ డిప్రెసెంట్స్ - ఇవి ఓవర్-ది-కౌంటర్ ఔషధాలు (మందుల షాపుల్లో వైద్యుడి చీటీ లేకుండా నేరుగా కొనుక్కోగలిగిన మందులు) కాదు మరియు సాధారణంగా మనస్తత్వవేత్త యొక్క ప్రిస్క్రిప్షన్ అవసరం, కానీ అంతర్లీన కారణం మానసికమైంది అయితే ఈ మందులు సహాయపడుతాయి.
కొన్ని సందర్భాల్లో, ఒంటి నొప్పి కండరాల బిగుతు (muscle tightness) తో సంబంధం కలిగి ఉన్నప్పుడు; ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్, రుద్దడం, లేదా ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలు వ్యాధి లక్షణాల నుండి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి.