సారాంశం
అంటువ్యాధి కారకాలు మరియు వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి వాటి ఉత్పత్తి స్థానం నుండి రక్త ప్రవాహంలో వ్యాపించడాన్ని రక్త సంక్రమణ అని అంటారు.ఇది సూక్ష్మజీవుల సంక్రమణ వలన కలిగే ఒక ఉపద్రవం. రక్త సంక్రమణ అనేది ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ఇది ప్రాణాంతకమవుతుంది, అందువల్ల తక్షణమే అత్యవసర చికిత్స అవసరం అవుతుంది. శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల లేదా తగ్గుదల, గుండె కొట్టుకొనే వేగం మరియు శ్వాస క్రియ వేగం (ఊపిరి) లో పెరుగుదల వంటివి రక్త సంక్రమణ యొక్క లక్షణాలు. రక్తపోటు మరియు శరీర ఉష్ణోగ్రతతో సహా సంపూర్ణ శారీరక పరీక్ష, మూత్ర పరీక్ష మరియు సంపూర్ణ రక్త కణాల లెక్కింపు (సిబిసి) వంటి పరిశోధనా పరీక్షలు రోగనిర్ధారణకు చాలా ముఖ్యమైనవి. రక్త పరీక్షలు సాధారణంగా తెల్ల రక్త కణాల లెక్కింపులో గణనీయమైన పెరుగుదలను చూపుతాయి. క్లినికల్ నిర్థారణలు (ఆనవాలు మరియు లక్షణాలు) మరియు పరిస్థితి తీవ్రతపై రక్త సంక్రమణ యొక్క చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్సలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచడం మరియు మందుల ద్వారా రక్తపోటుని నియంత్రణలో ఉంచడంతో పాటుగా ఫ్లూయిడ్ మరియు యాంటీబయాటిక్ నిర్వహణ చేయబడుతుంది. రక్త సంక్రమణ ఫలితం సరికానిది ఎందుకంటే, చికిత్స ప్రారంభించే సమయానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవచ్చు. రక్త సంక్రమణ యొక్క ఖచ్చితమైన మూలాన్ని గుర్తించడం చాలా కష్టతరం అయినందున దాని ఫలితం కూడా సరియైనది కాదు.