రక్తం గడ్డ కట్టే వ్యాధులు అంటే ఏమిటి?
రక్తం గడ్డకట్టే వ్యాధులు అంటే రక్త స్రావం దీర్ఘవ్యవధుల పాటు కొనసాగుతుండే పరిస్థితి లేదా రక్తనాళాల లోపలే రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. అంతర్గత అవయవాలు లేదా రక్తనాళాల లోపలనే రక్తస్రావం దీర్ఘకాలంపాటు కొనసాగితే, అలాంటి పరిస్థితి వైద్య అత్యవసరపరిస్థితికి కారణమవుతుంది.
రక్తం గడ్డ కట్టే వ్యాధిప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రక్తం గడ్డ కట్టే వ్యాధిలో రెండు రకాలున్నాయి. అవి రక్తస్రావం వ్యాధులు (లోపాలు) మరియు గడ్డకట్టే వ్యాధులు. ఈ రెండు రకాల వ్యాధుల్లో ప్రతిదీ సంబంధిత వ్యాధి లక్షణాల్ని కల్గి ఉంటాయి.
రక్తస్రావం రుగ్మతల సంకేతాలు మరియు లక్షణాలు:
- చిన్న చిన్న గాయాల (కట్స్) ద్వారా సులభంగా అధిక రక్తస్రావం కావడం.
- సులభంగా ఏర్పడే గాయాలు.
- తరచుగా ముక్కునుంచి రక్తం కారడం (epistaxis)
- అధిక ఋతు రక్తస్రావం .
- మల-మూత్రాల్లో రక్తస్రావం (నలుపు రంగులో మల విసర్జన కావడం).
- గాయం లేకుండా కీళ్ళు లోకి రక్తస్రావం కావడం.
రక్తం గడ్డ కట్టించే రుగ్మత యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రక్తం గడ్డకట్టే వ్యాధులనే “తీవ్రమైన స్థాయిల్లో ఉన్న రక్తం గడ్డకట్టే వ్యాధి” (హైపర్కోగ్యులబుల్ స్టేట్స్) అని కూడా పిలువబడతాయి. ఈ పరిస్థితులలో, నరాల్లో (సిరలలో) రక్తం గడ్డకట్టడం జరుగుతుంది మరియు ఒత్తిడి వలన ఈ రక్తంచే గడ్డలుగా ఏర్పడినవి రక్త ప్రసరణలోకి (బ్లడ్ సర్క్యులేషన్లోకి) స్థలాంతరం అవుతాయి. ఇలా గడ్డ కట్టిన రక్తం ఉండలు రక్తప్రసరణలోకి ప్రవేశించిన తర్వాత, ఆ గడ్డ కట్టిన రక్తపు గడ్డలు చిన్న రక్తనాళాలు లేదా కేశనాళికల (capillaries) లోకి వెళ్లి ఆ రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డుపడడం ప్రమాదం సంభవిస్తుంది, అటుపై వ్యాధి లక్షణాలు లక్షణాలు పొడజూపి విషమించడం జరుగుతుంది.
తీవ్రమైన స్థాయిలో ఉన్న రక్తం గడ్డ కట్టే వ్యాధి (హైపర్కోగ్యులబుల్ స్టేట్) యొక్క సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:
- పాదం (పిక్క మరియు చీలమండలాలు) యొక్క వాపు
- కాళ్ళలో బాధాకరమైన తిమ్మిరి (claudication)
- ఛాతీ నొప్పి
- శ్వాసలో సమస్య
- వేగంగా శ్వాస పీల్చడం (మరింత సమాచారం: శ్వాస సరిగ్గా అందకపోవడం కారణాలు)
- అల్ప రక్తపోటు
- పెరిగిన హృదయ స్పందన రేటు
రక్తం గడ్డ కట్టే వ్యాధికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
రక్తం గడ్డ కట్టడం అనే ప్రక్రియ యొక్క యంత్రాంగం ఏమంటే ప్లేట్లెట్లు, గడ్డకట్టే కారకాలు మరియు ప్రోటీన్లు; అందువల్ల, రక్తం గడ్డ కట్టడం యొక్క కారణాలు ఈ రక్తంలోని ఏదైనా భాగంలో అసాధారణమైనవి. రక్తస్రావం వ్యాధుల యొక్క అత్యంత సాధారణ కారణాలు ఇలా ఉన్నాయి:
- వంశపారంపర్యత - సాధారణ వ్యాధులు హేమోఫిలియా , ఇది ఒక జన్యు పరివర్తన వలన ఏర్పడే పేలవమైన రక్తం గడ్డకట్టే కారకాల కారణంగా దాపురించే వ్యాధి.
- విటమిన్ K లోపం - ఆహారంలో విటమిన్ K తక్కువగా ఉంటే రక్తస్రావం సమస్యలకు కారణం కావచ్చు.
- కాలేయ వ్యాధి లేదా కాలేయ వైఫల్యం - సిర్రోసిస్ , హెపటైటిస్ లేదా కొవ్వు క్షీణత వలన కాలేయం దెబ్బతినడం, దానివల్ల గడ్డకట్టే కారకాల ఉత్పత్తి తగ్గిపోతుంది, ఫలితంగా రక్తస్రావం వ్యాధులు దాపురించడం జరుగుతుంది.
- ఔషధ-ప్రేరిత కారణాలు - యాస్పిరిన్ మరియు వార్ఫరిన్ వంటి కొన్ని మందులు రక్తం గడ్డకట్టే పద్దతిని మారుస్తాయని పేరు పొందాయి, మరి అలాంటి మందుల దీర్ఘకాలిక వాడకంవల్ల రక్తం గడ్డకట్టే వ్యాధులు దాపురించొచ్చు.
తీవ్రంగా రక్తం గడ్డకట్టే పరిణామాల (హైపర్కోగ్లబుల్ స్టేట్స్) యొక్క సాధారణ కారణాలు:
- క్యాన్సర్
- టామోక్సిఫెన్, థాలిడోమైడ్ వంటి కెమోథెరపీ ఎజెంట్లు.
- కాలిన గాయాలు (బర్న్స్), అఘాతం (trauma) లేదా శస్త్రచికిత్స
- గర్భం
- ఊబకాయం
రక్తం గడ్డ కట్టే వ్యాధుల్ని ఎలా నిర్ధారించేది మరియు వీటికి ఎలా చికిత్స చేస్తారు?
రక్తం గడ్డ కట్టే రుగ్మతల నిర్ధారణను సాధారణంగా, వైద్య చరిత్ర మరియు జాగ్రత్తతో కూడిన వైద్య పరీక్షల సాయంతో నిర్వహిస్తారు. ఇంకా ఈ రకమైన వ్యాధుల నిర్ధారణలో కొన్ని రక్త పరీక్షలు ఉపయోగపడతాయి. అవి ఏవంటే:
- పూర్తి రక్త గణన - తక్కువ ప్లేట్లెట్ స్థాయిలు గడ్డకట్టడం సమస్యలకు సూచన.
- రక్తస్రావం సమయం మరియు రక్తం గడ్డ కట్టు సమయం - రక్తస్రావం మరియు గడ్డకట్టే సమయమును కనుగొనడం సమస్య యొక్క రకాన్ని గుర్తించటానికి సహాయపడుతుంది (ఈ పరీక్ష ప్రోటోమ్బిన్ సమయాన్ని భర్తీ చేస్తుంది మరియు పాక్షిక త్రాంబోప్లాస్టిన్ సమయాన్ని క్రియాశీలం చేస్తుంది).
- ప్రోథ్రాంబిన్ సమయం (PT) - సాధారణంగా, ఇది అంతర్గత సాధారణ నిష్పత్తి (INR) స్థాయిలలో లెక్కించబడుతుంది, ఇది రక్తం గడ్డ కట్టే సమయాన్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది.
- సక్రియం చేయబడిన పాక్షిక త్రాంబోప్లాస్టిన్ సమయం (Activated partial thromboplastin time -aPTT) - ఇది కూడా రక్తం గడ్డ కట్టే సమయాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
- కొన్ని ఇతర నిర్దిష్ట పరీక్షలలో ప్రోటీన్ C చర్య, ప్రోటీన్ S చర్య, యాంటీ త్రోంబిన్ కార్యకలాపాలు మొదలగునవి కలవు.
రక్తం గడ్డకట్టే రుగ్మతకు చికిత్స ఆ వ్యాధికి గల కారణంపై ఆధారపడి ఉంటుంది.చికిత్స కారణం-ఆధారితమైంది మరియు వ్యాధి లక్షణ ఆధారితమైంది.
చికిత్స కోసం ఉపయోగించే కొన్ని మందులు:
- యాంటీ ప్లేట్లెట్ కారకాలు - ఆస్పిరిన్ మరియు క్లోపిడోగ్రెల్, ఇది ప్లేట్లెట్ లు జమ కావడాన్ని (అగ్రిగేషన్) మరియు గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.
- యాంటీకోగులెంట్లు - వార్ఫరిన్, హెపారిన్, తక్కువ మాలిక్యులర్ బరువు కల్గిన హెపారిన్ (LMWH), మరియు ఫోండాపారినక్స్ అనేవి (మందులు) రక్తం గడ్డ కట్టడాన్ని నివారించే ఔషధాలు. ఇవి రక్తం గడ్డ కట్టే వ్యాధి తీవ్రమైన స్థాయిలో (హైపర్కోగ్యులబుల్ స్టేట్) ఉంటే దాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది.
- విటమిన్ K సప్లిమెంట్స్ - విటమిన్ K లోపం విషయంలో, విటమిన్ K తో అనుబంధంగా సహాయపడుతుంది.
- రక్త మార్పిడి లేదా ప్లేట్లెట్ మార్పిడి - ప్లేట్లెట్ల లోపం విషయంలో, రక్త ప్లేట్లెట్ల మార్పిడి రక్తస్రావ సమస్యలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
- ఫ్యాక్టర్ భర్తీ చికిత్స - హేమోఫిలియా చికిత్సలో ఫ్యాక్టర్ భర్తీ చికిత్స సహాయపడుతుంది.