చెవులు మూసుకుపోవడం అంటే ఏమిటి?
మధ్య చెవి కంఠకర్ణనాళములు (Eustachian tubes) అని పిలువబడే గొట్టాల ద్వారా ముక్కు యొక్క వెనుక భాగానికి అనుసంధానించబడి ఉంటుంది, దీనికి ఏదైనా అడ్డు తగిలితే చెవి మూసుకుపోవడానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో, సంపూర్ణతాభావం లేదా ఒత్తిడిని చెవులలో అనుభవించవచ్చు. చెవిలో మైనము చేరడం దగ్గర నుండి చెవి యొక్క సంక్రమణల (infections) వరకు చెవిలో ఒత్తిడికి దారితీసే వివిధ కారణాల వలన ఆ గొట్టంలో అడ్డంకులు ఏర్పడవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
క్రింది లక్షణాలను చెవి మూసుకుపోవడంలో చూడవచ్చు:
- మైకము
- దగ్గు
- చెవి లో నొప్పి మరియు సంపూర్ణత్వ భావన
- బాధిత చెవిలో దురద అనుభవించడం
- చెవి నుండి స్రావాలు రావడం లేదా మురికి వాసన
- బయట శబ్దాల మూలం లేకుండా చెవులలో రింగుమను మ్రోఁత (టిన్నిటస్) లేదా పాపింగ్ శబ్దాలు
- ప్రభావితమైన చెవి కారణంగా వినికిడి శక్తి తగ్గిపోడం లేదా వినికిడిలో కష్టం,
ఒక వ్యక్తికి చెవి నోప్పిని లేదా వినికిడి శక్తి తగ్గినట్టు అనిపిస్తే, వైద్యులు కర్ణభేరి దెబ్బతినడం వంటి తక్షణ శ్రద్ధ అవసరమైన సమస్యలు లేదా ఇతర సమస్యలను తనిఖీ చేయడానికి సలహా ఇస్తారు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చెవి రంధ్రాలల్లో బాహ్య సగం చర్మమంతో కప్పబడి ఉంటుంది అది మైనాన్ని (గులిమి) స్రవించే గ్రంధులను కలిగి ఉంటుంది. కర్ణభేరి వంటి లోతైన అవయవాలు, ఈ మైనము మరియు చిన్న వెంట్రుకల ద్వారా చెత్త నుండి చెవిని కాపాడతాయి, ఇవి ధూళిని మరియు ఇతర బయట పదార్దాలను చెవిలోకి చేరకుండా ఆపివేస్తాయి. కొత్త మైనము(గులిమి) దానిని భర్తీ చేసినప్పుడు ఈ పాత మైనపు (గులిమి) చిన్న మొత్తంలో చెవి ప్రారంభంలో పేరుకుపోతుంది. అయినప్పటికీ, ఈ మైనపు ఎక్కువ స్రవించడం వలన లేదా సరిగ్గా పాత మైనపు (గులిమి) తొలగించబడకపోతే, అది ఎక్కువగా పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది చెవిలో అడ్డంకులకి దారి తీస్తుంది. బాల్ పాయింట్ పెన్నులు మరియు పిన్నులు మొదలైనవి వాటిని ఉపయోగించి స్వంత పరికరాలతో తమ చెవులను శుభ్రపరిచుకునేవారిలో ఇది చాలా సాధారణం. మూసుకుపోయిన చెవులకి ఇతర సాధారణ కారణాలు:
- సైనస్ ఇన్ఫెక్షన్,జలుబు, లేదా అలెర్జీల వలన కంఠకర్ణనాళముల (Eustachian tubes) యొక్క వాపు.
- ద్రవం చేరడం .
- చెవిలో ని ఇన్ఫెక్షన్.
- డైవింగ్, ఎగరడం మొదలైన వాటి వలన చెవి ఒత్తిడిలో మార్పులు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చెవి మూసుకుపోవడాన్ని సాధారణంగా ఓటోస్కోప్ (otoscope) అనే ప్రత్యేక పరికరం ఉపయోగించి నిర్ధారిస్తారు. ఇది కాంతిని ఉపయోగించి లోపలి చెవిని విశదీకరిస్తుంది, మరియు వైద్యులు చెవిని పరిశీలించడానికి సులభంతరం చేస్తుంది.
మూసుకుపోయిన చెవి యొక్క చికిత్స ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
- కంఠకర్ణనాళముల (Eustachian tubes) జలుబు లేదా అధిక ఎత్తు ప్రదేశాల కారణంగా మూసుకుపోతే, ఈ క్రింది వాటిని ప్రయత్నించండి:
- చెక్కెర లేని చూయింగ్ గమ్ ని నమలడం లేదా ఆవులించడం,మ్రింగడం వంటివి కంఠకర్ణనాళముల (Eustachian tubes) గొట్టాలను తెరవడానికి సహాయపడతాయి.
- పైన ఉన్న నివారణ పని చేయకపోతే ముక్కుపుటాలను మూసివేసి మరియు నోటిని మూసి, శాంతముగా శ్వాసించడం ద్వారా మళ్లీ ప్రయత్నించండి. ఒక టాప్ మని వినిపించే శబ్దం గొట్టం తెరవబడిందని సూచిస్తుంది.
- మైనపు కారణంగా చెవి రంధ్రము మూసుకుపోతే, ఈ కింది పద్ధతులను ఉపయోగిస్తారు:
- ఒక చిన్న, వక్రమైన వస్తువు దానిని క్యారెట్ (curette) అని పిలుస్తారు. దానిని ఉపయోగించి వైద్యులు అదనపు గులిమిని తొలగిస్తారు.
- వైద్యులు ఒత్తిడిని పీల్చే పరికరాన్ని ఉపయోగించి కూడా మైనాన్ని(గులిమిని) తొలగించవచ్చు.
- వెచ్చని నీటితో నింపిన సూది లేదా రబ్బరు-బల్బ్ సిరంజి వంటి వాటిని ఉపయోగించి వైద్యులు మైనాన్ని(గులిమిని) బయటకి తొలగించవచ్చు.
- పునరావృత అడ్డంకులు ఉన్న సందర్భంలో, వైద్యులు మైనపు-తొలగింపు ఔషధాలను సిఫార్సు చేస్తారు, అవి మైనాన్ని కరిగిస్తాయి, తర్వాత పత్తి ఇయర్ బడ్ లు ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.
- అలెర్జీలతో బాధపడుతున్న వ్యక్తులలో, ముక్కులోకి స్ప్రే (వెదజల్లే) చేయబడే స్టెరాయిడ్ మందులు, లేదా డీకన్గెస్టెంట్స్ (decongestants) (నోటితో తీసుకోవచ్చు లేదా ముక్కులోకి స్ప్రే చేయవచ్చు) వంటివి, స్వతస్సిద్ధంగా (automatically) అడ్డంకిని తొలగిస్తాయి.
- ఇన్ఫెక్షన్ల విషయంలో, యాంటీబయాటిక్స్ ను సూచించవచ్చు.
- కొన్నిసందర్భాలలో మూసుకుపోయిన కంఠకర్ణనాళములకు (Eustachian tubes), శస్త్రచికిత్స కూడా అవసరం.