గర్భధారణ సమయంలో యోని రక్తస్రావం ఏమిటి?
గర్భధారణ సమయంలో యోని రక్తస్రావం అనేది గర్భధారణ దశ మరియు గర్భధారణ యొక్క త్రైమాసికంపై ఆధారపడి ప్రమాదకరామా కాదా అని తెలుస్తుంది. చాలా సందర్భాలలో, గర్భం యొక్క ప్రారంభ దశల్లో రక్తస్రావం ప్రమాదకరం కాదు. అయినప్పటికీ, 12 వారాల గర్భధారణ సమయం దాటిన తర్వాత సంభవించే యోని రక్తస్రావం అనేది గర్భస్రావాన్ని లేదా గర్భాశయం వెలుపల గర్భధారణను సూచిస్తుంది. గర్భధారణ సమయంలో యోని రక్తస్రావానికి గర్భాశయం యొక్క సంక్రమణ (infection), గర్భాశయంలో అసాధారణత, మాయ (placenta) యొక్క చీలిక, తచిన్నగా ఉన్న మాయ, మొదలైనవి ఇతర కారణాలుగా ఉన్నాయి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ యొక్క మొదటి మరియు రెండవ వారాలలో రక్తస్రావం లేదా రక్త చుక్కలు కనిపించడం వంటివి సాధారణంగా ఇతర సంకేతాలు మరియు లక్షణాలతో సంబంధం కలిగి ఉండవు. గర్భధారణ ఆఖరి నెలల్లో రక్తస్రావంతో సంబంధం ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు అనేవి గర్భస్రావం, ఎక్టోపిక్ గర్భం (గర్భాశయం కాకుండా ఇతర ప్రాంతాల్లో పిండం ఏర్పడడం, సాధారణంగా ఫెలోపియన్ నాళాలలో) మొదలైన తీవ్రమైన పరిస్థితులకు సూచికలు కావచ్చు. ఈ లక్షణాలు:
- పొత్తికడుపు లో తీవ్రమైన బాధాకరమైన నొప్పి (మరింత సమాచారం: ఉదార సంబంధ నొప్పుల చికిత్స)
- కణజాల లేదా రక్త గడ్డలు స్రవించడం
- మూత్రం విసర్జన సమయంలో నొప్పి మరియు మల విసర్జన సమయంలో నొప్పి గర్భాశయం వెలుపల గర్భధారణతో సంబంధం కలిగి ఉంటుంది
- గర్భాశయం వెలుపల గర్భధారణలో ఫెలోపియన్ ట్యూబ్ చీలిపోవడం వలన అంతర్గత రక్తస్రావం కారణంగా అస్వస్థత లేదా కళ్ళుతిరగడం
- గర్భాశయం వెలుపల గర్భధారణలో ఫెలోపియన్ ట్యూబ్ చీలికతో కూడా భుజం నొప్పి సాధారణంగా ఉంటుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- ప్రారంభ దశ గర్భధారణ సమయ యోని రక్తస్రావం కారణాలు
- పిండం అమరిక (గర్భాశయం లోపల ఫలదీకరణం తర్వాత పిండం యొక్క అమరిక) ఫలదీకరణం తర్వాత 1-2 వారాలు వరకు రక్త చుక్కలు పడడానికి దారితీస్తుంది
- లైంగిక సంభోగం తరువాత గర్భాశయానికి రక్త సరఫరా పెరిగడం వలన రక్తస్రావం లేదా రక్త చుక్కలు పడడం జరుగుతుంది
- సంక్రమణ (ఇన్ఫెక్షన్)
- గర్భస్రావం లేదా గర్భధారణ ప్రారంభదశలో నష్టం జరగడం
- గర్భాశయం వెలుపల గర్భధారణ
- ఆఖరి దశ దశ గర్భధారణ సమయ యోని రక్తస్రావం కారణాలు
- గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా గర్భాశయ చిన్న పొక్కుల పెరుగుదల
- చీలిన మాయ (ప్లాసెంటా)
- చిన్నగా పెరిగిన మాయ
- ముందస్తు నొప్పులు
- ప్లాసెంటా అక్రిటా (Placenta accreta) (గర్భాశయం యొక్క లోపలి గోడలోకి ప్రవేశించిన మాయ అది వేరు చేయబడదు)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వివరణాత్మక చరిత్ర, లక్షణాలు, శారీరక పరీక్ష, యోని పరీక్ష మరియు వేర్వేరు పరిశోధనల ద్వారా వైద్యులు గర్భధారణ సమయంలో రక్తస్రావం యొక్క కారణాన్ని కనుగొంటారు.
- యోని పరీక్షలు సంక్రమణ, గర్భాశయ చిన్న చిన్న పొక్కులు, గర్భాశయ క్యాన్సర్, మొదలైన కారకాలు యోని రక్తస్రావ కారణాన్నీ గుర్తించడంలో సహాయపడతాయి.
- గర్భస్రావాన్ని సూచించే యోని రక్త కణజాల నమూనా యొక్క మైక్రోస్కోపిక్ పరీక్ష.
- అల్ట్రాసోనోగ్రఫి (Ultrasonography), గర్భస్థ శిశువు, పిండం హృదయ స్పందన మరియు ఎక్టోపిక్ గర్భధారణను (గర్భాశయం వెలుపల గర్భధారణ) గుర్తించడంలో సహాయపడుతుంది.
- బీటా మానవ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (beta human chorionic gonadotropin) యొక్క తక్కువ లేదా నెమ్మదిగా పెరుగుతున్న స్థాయిలు అనేవి జరగబోయే గర్భస్రావం లేదా ఎక్టోపిక్ గర్భధారణను (గర్భాశయం వెలుపల గర్భధారణ) సూచిస్తాయి.
చికిత్స:
- పిండం యొక్క అమరిక కారణంగా రక్త చుక్కలు పడడం అనేది సాధారణంగా చికిత్స లేకుండా పరిష్కరమవుతుంది.
- గర్భస్రావం లేదా ఎక్టోపిక్ గర్భస్రావం (గర్భాశయం వెలుపల గర్భధారణ) వలన రక్త స్రావానికి చికిత్స అవసరమవుతుంది:
- గర్భస్రావం తప్పనిసరి అయినప్పుడు - గర్భాశయం నుండి సహజంగానే, ఔషధాలతో లేదా శస్త్రచికిత్స ద్వారా కణజాలాన్ని బయటకు తీసివేయడాన్ని అనుమతించాలి.
- ఎక్టోపిక్ గర్భం (గర్భాశయం వెలుపల గర్భధారణ) విషయంలో మిగిలిపోయిన కణజాలం తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం.
- కొన్నిసార్లు ప్రొజెస్టెరాన్ హార్మోన్ మరియు దాని మార్చబడిన రూపాలు గర్భధారణ సమయంలో రక్తస్రావం చికిత్సకు ఉపయోగించబడుతాయి.
- Rh- నెగిటివ్ రక్తం గ్రూపు మహిళలకు Rh- ఇమ్యునోగ్లోబులిన్ ఎక్కించబడుతుంది.