బాక్టీరియల్ వేజైనోసిస్ (BV) అంటే ఏమిటి?
యోని లో ఉండే సూక్ష్మజీవులు అనేవి ఉపయోగకరమైన మరియు హానికరమైన బాక్టీరియాల యొక్క మిశ్రమం. బాక్టీరియల్ వేజైనోసిస్ మంచి వాటిని హానికరమైన బాక్టీరియా అధిగమిస్తున్నప్పుడు యోనిలో సంభవిస్తుంది.
బాక్టీరియాల మధ్య అసమతుల్యత యోని ప్రాంతంలో వాపుకు కారణమవుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ పరిస్థితితో బాధపడుతున్న స్త్రీలలో సగం మందికి ఏ లక్షణాలు కనిపించవు. కొంతమందిలో, లక్షణాలు తరచుగా కనిపించి మరియు వెంటనే తగ్గిపోవచ్చు. లక్షణాలు కనిపించే మహిళలలో, సాధారణ సంకేతాలు
- మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం
- యోని నుండి అసహ్యమైన 'చేపలుగల' వాసన (మరింత చదువు: యోని వాసన)
- తెల్లని లేదా శ్లేష్మం యోని ఉత్సర్గ
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- యోనిలోని బాక్టీరియాలలో అత్యంత సాధారణమైన రకం గార్డ్నెరెల్ల (Gardnerella). బాక్టీరియల్ వేజైనోసిస్ యొక్క చాలా సందర్భాలలో ఈ బ్యాక్టీరియా బాధ్యత వహిస్తుంది.
- యోని వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా లాక్టోబాసిల్లి(Lactobacilli). లాక్టోబాసిల్లస్ సంఖ్యలో క్షీణత కూడా వేజైనోసిస్ కు కారణమవుతుంది.
ఈ సంక్రమణకు/ ఇన్ఫెక్షన్కు సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలు:
- ధూమపానం
- బహుళ భాగస్వాములతో ఉన్న సెక్స్
- డౌచింగ్ (యోనిని అధిక దార నీటితో లేదా మందుల మిశ్రమాలతో కడగడం)
- గర్భాశయ పరికరాలు (IUD లు) బాక్టీరియల్ వేజైనోసిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిరూపించడానికి తగినంత అధ్యయనాలు లేవు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- స్త్రీల వైద్య నిపుణురాలు లక్షణాలు మరియు యోని పరీక్ష ఆధారంగా బాక్టీరియల్ వేజైనోసిస్ ను నిర్ధారిస్తారు.
- యోని స్రావాలను బ్యాక్టీరియా యొక్క తనిఖీ కోసం సూక్ష్మదర్శినితో పరీక్షిస్తారు. ఈ పరిశోధన ఏ ఇతర బాక్టీరియల్ సంక్రమణలు లేదా గోనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధుల (STD) యొక్క అనుమానాన్ని నిర్మూలించడానికి కూడా సహాయపడుతుంది.
- బాక్టీరియల్ వేజైనోసిస్ను తరచుగా ఈస్ట్ ఇన్ఫెక్షన్లగా పొరపాటు పడవచ్చు, కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్లో యోని స్రావాలు చాలా చిక్కగా మరియు వాసన లేకుండా ఉంటుంది.
బాక్టీరియల్ వేజైనోసిస్ యొక్క చికిత్స పూర్తిగా లక్షణాలు మీద ఆధారపడి ఉంటుంది.
- ఎటువంటి లక్షణాలు చూపించని మహిళలకు చికిత్స అవసరం లేదు.
- యోని దురదతో బాధపడుతున్న వాళ్లకు, అసౌకర్యం లేదా స్రావాలను నయం చేయడానికి యాంటీబయాటిక్స్తో చికిత్స ఉంటుంది. చికిత్సలో సుమారు 6-8 రోజులు ఉపయోగించవలసిన మాత్రలు మరియు సమయోచిత క్రీమ్లు ఉంటాయి.
- సంక్రమణ పునరావృతమైతే, యాంటిబయోటిక్ కోర్సు ను పెంచవలసి ఉంటుంది. పునరావృత్తాన్ని నివారించడానికి, ప్రతి రోగి సూచించిన విధంగా, పూర్తి కాలం పాటు మందులును తీసుకోవలసి ఉంటుంది.
పునరావృత్తాన్ని నిరోధించడానికి స్వీయ రక్షణ చర్యలు:
- క్రమం తప్పకుండా STD ల కోసం పరీక్షించుకోవాలి మరియు బహుళ భాగస్వాములతో శృంగారాన్ని నివారించాలి.
- డౌచింగ్ (యోనిని అధిక దార నీటితో లేదా మందుల మిశ్రమాలతో కడగడం) చేయవద్దు. తగినంత నీటితోనే శుభ్రపరచాలి.
- ఐ.యు.డి (I U D) ని వైద్యునితో క్రమంగా తనిఖీ చేయించుకోవాలి.
- యోనిని శుభ్రపరచడానికి తేలికపాటి, సుగంధరహిత సబ్బులు ఉపయోగించాలి.