నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) - Anesthesia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

March 06, 2020

నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు
నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు

అనస్థీషియా అంటే ఏమిటి?

అనస్థీషియా అనేది శస్త్రచికిత్సా చేస్తున్నసమయంలో వ్యక్తికి బాధను లేకుండా చేసే ఒక వైద్య ప్రక్రియగా చెప్పవచ్చు. అనస్థీషియా ఔషధాలగా పిలువబడే విస్తృత శ్రేణి మందులను ఉపయోగించి అనస్థీషియా ఇవ్వబడుతుంది. స్థూలంగా చెప్తే, అనస్థీషియా మందులు మూడు రకాలుగా ఉంటాయి: స్థానిక (local), ప్రాంతీయ (regional) మరియు సాధారణ (general) అనస్థీషియా.

స్థానిక (local) మరియు ప్రాంతీయ (regional) మత్తుమందులు శరీరం యొక్క ప్రత్యేక భాగానికి తిమ్మిరి ఇవ్వడానికి ఉపయోగిస్తారు, అయితే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి మేలుకొనే ఉంటాడు. సాధారణ (general) అనస్థీషియా ప్రక్రియలో వ్యక్తి నిద్రిస్తాడు.

ఇది ఎలా పని చేస్తుంది?

సాధారణ(general) అనస్థీషియా ఒక వ్యక్తికి ఎక్కించినప్పుడు, మెదడు మరియు శరీరంలోని నాడి సైగలకు (nerve signals) అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో, వ్యక్తికి ఏమి జరుగుతుందో పూర్తిగా తెలియదు. ఇది నొప్పిని తెలియజేయడానికి మెదడుని అనుమతించదు మరియు అందువలన శరీరంలోని అవయవ / భాగం తిమ్మిరితో ముడిపడిన స్థితిలో కొనసాగుతుంది.

హృదయ స్పందన రీతి, రక్తపోటు మరియు ఒత్తిడి హార్మోన్ విడుదల వంటి శారీరక ప్రక్రియలను స్థిరంగా నిర్వహించడానికి కూడా అనస్థీషియా సహాయపడుతుంది.

ఇది ఎవరుకి అవసరం?

తీవ్ర నొప్పిని తగ్గించడానికి ప్రజలకు అనస్థీషియా ఇవ్వబడుతుంది. నొప్పి లేదా చికిత్స చేసే రకాన్ని బట్టి, అనస్థీషియా యొక్క రకం కూడా మారుతుంది.

చర్మంపై ఏదైనా కోతకి, ఇది ఎక్కువ సమయం పట్టే శస్తచికిత్సలకి, శ్వాసను ప్రభావితం చేసేవాటికి లేదా గుండె లేదా మెదడు వంటి ముఖ్యమైన కీలకమైన అవయవం యొక్క శస్తచికిత్సలకి ఈ ప్రక్రియ ఉపయోగించబడుతుంది.

ఇది ఎలా చెయ్యబడుతుంది?

సాధారణంగా, ప్రజలు శాస్త్రచికిత్సలకి వచ్చే ముందు వారి అనస్తీషిస్టులను కలవడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది గొప్ప సహాయం. వ్యక్తి గురించి తెలుసుకుని, అనస్థీషియాకు ముందు కొన్ని ఔషధాలను వినియోగిస్తే సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు నమ్మితే వాటిని నిరోధిస్తారు.

అనస్థీషియా సాధారణంగా వీటి ద్వారా ఇవ్వబడుతుంది:

  • ఇంజెక్షన్
  • మందుని పేల్చడం ద్వారా
  • సమయోచిత (కొన్ని శరీర భాగాల అంచులమీద లేదా చర్మం మీద ప్రత్యక్ష పూత) ఔషదంగా
  • చల్లడం ద్వారా (స్ప్రే)
  • కంటి చుక్కలు
  • చర్మ అతుకు ద్వారా

ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి రక్తపోటు, హృదయ స్పందన రీతి మరియు శ్వాస రీతి వంటి మానవ శరీరం యొక్క ముఖ్యమైన ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు.

స్థానిక (local) మరియు ప్రాంతీయ (regional) అనస్తీషియాలో, వ్యక్తి మేలుకొని ఉంటాడు, మరియు వైద్యుడు ఆపరేషన్ చేసే ప్రాంతం వద్ద అనస్థీషియాని నిర్వహిస్తాడు, దంత చికిత్సలకు నోటిలో, చిన్న కటి శస్త్రచికిత్సలకు నడుము కింద మరియు మరిన్ని. అటువంటి సందర్భాలలో, అనస్థీషియా నిర్వహించబడిన ప్రాంతంలో మాత్రమే తిమ్మిరితో కూడిన మరియు నొప్పిలేకుండా శస్త్రచికిత్స ప్రక్రియ నిర్వహిస్తారు.



వనరులు

  1. National institute of general medicine science. Anesthesia. U.S. Department of Health and Human Services. [internet].
  2. College of Anaesthetists. Before coming to hospital. Australian and New Zealand
  3. Antkowiak B. How do general anaesthetics work?. Naturwissenschaften. 2001 May;88(5):201-13. PMID: 11482433
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Anesthesia
  5. U.S food and drug administration. Pediatric Anesthesia. US. [internet].

నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) కొరకు మందులు

Medicines listed below are available for నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹329.0

₹114.0

Showing 1 to 0 of 2 entries