సారాంశం
ఎర్ర రక్త కణాల సంఖ్య (RBC) లేదా హేమోగ్లోబిన్ సాంద్రత తగ్గడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఇనుము లోపం వలన కలిగే రక్త హీనత, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా మరియు మరిన్ని అనేక రకాలైన రక్తహీనతలు ఉన్నాయి. పరాన్నజీవి సంక్రమణ వలన భారీ రక్త నష్టం, భారీ రుతుస్రావo, గర్భం మరియు అసమతుల్య పోషణ వంటివి ఈ పరిస్థితికి కారణాలు కావచ్చు. రక్త హీనత అనేది అలసట, బలహీనత, పాలి పోయిన లేత చర్మం మరియు శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. హేమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాలు లెక్కింపు, పరాన్నజీవి సంక్రమణను తొలగించడానికి మల పరీక్ష, మరియు అప్లాస్టిక్ రక్తహీనత విషయంలో ఎముక మజ్జ యొక్క పరీక్షతో సహా పూర్తి రక్త కణాల లెక్కింపు వంటి విశ్లేషణ పరీక్షల ద్వారా దీనిని పరిశోధించవచ్చు. రక్తహీనత యొక్క చికిత్స దాని సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు పోషకాహార లోపం అనీమియా విషయంలో సరైన పోషకాహారం మరియు ఐరన్ కలిగిన మందులు వాడవచ్చు. తీవ్రమైన రక్తహీనత అయినచో మొత్తం రక్త మార్పిడి చేయుట ద్వారా నయం చేయబడుతుంది. అప్లాస్టిక్ రక్తహీనత లేదా నిరంతర రక్తహీనత విషయంలో, ఎముక మజ్జ మార్పిడి సాధారణంగా చివరి ప్రయత్నం అవుతుంది. రక్తహీనత యొక్క ఫలితం సంబంధిత స్థితిపై ఆధారపడి ఉంటుంది మరియు చాలా వరకు దీని కారణాలపై చికిత్స చేయవచ్చు, ఇది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. పరిస్థితి సరిగా లేనట్లయితే, రక్తహీనత వలన అకాల డెలివరీ, నవజాత శిశువులో రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం, మూర్ఛలు మరియు ఇతరులలో అవయవ నష్టం వంటి సమస్యలకు దారి తీస్తుంది.