గర్భధారణ సమయంలో ఆమ్లత్వం అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో వచ్చే ఆమ్లత్వం అనేది వైద్యులు నిత్యం వినే ఒక సాధారణమైన ఫిర్యాదు. దీన్ని “గుండెల్లో మంట”గా కూడా పిలుస్తారు. సరిగ్గా పొట్టకు ఎగువన ఛాతీ కేంద్రభాగంలో మండే అనుభూతిని కలిగించేదే ఆమ్లత్వం. గర్భధారణ సమయంలో ఆమ్లత్వం ప్రమాదరహితమైంది మరియు గర్భవతులకు సాధారణంగా వచ్చేదే ఇది, అయితే వారికిది చాలా అసౌకర్యంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో ఆమ్లత్వానికి సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆమ్లత్వం లేదా ఎసిడిటీ అనేది ఛాతీలో మండుతున్నట్లుండే ఓ రకమైన వేదన. ఈ వేదన గొంతు దిగువ భాగం నుండి రొమ్ము బిందువు దిగువ వరకు కల్గుతుంది. గర్భం యొక్క రెండవ మరియు మూడవ త్రైమాసికాల (ట్రిమ్స్టెర్స్) సమయంలో ఇది చాలా సాధారణం.
ఆమ్లత్వం లేదా ఛాతీలో మండుతున్నట్లుండే వేదన ఎందుక్కల్గుతుందంటే ప్రధానంగా పొట్టలోని ఆమ్లాలతో కూడిన పదార్థాలు తిరిగి అన్నవాహికలోనికి ప్రవేశించినపుడు అవి నోటిలోనికి కూడా ఎగదన్నుకొచ్చి నోటికి పుల్లని రుచి వంటిది కల్గుతుంది. దీనివల్ల నోటిలో వికారం మరియు ఆమ్లత్వంతో కూడిన లక్షణాలను అనుభవించడం జరుగుతుంది.
గర్భిణీల ఆమ్లత్వానికి ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో ఆమ్లత్వం ప్రధానంగా హార్మోన్ల మార్పుల వలన సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో గుండెల్లో మండే పరిస్థితి తరచుగా “ప్రొజెస్టెరాన్” అని పిలువబడే హార్మోన్ కారణంగా కల్గుతుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ జీర్ణ వ్యవస్థ యొక్క కండరాలను ప్రభావితం చేస్తుంది. కడుపులోని ఆహారపదార్థాలు తిరిగి గొంతులోకి వెళ్లకుండా అడ్డుకునే అన్నవాహిక యొక్క కిందుండే కండరకవాటాన్ని ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ విశ్రాంతపరుస్తుంది, మరియు కొన్ని ఆహారాలకు సంబంధించి నియంత్రణక్రియలో మార్పుల్ని చేస్తుంది.
అంతేకాకుండా, గర్భవతుల్లో విస్తరిస్తున్న గర్భాశయం-పొత్తికడుపుకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల కడుపులోని ఆహార పదార్థాలను (stomach contents) అన్నవాహిక ద్వారా పైకి తీసుకువెళుతుంది, అవి నోట్లోపలికి ప్రవేశించి (ఆమ్లత్వంతో కూడిన రుచి) పుల్లని రుచి మరియు ఛాతీలో మండినట్లు వేదన కల్గుతుంది.
గర్భిణీల ఆమ్లత్వాన్నీ ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికెలా చికిత్స చేస్తారు?
గర్భధారణ సమయంలో వచ్చే ఆమ్లత్వాన్ని సాధారణంగా దాని లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయబడుతుంది. ఆమ్లత్వంతో కూడిన పులిత్రేన్పులు తరచు అలాగే ఉంటే, మీ వైద్యుడు మీకు యాంటీసిడ్ మందును సూచించవచ్చు.
గర్భధారణ సమయంలో ఆమ్లత్వం అనేది చాలా సాధారణంగా వచ్చేదే, అదేం భయంకరమైన పరిస్థితి మాత్రం కాదు కాబట్టి, దీన్ని సాధారణ గృహ చిట్కాలతోనే నిర్వహించుకోవచ్చు. అలాంటి గృహచిట్కా నివారణలు లేదా ఇంటి చిట్కాలు కొన్ని కిందిస్తున్నాం :
- అల్లం టీ (మితంగా మాత్రమే సేవిస్తారు).
- సాదా నీరు.
- సాదా మజ్జిగ.
- నమిలే జిగురు (chewing gum) .
- చల్లని పాలు.
- కొబ్బరి నీరు.
ఆమ్లత్వం (ఎసిడిటీ) పరిస్థితిని తగ్గించడంలో చాలా సహాయకంగా ఉండే అనేక నివారణ చర్యలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాం:
- దండిగా నీరు మరియు ద్రవాహారాలను రోజంతా త్రాగండి.
- మసాలా మరియు జిడ్డుగల ఆహారాలు, మద్యం, నిమ్మజాతి (సిట్రస్) పండ్లు మరియు కాఫీని సేవించకండి. ఇవి ఆమ్లత్వాన్ని ప్రేరేపించగలవు లేదా పరిస్థితిని మరింత అధ్వాన్నంగా మారుస్తాయి.
- ఉప్పు లేదా నూనె అధిక స్థాయిలో కల్గిన, తినడానికి సిద్ధంగా ఉండే భోజనం వంటి (ready-to-eat-meals) పదార్థాలు మరియు ఇతర విధాయిత (ప్రాసెస్డ్) ఆహారాలు తినడం మానుకోండి.
- తక్కువ, తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు భోజనం తినండి. తినేటపుడు మీ ఆహారాన్ని (మ్రింగడ్డానికి ముందుగా) సరిగా నమలి మింగండి.
- చాలా కాలం పాటు ఆకలితో ఉండిపోకుండా, ఆకలైన వెంటనే తినేస్తూ ఉండండి.
- భోజనం సమయంలో ద్రవ పదార్ధాలను పెద్ద మొత్తంలో తాగకూడదు. కార్బొనేటెడ్ వాటర్ లేదా సోడాను సేవించకండి.
- ఆహారం తిన్నవెంటనే పడుకోకండి.
- పడుకున్నప్పుడు కానీ విశ్రాంతి తీసుకునేటప్పుడు కానీ కడుపులోనుండి పుల్లని (ఆమ్లంతో కూడిన) ఆహారపదార్థాలు అన్నవాహిక లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి గాను మీ ఎగువ శరీరాన్ని దిండులను ఉపయోగించి ఎప్పుడూ పైకి ఉండేలా చూసుకోండి.